Jump to content

జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి

వికీపీడియా నుండి
A UGM-96 Trident I clears the water after launch from a US Navy submarine in 1984

జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్  సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల కంటే ఇవి విభిన్నంగా ఉంటాయి.

ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (5,500 కి.మీ. పైబడిన పరిధి) లాగానే పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు రకాల క్షిపణులు కూడా ఒకే క్షిపణి కుటుంబానికి చెంది ఉంటాయి. 

చరిత్ర

[మార్చు]

బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు అణుపాటవం గల దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఇవి నిఘా ఉపగ్రహాల కంటబడకుండా ఉంటూ, తమ అణ్వాయుధాలను ప్రయోగించగలవు. శత్రుదేశాల అణుదాడిలో నేలపై ఉండే అణ్వాయుధాలన్నీ నాశనమైనా, ఈ తొలిదాడిని తప్పించుకుని, విధ్వంసకమైన ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. దీంతో, ఏమాత్రం సందేహం వచ్చినా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం, తత్కారణంగా ప్రమాదవశాత్తూ అణుయుద్ధం మొదలయ్యే అవకాశం తొలగి పోయింది. ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ జలాంతర్గాములపై, ఎంతో కచ్చితత్వం గల క్షిపణులను మోహరించడం ద్వారా, శత్రుదేశ తీరానికి దగ్గరగా వెళ్ళి, తక్కువ ఎత్తు గల బాలిస్టిక్ పథంలో క్షిపణిని ప్రయోగించి, తొలిదాడి జరిగిన తరువాత అతి తక్కువ సమయంలో, అత్యంత కచ్చితత్వంతో ప్రతిదాడిని చెయ్యవచ్చు. అలాగే ఈ ప్రతిదాడి ద్వారా శత్రుదేశపు రాజకీయ, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే సామర్థ్యమూ వీటికి ఉంది.

రకాలు

[మార్చు]
ట్రైడెంట్ I C-4 SLBM ప్రయోగం, పునఃప్రవేశ వాహనాల దారులు
రష్యా, చైనాలకు చెందిన జ.ప్ర.బా.క్షి ఎడమ నుండి:R-29 వైసోటా (SS-N-8), R-29R (SS-N-18), R-39 (SS-N-20), R-29RM (SS-N-23), JL-1, JL-2

జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు (గత, ఇప్పటి, అభివృద్ధిలో ఉన్న) ఇవి:

రకం నాటో పిలిచే పేరు కనిష్ట పరిధి (కి.మీ.) గరిష్ఠ పరిధి (కి.మీ.) దేశం స్థితి
UGM-27 పోలారిస్ (A-1 నుండి A-3 దాకా) 4,600 అమెరికా మోహరింపు నుండి తొలగించారు
UGM-73 పోసీడాన్ (C-3) 4,600 అమెరికా మోహరింపు నుండి తొలగించారు
UGM-96 ట్రైడెంట్ I (C-4) 7,400 అమెరికా మోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5LE) 12,000 అమెరికా మోహరించారు
R-13 SS-N-4 600 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
R-21 SS-N-5 1,650 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
R-27 SS-N-6 2,400 3,000 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
RSM-40[1] R-29 "వైసోటా" SS-N-8 "Sawfly" 7,700 9,000 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
R-27K SS-NX-13 3,600 సోవియట్ యూనియన్/రష్యా Never మోహరించారు[2]
RSM-45 R-31 SS-N-17 "Snipe" 4,500 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
RSM-50 R-29R "వైసోటా" SS-N-18 "Stingray" 6,500 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
RSM-52 R-39 "Rif" SS-N-20 "Sturgeon" 8,300 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు
RSM-54 R-29RM "ష్టిల్" SS-N-23 "Skiff" 8,300 సోవియట్ యూనియన్/రష్యా మోహరింపు నుండి తొలగించారు (Under rebuild to R-29RMU "Sineva")[3]
RSM-54 R-29RMU "సినేవా" SS-N-23 "Skiff" 8,300 సోవియట్ యూనియన్/రష్యా మోహరించారు
RSM-54 R-29RMU2 "లేనర్" 8,300 12,000 సోవియట్ యూనియన్/రష్యా మోహరించారు
RSM-56 R-30 "బులావా" SS-NX-32[4] 8,000 8,300 సోవియట్ యూనియన్/రష్యా మోహరించారు
UGM-27 Polaris (A-3) and Chevaline 4,600 United Kingdom మోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5) 12,000 United Kingdom మోహరించారు
M1 3,000 ఫ్రాన్సు మోహరింపు నుండి తొలగించారు
M2 3,200 ఫ్రాన్సు మోహరింపు నుండి తొలగించారు
M20 3,000 ఫ్రాన్సు మోహరింపు నుండి తొలగించారు
M4 5,000 ఫ్రాన్సు మోహరింపు నుండి తొలగించారు
M45 6,000 ఫ్రాన్సు మోహరించారు
M51 8,000 10,000 ఫ్రాన్సు మోహరించారు
JL-1[5] 2,500 చైనా మోహరింపు నుండి తొలగించారు (never fully మోహరించారు)
JL-2 7,400 8,000 చైనా మోహరించారు
JL-3 11,000 చైనా పరీక్షిస్తున్నారు [6]
K-15 సాగరిక 750 1,900 భారత్ మోహరించారు
K-4 3,500 భారత్ అరిహంత్ తరగతి జలాంతర్గామి నుండి పరీక్షించారు.[7]
K-5 6,000 భారత్ అభివృద్ధి జరుగుతోంది[8][9]
పుక్కుక్‌సాంగ్-1/KN-11 500 2,500 ఉత్తర కొరియా అభివృద్ధి జరుగుతోంది[10]

సైనికేతర వినియోగం

[మార్చు]

కొన్ని రష్యా జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఉపగ్రహ వాహకనౌకలుగా మార్చారు. 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Korabli VMF SSSR, Vol. 1, Part 1, Yu. Apalkov, Sankt Peterburg, 2003, ISBN 5-8172-0069-4
  2. SS-NX-13 SLBM System (U), Defense Intelligence Agency, D5T-1020S-4l7-75, 1 October 1975
  3. "SSBN K-51 Verkhoturye arrived to Zvezdochka for repairs today". Rusnavy.com. 23 August 2010. Retrieved 8 October 2010.
  4. NASIC-1031-0985-09
  5. "JL-1 [CSS-N-3] – China Nuclear Forces". Fas.org. Retrieved 10 February 2012.
  6. "詹氏:大陸將試驗巨浪3飛彈 採用東風41技術". 联合早报网. Retrieved 2017-08-08.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-08. Retrieved 2018-07-02.
  8. "Going nuclear at sea". The Indian Express. 19 March 2015. Retrieved 11 January 2017.
  9. "India's First Ballistic Missile Sub to Begin Sea Trials". The Diplomat. 30 July 2013. Retrieved 11 January 2017.
  10. (2nd LD) N.K. leader calls SLBM launch success, boasts of nuke attack capacity – Yonhap, 25 August 2016 08:17 am

బయటి లింకులు

[మార్చు]