అగ్ని-5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్ని-5
దస్త్రం:Agni-V missile.jpg
అగ్ని-5 ప్రయోగం
రకంIntercontinental ballistic missile[1][2]
అభివృద్ధి చేసిన దేశంభారత్
సర్వీసు చరిత్ర
సర్వీసులో2016-Current
వాడేవారువ్యూహాత్మక బలగాల కమాండ్
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
తయారీదారుBharat Dynamics Limited
ఒక్కొక్కదాని వెల50 crore (US$6 million)[3]
విశిష్టతలు
బరువు50,000 kg[4]
పొడవు17.5 m[5]
వ్యాసం2 metres (6 ft 7 in)
వార్‌హెడ్అణ్వస్త్ర
వార్‌హెడ్ బరువు1,500 kilograms (3,300 lb)[6]

ఇంజనుమూడు దశల, ఘన ఇంధన
ఆపరేషను
పరిధి
Over 5,000 kilometres (3,100 mi) Upto 8,000 kilometres (5,000 mi)[1][7][8][9][10]
వేగంMach 40 (terminal phase)[11]
గైడెన్స్
వ్యవస్థ
Ring laser gyroscope and inertial navigation system, optionally augmented by GPS/IRNSS. Terminal guidance with possible radar scene correlation
స్టీరింగు
వ్యవస్థ
flex-nozzle Thrust vectoring(all stages)[12]
కచ్చితత్వంless than 10 m[13]
లాంచి
ప్లాట్‌ఫారం
8 × 8 Tatra TEL and rail mobile launcher (canisterised missile package) [14]
రవాణారోడ్డు లేదా రైలు

అగ్ని-5 భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన అగ్ని క్షిపణుల శ్రేణికి చెందినది. అగ్ని-5 పరిధి ఎంత అనేది రహస్యమని  DRDO అధినేత చెప్పినప్పటికీ, అది 5,500–5,800 కి.మీ. మధ్య ఉంటుందని ఆయనే చెప్పాడు. అయితే చైనా, దీని పరిధి 8,000 కి.మీ. దాకా ఉంటుందని పేర్కొంది.

అభివృద్ధి[మార్చు]

అగ్ని-3 ను మెరుగుపరచి అగ్ని-5 ను DRDO అభివృద్ధి చేస్తోందని, అది నాలుగేళ్ళలో సిద్ధమౌతుందనీ 2007 లో రక్షణ శాస్త్రవేత్త ఎం.నటరాజన్ చెప్పాడు.. దాని పరిధి 5,000 కి.మీ. వరకూ ఉంటుంది. అగ్ని-5 నాలుగైదు పరీక్షలు జరుపుకుని 2014, 2015 నాటికి మోహరింపుకు సిద్ధమౌతుందని తొలి అంచనాలు.[15] ఘన ఇంధన చోదిత అగ్ని-5 భారత రక్షణావసరాలకు సరిపోతుందని అధికారులు భావించారు.  ఈ క్షిపణి ఆసియా, ఐరోపాల్లోని లక్ష్యాలను ఛేదించగలదు.[16] క్యానిస్టరు ద్వారా ప్రయోగించగల వ్యవస్థను ఉపయోగించుకుని రోడ్డుమార్గాన తేలిగ్గా రవాణా చెయ్యగలిగేలా దీన్ని రూపొందించారు. ఈ విషయంలో మిగతా అగ్ని క్షిపణుల కంటే అగ్ని-5 విలక్షణమైనది, అవసరాలకు సరిపడేలా తేలిగ్గా మలచుకోగలిగినదీను. ఇది MIRV (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్) పేలోడ్లను కూడా మోసుకెళ్ళగలదు. మిర్వ్ పేలోడ్లు కలిగిన క్షిపణి వేరువేరు లక్ష్యాలపై ఏకకాలంలో వార్‌హెడ్లను ప్రయోగించగలదు.[17]

50 టన్నుల బరువున్న అగ్ని-5 ను  2,500 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసారు. దిశానిర్దేశం కొరకు రింగ్ లేసర్ గైరోస్కోప్, ఆక్సెలరోమీటర్ వంటి అత్యాధునిక సాంకేతికతలను అగ్ని-5 లో వినియోగించారు. దీని మొదటి దశను అగ్ని-3 నుండి తీసుకుని, మరి రెండు దశలను చేర్చి 5,000 కి.మీ. పరిధిని సాధించారు. మెరుగైన దిశానిర్దేశక వ్యవస్థల కారణంగా అగ్ని-5, అగ్ని-4 ల కచ్చితత్వం అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 ల కంటే చాలా ఎక్కువ.[18] అగ్ని-5 తన రెండవ పరీక్షలో 10 మీ. లోపు కచ్చితత్వాన్ని సాధించిందని అగ్ని ప్రాజెక్టు డైరెక్టరు టెస్సీ థామస్ చెప్పింది.

పరీక్షలు[మార్చు]

సన్నాహాలు[మార్చు]

DRDO అగ్ని-5 యొక్క మూడు దశల భూతల పరీక్షలను విడివిడిగా జరిపినట్లు సంస్థ అధిపతి వి.కె.సరస్వత్ 2011 లో చెప్పాడు. పూర్తి స్థాయి ప్రయోగం 2012 లో ఒరిస్సా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి జరుగుతుందని  ఆయన 2011 సెప్టెంబరులో చెప్పాడు.[19][20]

2012 ఫిబ్రవరి నాటికి అగ్ని-5 పరీక్షకు అంతా సిద్ధమని DRDO చెప్పింది. క్షిపణి హిందూ మహాసముద్రంలో సగం దూరం పైగా ప్రయాణిస్తుంది. అక్కడికి దగ్గర్లోని దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను తగువిధంగా హెచ్చరించాలి. ఆ ప్రాంతంలోని నౌకలను కూడా 7 నుండి 10 రోజుల ముందే హెచ్చరించాలి. పైగా క్షిపణిని గమనిస్తూ ఉండేందుకుగాను, శాస్త్రవేత్తలను, సాంకేతిక పరికరాలనూ క్షిపణి మార్గంలోను, లక్ష్యానికి దగ్గరగానూ కూడా మోహరించాలి.[21]

మొదటి ప్రయోగం[మార్చు]

సన్నాహాలన్నీ అయ్యాక, 2012 ఏప్రిల్ 19 న ఉదయం 08.05 కు, అబ్దుల్ కలాం ద్వీపం లోని లాంచ్ కాంప్లెక్స్-4 నుండి రైలు మొబైలు లాంచరు ద్వారా అగ్ని-5 ను విజయవంతంగా ప్రయోగించారు.[22][23] క్షిపణి ప్రయాణం 20 నిముషాల పాటు జరిగింది. 100 కి.మీ. ఎత్తున పునఃప్రవేశ వాహనం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ప్రయోగ స్థలానికి 5,000 కి.మీ. దూరాన హిందూమహాసముద్రంలో ఉన్న లక్ష్యాన్నికొట్టింది.[24] ప్రయోగం అన్ని పరామితులనూ సాధించిందని ప్రయోగ కేంద్రం డైరెక్టరు ఎస్.పి.దాస్ బిబిసికి చెప్పాడు.[25] అగ్ని-5 తన లక్ష్యాన్ని చాలా కచ్చితత్వంతో ఛేదించిందని వార్తలు వచ్చాయి.[26]

అగ్ని-5, 8,000 కి.మీ. పైచిలుకు దూరాలకు చేరగలదని, ఇతర దేశాలకు కలవరం కలగకుండా ఉండేందుకు భారత్ కావాలనే దీన్ని తగ్గించి చెబుతోందనీ చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు.[27][28] దీని వాస్తవ పరిధిని గోప్యంగా ఉంచారు.[10]

రెండవ పరీక్ష[మార్చు]

2013 సెప్టెంబరు 15 న రెండవ పరీక్ష జరిగింది. లాంచ్ కాంప్లెక్స్-4 నుండి మొబైలు లాంచరు ద్వారా జరిపిన ఈ ప్రయోగం విజయవంతమైంది. 20 నిముషాల ప్రయాణం తరువాత లక్ష్యాన్ని కొద్ది మీటర్ల కచ్చితత్వంతో  ఛేదించింది.[13][29]

మూడవ పరీక్ష[మార్చు]

2015 జనవరి 31 న అగ్ని-5 మూడవ పరీక్ష విజయవంతంగా జరిగింది. ఈసారి పరీక్షను కానిస్టరు నుండి జరిపారు. ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజి  డైరెక్టరు ఎం.వి,.కె.వి. ప్రసాదు, క్షిపణి ఆటో లాంచి ఎటువంటి లోపమూ లేకుండా  జరిగిందని తెలిపాడు.[30][31]

నాలుగవ పరీక్ష[మార్చు]

2016 డిసెంబరు 26 న నాలుగవ పరీక్ష విజయవంతంగా జరిగింది. అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఉదయం 11.05 గంటలకు జరిగిన ఈ పరీక్ష కానిస్టరు ద్వారా జరిగింది. దీనితో క్షిపణి అభివృద్ధి పరీక్షలు ముగిసి,  వ్యూహాత్మక బలగాల కమాండు వారి వాడుకరి పరీక్షలకు మార్గం సుగమమైంది. [32][33][34][35]

వివరం[మార్చు]

దస్త్రం:Agni Missile Range comparison.svg
అగ్ని క్షిపణి పరిధి


మిర్వ్‌లు[మార్చు]

భవిష్యత్తులో అగ్ని-5 కు మిర్వ్ సామర్థ్యాన్ని కలుగజేస్తారు. ఒక్కొక్క క్షిపణికి 2–10 వేరువేరు అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది.[36] ఒక్కో వార్‌హెడ్‌కు ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఈ లక్ష్యాలు వందల కి.మీ. దూరంలో ఉంటాయి. లేదా ఒకే లక్ష్యం మీద ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్లను ప్రయోగించగలదు.[37] 

స్పందనలు[మార్చు]

స్వదేశంలో[మార్చు]

అగ్ని-5 విజయానికి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం లభించింది. "..చైనా వద్ద ఇంకా ఎక్కువ పరిధి గల క్షిపణులున్నాయి. గతంలో భారత్ చైనా క్షిపణులకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు చైనా కూడా భారత్ క్షిపణులకు అందుతోంది. దీంతో క్షిపణి నిరోధంలో సమతుల్యత ఏర్పడింది." అని భారత మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి కవల్ సిబల్ రాసాడు [38]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Rajat Pandit (17 November 2011). "Eyeing China, India to enter ICBM club in 3 months". The Times of India. Archived from the original on 19 April 2012. Retrieved 19 April 2012.
 2. Rahul Datta (8 October 2011). "With Russian help, India to enter ICBM club soon". Dailypioneer. Retrieved 20 April 2012.
 3. "India has all the building blocks for an anti-satellite capability". India today. Retrieved 12 August 2012.
 4. T.S. Subramanian (23 July 2011). "Preparations apace for Agni V launch". The Hindu. Retrieved 19 April 2012.
 5. "DRDO plans to test 10 missiles this year". The Times of India. 27 January 2011. Archived from the original on 1 మే 2013. Retrieved 19 October 2011.
 6. Rajat Pandit (20 April 2012). "Canister storage gives N-capable Agni-V missile flexibility". The Times of India. Retrieved 20 April 2012.
 7. "India downplayed Agni-V's capacity: Chinese experts". Beijing, China: The Hindustan Times. Indo-Asian News Service. April 20, 2012. Archived from the original on 7 June 2014. Retrieved 13 July 2014.
 8. "India successfully tests Agni-V intercontinental missile – Global Times". Archived from the original on 2018-02-07. Retrieved 2016-12-26.
 9. "India eyes Agni-VI to double range". Asianage. 20 April 2012. Archived from the original on 22 April 2012. Retrieved 29 April 2012.
 10. 10.0 10.1 DHNS (21 April 2012). "Agni V can launch mini-satellites too". Deccan Herald. Retrieved 21 April 2012.
 11. Raj Chengappa (16 April 2012). "India's most potent missile Agni V all set for launch". The Tribune. Retrieved 19 April 2012.
 12. Brügge, Norbert. "India's solid-fuel ballistic missile-family "Agni"". Presentation of Space Launch Vehicles. Archived from the original on 8 December 2016. Retrieved 26 December 2015. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2015-12-08 suggested (help)
 13. 13.0 13.1 "Agni-V vital: Tessy Thomas". The Hindu. 2 October 2013. Retrieved 23 October 2013.
 14. Y. Mallikarjun, Agni-V design completed; to be test-fired in 2010 Archived 2009-02-20 at the Wayback Machine, The Hindu, 27 November 2008
 15. "Missile defence system ready for induction: DRDO chief". IndianExpress news service. 28 April 2012. Retrieved 1 May 2012.
 16. Rajat, Pandit (24 February 2012). "Decks cleared for first test of 5000-km range Agni-V missile". Times of India. Archived from the original on 24 April 2012. Retrieved 10 March 2012.
 17. "No intention to cap missile plan". Business Standard. Retrieved 21 April 2012.
 18. Rajat, Pandit (24 February 2012). "Decks cleared for first test of 5000-km range Agni-V missile". Times of India. Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 10 March 2012.
 19. Rajat, Pandit (24 February 2012). "Decks cleared for first test of 5000-km range Agni-V missile". Times of India. Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 10 March 2012.
 20. Agni-5 demo in February 2012 Archived 2012-06-18 at the Wayback Machine.
 21. Rajat, Pandit (24 February 2012). "Decks cleared for first test of 5000-km range Agni-V missile". Times of India. Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 10 March 2012.
 22. Agni-V, India's first ICBM, successfully test-fired Archived 2014-12-28 at the Wayback Machine.
 23. HT:India successfully test fires Agni-V, takes a giant stride Archived 2012-04-20 at the Wayback Machine.
 24. Y. Mallikurjan and T.S. Subramanian (23 April 2012). "Agni-V propels India into elite ICBM club". The Hindu. Retrieved 23 April 2012.
 25. "India test launches Agni-V long-range missile". BBC. First Post. 19 April 2012. Retrieved 19 April 2012.
 26. Y. Mallikurjan and T.S. Subramanian (20 April 2012). "In Wheeler Island, a perfect mission sparks celebrations". The Hindu. Retrieved 20 April 2012.
 27. IANS (20 April 2012). "Agni-V can reach targets 8,000 km away: Chinese researcher". The Times of India. Archived from the original on 21 April 2012. Retrieved 20 April 2012.
 28. "India downplaying Agni-V's potential: Chinese expert". First Post. Retrieved 20 April 2012.
 29. "India test-fires Agni V with range as far as China". Hindustan Times. 15 September 2013. Archived from the original on 24 October 2013. Retrieved 23 October 2013.
 30. "Agni 5, India's Longest Range Ballistic Missile,Successfully Test-Fired". The Arunachal Times. 31 January 2015. Archived from the original on 31 January 2015. Retrieved 26 December 2016.
 31. Y. Mallikarjun; T. S. Subramanian (31 January 2015). "Agni-V's maiden canister trial a roaring success". The Hindu. Retrieved 2 February 2015.
 32. "India successfully test-fires nuclear capable Agni-V - Times of India". The Times of India.
 33. "India successfully test-fires nuclear-capable Agni 5 ballistic missile". Hindustan Times. 2016-12-26.
 34. "Successful test firing of India's most potent missile Agni 5, paves way for induction in Strategic Forces Command". The Economic Times.
 35. "India successfully test fires Agni-V missile for a reduced range". The New Indian Express.
 36. "India test fires ICBM Agni V". IndiaVoice. 19 April 2012. Archived from the original on 18 February 2013. Retrieved 20 April 2012.
 37. "What makes 5000 km range Agni-5 missile deadlier". News.rediff.com. 12 October 2009. Retrieved 20 October 2011.
 38. Sibal, Kanwal (23 April 2012). "Agni V a positive step on security". dailymail. Retrieved 27 April 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=అగ్ని-5&oldid=3979917" నుండి వెలికితీశారు