టెస్సీ థామస్
టెస్సీ థామస్ | |
---|---|
జననం | ఏప్రిల్ 1963 |
జాతీయత | భారతీయులు |
విద్య | బి.టెక్ (ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, త్రిషూర్) ఎం.టెక్ (డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పూణే) |
వృత్తి | డి.ఆర్.డి ఓ లో మహిళా శాస్త్రవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1988 – ప్రస్తుతం వరకు |
Notable credit(s) | అగ్ని క్షిపణి ప్రాజెక్ట్ డైరక్టర్ (అగ్నీ - IV) |
బిరుదు | శాస్త్రవేత్త |
జీవిత భాగస్వామి | సరోజ్ కుమార్ |
పిల్లలు | తేజాస్ |
టెస్సీ థామస్ (జననం1964) ఘన ఇంధనాల రంగంలో నిపుణురాలు. "మిస్సైల్ మహిళ" గా, అగ్నిపుత్రిగా ఖ్యాతి గడించింది. ఆమె భారతదేశం లోని మిస్సైల్ ప్రాజెక్టును నిర్వహించిన మొదటి మహిళగా ఖ్యాతినార్జించింది. ఆమె అగ్ని క్షిపణి ప్రాజెక్ట్ డైరక్టర్ (అగ్నీ - IV]]) గా యున్నారు.
బాల్య జీవితం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె 1963 ఏప్రిల్ లో కేరళ రాష్ట్రం లోని అలెప్పీలో జన్మించారు[1] ఆమె తండ్రి చిన్న వ్యాపారి. ఆమె అలప్పుంజా (అలెప్పి) లో డ్రిగ్రీ వరకు చదివిన తర్వాత కాలికట్ లోని త్రిచూర్ ఇంజరీరింగ్ కాలేజీలో బి.టెక్ చదివారు.ఆ తర్వాత పూణే లోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ లో గైడాడ్ మిస్సైల్స్ తెక్నాలజీలో ఎం.తెక్ ను అభ్యసించారు. ఘన ఇంధన వ్యవస్థలో పరిశోధనలు చేసి నైపుణ్యం సంపాదించారు[2] ఆమె ఆరాధించే కేరళకు చెందిన తల్లిదండ్రులు ఆమెకు కలకత్తాలో పేదలకు సేవలు అందించిన నోబెల్ బహుమతి గ్రహీత ఐన మదర్ థెరెసా పేరును పెట్టారు[3][4]
స్వగ్రామంలో విద్యార్థిగా ఉన్నప్పుడు అపోలో మిషన్ ప్రయోగాలను గూర్చి తెలుసుకున్నారు. ఆనాటి నుంచి రాకెట్‌ల మీద మక్కువ పెంచుకున్నారు. ఈమె ఆరుగురు తోబుట్టువులలో ఒకరు. ఒక్కరే సోదరుడు. మిగిలిన వారంతా ఆడపిల్లలే. అందరూ విద్యావంతులే. వివిధ రంగాలలో ఉన్నత పదవులలో రాణిస్తున్నవారే. పూణే లోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ లో చేరే వరకు రక్షణ రంగంలో ప్రవేశించే ఆలోచనే రాలేదు. ఇన్స్‌స్టిట్యూట్ ఎం.టెక్ కోర్సును డిఆర్‌డిఎల్ (రక్షణ పరిశోధనా సంష్థ - తర్వాతి కాలంలో డిఆర్‌డిఓ -డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ గా మారింది) స్పాన్సర్ చేస్తూ గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ కోర్సును ప్రెవేశ పెట్టారు. ఈమె ఆసక్తితో దరఖాస్తు చేయగా ఎంపిక చేసిన పది మందిలో ఒకరుగా నిలిచారు. ఎం.టెక్ పూర్తయిన తర్వాత ఒక ఏడాది కాలం లెక్చరర్ గా పనిచేశారు. 1988 లో హైదరాబాదు లోని డిఆర్‌డిఓలో శాస్త్రవేత్తగా "బి" హోదాలో చేరారు.
కెరీర్
[మార్చు]అనతి కాలంలోనే డాక్టర్ టెస్సీ థామస్ ను ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త ఏ.పి.జె.అబ్దుల్ కలాం "అగ్ని ప్రాజెక్టు" లోకి తీసుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకు ఈమె అవిశ్రాంత కృషి, నైపుణ్యం ఎంతగానో దోహదపడ్డాయి. పని చేయడంలో దిట్ట మాత్రమే కాదు. పనిని ఎంతగానో ప్రేమిస్తారు. దేశంకోసం ఎంత చేసినా తక్కువే కాగలదని ఈమె భావన. కార్పొరేట్ సంస్థలు ఎంతగా ఊరించే జీతభత్యాలు ఇస్తామన్నా ఈమె మాత్రం డిఆర్‌డిఓ కే అంకితం కాదలచుకొని ఎన్నో అవకాశాలను తిరస్కరించారు. అబ్దుల్ కలాం ఈమెను "అగ్ని" క్షిపణి ప్రాజెక్టు లోకి తీసుకోగా క్షిపణుల రంగంలో అడుగు పెట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఈమె కలాం దగ్గర ఎన్నో వృత్తి పరమైన మెళకువలు నేర్చుకున్నారు. ఈమె శ్రద్ధ, ఏకాగ్రతలను కఠోర శ్రమను గుర్తించి ఆయన ఎంతగానో ఉత్సాహ ప్రోత్సాహాలను అందించారు. కలాం కోర్కెను కాదనక, ఈమెను అగ్ని ప్రాజెక్ట్ లోకి అనుమతించినన్ భారత ప్రధాని ఈమె పనితీరును పూర్తిగా విశ్వసించి అగ్ని-2 ప్రాజెక్టును అప్పగించారు.
దేశంలోనే అత్యంత దూరం ప్రయాణం చేసి క్షిపణి అభివృద్ధి బాధ్యతలతో ప్రవేశించిన టెస్సీ ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా, అది తన వృత్తి ధర్మంలో భాగం మాత్రమేనని భావించారు. క్షిపణి "అగ్ని" పట్ల ఈమె చూపుతున్న ఉత్సాహాన్ని చూసి బాధ్యతలను మరింత పెంచారు. అక్కడ ఈమెను జెండర్ సమస్యలు ఏవీ వేదించలేదు. "మహిళ కదా" అని ఆలోచించి ఈ అవకాశాన్ని అందించలేదు. అది కేవలం ఈమె తన స్వయం ప్రతిభతోనే సాధించుకున్నారు. ఒక మహిళగా కంటే ఒక శాస్త్రవేత్తగా ఈ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల ఆనందించారు. పనిచేసే విషయంలో కర్తవ్య నిర్వహణలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ శ్రమించేవారు. ఎదుటి వారిలో కూడా ఇవే పద్ధతులను ఆశించేవారు.
అగ్ని - 3 క్షిపణి ప్రాజెక్టు డైరక్టరుగా
[మార్చు]"అగ్ని -III" క్షిపణి 3000 కిలోమీటర్లవరకు వెళ్ళే అవధి కల క్షిపణి. ఈ ప్రాజెక్టుకు ఆమె ప్రధాన పాఅత్ర పోషించారు[5] అగ్ని-3 లో ఈమెతో పాటు ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు. అగ్ని-2, అగ్ని-3 క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. క్షిపణున నిర్మాణం, అభివృద్ధిలో తనవంతు కృషిచేశారు. ఏకంగా దేశ భద్రతకు ఉపయోగపడే కీలక క్షిపణూల్ గురించి ఈమె మనసు అహర్నిశాలు యోచిస్తుంటుంది. అగ్ని-3 ప్రాజెక్ట్ లోకి ప్రవేశించిన తర్వాత శాస్త్రవేత్తగా "ఎఫ్" హోదాకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్‌డిఓ ప్రయోగ శాలల్లో దాదాపు 200 మంది మహిళలు ఉండగా, ఈమె పనిచేస్తున్న ఎ, ఎస్.ఎల్. లోణే 20 మంది వరకు ఉన్నారు.
అగ్ని-3 క్షిపణి తొలి పరీక్ష వీలర్స్ ఐలాండ్ (ఒడిషా) లో జరిగింది. 2006 లో జరిగిన ఈ పరీక్షలో స్వల్పంగా క్షిపణి పని తీరు మందగించింది. అది బంగాళాఖాతంలో రెండుగా విడిపోయింది. ఈ క్షిపణి రెండు వేల కిలోమీటర్ల ప్రయోగంలో దెబ్బతిన్నది. క్షిపణి పరీక్ష విఫలం కాగా సాలిడ్ సిస్టం ప్రొపెల్లెంట్స్ లో నైపుణ్యం గల టెస్సీకీ ఈ పరీక్ష వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించే బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో జరిగిన లోపాలను కనుగొన్న ఈమె వాటిని సరిద్దిద్దడంలో అగ్ని-3 తదుపరి పరీక్ష విజయవంతమైనది.
2008, మే రెండవ వారంలో టెస్సీ గారు అగ్ని క్షిపణికి అసోసియేత్ ప్రాజెక్ట్ డైరక్టర్ హోదాకు ఎదిగి, అగ్ని క్షిపణుల అన్ని వెర్షన్‌లను (అగ్ని-5) ప్రాజెక్టు డైరక్టర్ గా కూడా బాధ్యతలు వహించారు. క్షిపణి రూపకల్పన ప్రక్రియలో మాత్రమే కాక దాని ప్రయోగానికి సంబంధించిన వివిధ దశలను పర్యవేక్షించడం ఈమె బాధ్యతలుగా రూపొందాయి. క్షిపణి రంగానికి సంబంధించి అత్యున్నత మహిళా అధికారి టెస్సీ కావడం మహిళా జగత్తుకు గర్వకారణం అవుతుంది.
2006, జూలై 9 న విఫలమైన అగ్ని -3 క్షిపణిని తిరిగి 2007, ఏప్రిల్ 12 వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఈ రంగంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలిచింది. ఈ ప్రయోగంలో టెస్సీ ఎటువంటి లోపాలకు తావు లేకుండా అనుకున్న వేళకు అనుకున్న సమయంలో విజయవంతంగా పరీక్షించగలిగారు. ఈ ప్రయోగ సమయంలో ఆమె హైదరాబాదు నుండి వీలర్స్ ఐలాండ్ కు చేరుకున్నారు. అదే సమయంలో ఈమె కుమారుడు స్వల్ప జ్యరంతో బాధ పడుతున్నప్పటికీ అన్ని వైపుల తీవ్ర ఒత్తిడికి గురైనా సరే స్థిర చిత్తంతో తాను చేసే వృత్తికి పరిపూర్ణ న్యాయం చేయడానికి సమాయత్తమైనారు. క్షిపణి ప్రాజెక్టుకు సహాధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ అది విజయవంతం కావడానికి కృషిచేశారు.
ఆమె "అగ్ని-4"కు ప్రజెక్టు డైరక్టరుగా పైచేసి దానిని 2011 లో విజయవంతంగా ప్రయోగించగలిగారు.[6] టెస్సీ థామస్ ఐదువేల కిలోమీటర్ల పరిధికి ప్రయోగించే సామర్థ్యం గల 'అగ్ని-5" ప్రాజెక్టులో కూడా ప్రాజెక్టు డైరక్టరుగా 2009 లో పనిచేశారు. ఈ ప్రాజెక్టు హైదరాబాదు లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీస్ లో జరిగింది [7] The missile was successfully tested on 19 April 2012.[8]. 2012 జనవరిలో జరిగిన భారత సైన్సు కాంగ్రెస్ లో ప్రధానమంత్రి డా.మన్‌మోహన్‌సింగ్ గారు ఆమెను ఈ విధంగ అకొనియాడారు.
“ | Mrs Thomas is an example of a "woman making her mark in a traditionally male bastion and decisively breaking the glass ceiling" | ” |
—మన్‌మోహన్‌సింగ్ |
జాతీయ మీడియా ఆమెపై ప్రేమతో "అగ్నిపుత్రి"గా పిచివేవారు. ఆమె "అగ్ని-5 అనునది అతిగొప్ప విజయం. ఇది దేశానికి గర్వకారణం" అని చెప్పారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]టెస్సీ గరు పూణేలో ఎం.టెక్ చదువుతున్నప్పుడే క్లాస్ మేట్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలం లెక్చరర్ గా ఉండి డి.ఆర్.డి.ఓ చేరిన తర్వాత హైదరాబాదు లోనే దంపతులు కలసి ఉండేవారు. ఆమె భర్త సరోజ్ కుమార్. ఆయన ఇండియన్ నేవీలో కొమొడోర్ గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు "జేజాస్". ఆమెకు వృత్తిమీద అమితమైన అభిమానం, శ్రద్ధాశక్తులు ఉండటం వలననే తన కుమారునికి క్షిపణీ పేరు (తేజస్) అని పెట్టారు[2] ఆమె కుమారుడు తేజస్ ప్రస్తుతం ఫోర్డ్ టెక్నాలజీస్ లో ఇంజరీరుగా పనిచేస్తున్నారు.
అవార్డులు
[మార్చు]టెస్సీ థామస్ కు మిస్సైల్ టెక్నాలజీలో చేసిన కృషికి "లాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అవార్డు" వచ్చింది.[9][10] 2009 లో "ఉమెన్ ఆఫ్ ద ఇయర్"గా "ఇందియా టుడే" పత్రిక ఎంపిక చేసి ఈమె అంతర్జాతీయ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది.
నాయుడమ్మ అవార్డు
[మార్చు]2014 సంవత్సరానికిగాను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ గీతా వరదన్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి 2015 ఫిబ్రవరి 14 న గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు. నాయుడమ్మ స్వస్థలమైన తెనాలిలో 2015, మార్చి 1వ తేదీ సాయంత్రం నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో అవార్డు ప్రదానోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా టెస్సీథామస్ ‘రక్షణరంగ అవసరాలు-చొరవ-భారత్ సంసిద్ధత’ అంశంపైనా, గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు.[11]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Profile of Dr.Tessy Thomas". Archived from the original on 2012-04-22. Retrieved 2013-12-25.
- ↑ 2.0 2.1 "Meet India's "Missile Woman"" (PDF). IWSA Newsletter. 34 (3). 2008. Archived from the original (PDF) on 17 సెప్టెంబరు 2013. Retrieved 19 April 2012.
- ↑ Fire in the Belly, With eggs: India's Missile woman: Tessy Thomas; 28th April 2012
- ↑ Bagla, Pallav. "The 'missile woman' behind India's new ICBM". BBC Online. Retrieved 21 April 2012.
- ↑ Smt. Tessy Thomas is first woman scientist to head missile project Archived 2012-04-22 at the Wayback Machine .
- ↑ "'Agni Putri' Tessy Thomas breaks glass ceiling". Archived from the original on 2012-04-19. Retrieved 2013-12-25.
- ↑ Tessy Thomas is Agni V project head
- ↑ Agni-V successfully test-fired
- ↑ "Scientist honoured for work on Agni missile tech". Retrieved 2 October 2012.
- ↑ "'Missile woman' Tessy Thomas conferred Shastri award". October 2, 2012. Retrieved 2 October 2012.
- ↑ సాక్షి దినపత్రికలో అవార్డు విశేషాలు