అగ్ని-6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్ని-6'
రకంఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత దేశం
సర్వీసు చరిత్ర
సర్వీసులో2018 (అనుకోలు)[ఆధారం చూపాలి]
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుDefence Research and Development Organisation (DRDO)
తయారీదారుBharat Dynamics Limited
విశిష్టతలు
బరువు55,000[1] - 70,000 kg[2][3]
పొడవు20[2][3] - 40.00 m[1]
వ్యాసం2 మీ[2]
వార్‌హెడ్అణ్వాయుధ
వార్‌హెడ్ బరువు3 tonnes[4]

ఇంజనునాలుగు దశలు, ఘన ఇంధనంతో[ఆధారం చూపాలి]
ఆపరేషను
పరిధి
8,000–12,000 kilometres (4,971–7,456 mi)[2][1][1][4][5][6]
గైడెన్స్
వ్యవస్థ
Inertial navigation system with Ring laser gyroscope, optionally augmented by IRNSS. Terminal guidance with possible radar scene correlation
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 Tatra TEL and rail mobile launcher (canisterised missile package) (Land-based Version)[4]

Arihant Class submarine (SLBM version-K6)
రవాణారోడ్దు లేదా రైలు మొబైలు (భూస్థిత)
జలాంతర్గామి (సముద్ర స్థిత)

అగ్ని-6 భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.[2]

వివరం[మార్చు]

అగ్ని-6 నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ప్రస్తుతం ఇది డిజైను దశను దాటి, హార్డ్‌వేర్ అభివృద్ధి దశలో ఉంది. అగ్ని-6 కి  MIRV తో పాటు, మానూవరబుల్ రీఎంట్రీ వెహికిల్ (MaRV) కూడా చేరుస్తారు. ఈ మెనూవరబుల్ వార్‌హెడ్‌లు అగ్ని-6 పరిధిని  మరింతగా. పెంచుతాయి. అయితే ఈ పరిధి ప్రస్తుతం గోప్యంగా ఉంది.[4] ఇది అగ్ని-5 కంటే పొడవుగా ఉంటుంది. 2017 లో దీన్ని పరీక్షించే అవకాశం ఉంది.[4] భారత ప్రభుత్వపు ఆమోదం ఇంకా రావలసి ఉంది. ఈలోగా DRDO దీనికి సంబంధించిన ఇంజనీరింగు పని పూర్తి చేసింది.[1][4]

అగ్ని క్షిపణుల్లోకెల్లా ఇది అత్యంత మెరుగైనది అని వార్తలొచ్చాయి. కొన్ని వర్గాల కథనం ప్రకారం అగ్ని-6 క్షిపణి 10 MIRV వార్‌హెడ్‌లను మోసుకుపోగలదు[2][5] దాని పరిధి 8,000 కిమీ నుండి 12,000 కిమీ ఉంటుంది.[1] అయితే క్షిపణి పరిధిని నిర్ధారించేందుకు DRDO నిరాకరించింది.[4] ఒక సీనియర్ DRDO శాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారం కొత్త తరం అగ్ని-6 క్షిపణి సన్నగా ఉంటుంది, దాన్ని రవాణా చెయ్యడం తేలిక, ప్రయోగించడం సులువు. దాన్ని జలాంతర్గాముల నుండి, నేలపైనున్న లాంచర్ల నుండి కూడా ప్రయోగించవచ్చు.[4][7]

చరిత్ర[మార్చు]

తెర మాటున అభివృద్ధి [మార్చు]

దస్త్రం:Agni Missile Range comparison.svg
Range comparison of Agni missiles

2009 వరకు, 10,000 కిమీ పైచిలుకు పరిధి గల ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేసే ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని అన్నారు. కానీ అటువంటి ప్రాజెక్టు ఒకటి ఈసరికే జరుగుతోందని 2011 లో వార్తలు వచ్చాయి. కొన్ని వార్తలైతే  ఆ క్షిపణికి సూర్య అని పేరు  పెట్టారనీ, అగ్ని-6 దాని సంకేత నామం అనీ కూడా చెప్పాయి .[8][not in citation given]

అసలు ఖండాంతర క్షిపణి ఒకటి అవసరం ఉందనే వాదనను భారత ప్రభుత్వం పట్టించుకోనే లేదని కొన్ని వార్తలు సూచించాయి. ప్రభుత్వం అనుమతిస్తేనే DRDO క్షిపణి అభివృద్ధిని చేపట్టగలదు. భారత్ మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (MTCR) లో  చేరలేదు కాబట్టి, ఖండాంతర క్షిపణి తయారు చెయ్యడానికి ఏ ఒప్పందాల నుంచీ కూడా దానికి అడ్డు లేదు. అయితే కొన్ని వార్తల  ప్రకారం, భారత్ MTCR లో చేరనప్పటికీ, 5,000 కిమీ కంటే ఎక్కువ పరిధి కలిగిన క్షిపణుల తయారీపై తనకు తానే మోరటోరియం విధించుకుంది. (2016 జూన్‌లో భారత్ MTCR లో చేరింది.) [9][10]

భారత వాయు సేనా నాయకుడి పరోక్ష సూచన[మార్చు]

2011 జూన్‌లో అప్పటి భారత వాయు సేన ఛీఫ్ మార్షల్ పివి నాయక్, భారత అణు దాడి సామర్థ్యాన్ని ఇరుగు పొరుగు దేశాలను దాటి ఆవలకు విస్తరించాల్సిన అవసరం గురించి గట్టిగా వాదించాడు. చీఫ్‌స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి నాయకుడు కూడా అయిన నాయక్ ఇంకా ఇలా చెప్పాడు: "10,000 కిమీ పైబడిన పరిధి గల ఖండాంతర క్షిపణిని భారత్ నిర్మించుకోవాలి. దేశ ప్రాభవం, ప్రభావం పెరిగే కొద్దీ,  ప్రాంతీయ దృష్టికోణం నుండి బయటపడాలి. మనకు ఏ దేశం పైనా కన్ను లేదు, కానీ మన స్థాయికి తగ్గ సామర్థ్యం మనకు ఉండాలి."[11]

సాధ్యాసాధ్యాలపై సందేహాలు[మార్చు]

ఖండాంతర క్షిపణి 10,000 కిమీ పైబడి ప్రయాణించేందుకు అవసరమైన సీకర్ టెక్నాలజీ (గైడెన్స్ టెక్నాలజీ) ని DRDO అభివృద్ధి చెయ్యగలదా అనే సందేహాన్ని 2011 అక్టోబరులో ది పయొనీర్ పత్రిక వెలిబుచ్చింది.[12]  ఈ సాంకేతికతను భారత్‌కి ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ రిపోర్టులో రాసారు. ఈ రిపోర్టును మరో పత్రిక ఖండిస్తూ ఇలా రాసింది: "రష్యా భారత్‌కి సాంకేతిక  సాయం చెయ్యడం నిజం అయి ఉండదు. ఒకవేళ అదే నిజమైతే  రష్యా MTCR ను అతిక్రమించినట్లే".[13] ఈ సందేహాలకు సమాధానంగా ఒక DRDO శాస్త్రవేత్త ఇలా చెప్పాడు "ఖండాంతర క్షిపణిని తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికత, ఇతర సాధన సంపత్తీ భారత్ వద్ద ఉన్నాయి.[1] కాకపోతే క్షిపణికి పరిధి ఎంత ఉండాలి, వార్‌హెడ్ ఎక్కడికి వెళ్ళాలి అనేవి రాజకీయ నిర్ణయాలు"[11]

కార్యక్రమ ధ్రువీకరణ[మార్చు]

2011 జూన్ 20 న, ఇండియన్ డిఫెన్స్ న్యూస్ ప్రచురించిన ఒక వ్యాసంలో భారత్ తన క్షిపణుల పరిధిని విస్తరించాలని తీవ్రంగా ఆలోచిస్తోందని రాసింది. 10,000 కిమీ పైబడిన  దూరాల్లోని  లక్ష్యాలను  ఛేదించేందుకు క్షిపణిని అభివృద్ధి చెయ్యాలనే DRDO ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తోంది. ఖండాంతర  క్షిపణిని నిర్మాణానికి అంతర్జాతీయ ప్రతిస్పందన లుంటాయి. అందుచేత ఈ ప్రతిపాదనపై అంతిమ నిర్ణయం మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్  సెక్యూరిటీ (CCS) తీసుకుంటుంది.[9]

2012 ఏప్రిల్లో అగ్ని-5 ను విజయవంతంగా ప్రయోగించాక, వికె సరస్వత్ మాట్లాడుతూ అగ్ని కార్యక్రమాన్ని ఇంతటితో ముగించే ఆలోచనేదీ లేదని ఈ శ్రేణిలో మరిన్ని క్షిపణులు వస్తాయనీ చెప్పాడు.[14]

ఇటీవలి ఘటనలు[మార్చు]

2012 మేలో 3 దశల అగ్ని-6 అభివృద్ధి జరుగుతోందని నిర్ధారిస్తూ వార్తలు వచ్చాయి. 2014 కల్లా క్షిపణి అభివృద్ధి పూర్తవుతుందని దాని పరిధి 8,000 నుంది 10,000 కిమీ ఉంటుందనీ తెలిసింది. అగ్ని-6, అగ్ని-5 కంటె సన్నగా ఉండి, 10 వార్‌హెడ్‌లను మోసుకుపోగలగి ఉంటుంది.[2][1] క్షిపణి డిజైను పూర్తైందని, DRDO ప్రస్తుతం సంబంధిత హార్డ్‌వేర్ ను పరిశీలించే పనిలో ఉందనీ DRDO డైరెక్టరు వికె సరస్వత్ 2013 జనవరిలో చెప్పాడు.[7][15][16]  అగ్ని-6 కు బహుళ లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యమున్నదనీ, ఇది మన బలాన్ని గుణీకరిస్తుందనీ ఆయన 2013 ఫిబ్రవరిలో చెప్పాడు

అగ్ని-6 జలాంతర్గామి ప్రయోగిత క్షిపణి [మార్చు]

అగ్ని-6 యొక్క జలాంతర్గామి రూపాన్ని తయారుచేస్తున్నామని 2102 లో  DRDO చెప్పింది. దీన్ని అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో మోహరిస్తారు. దీని పరిధి 6,000 కిమీ, పేలోడ్ 3 టన్నులు ఉంటుంది.[1][7][17]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Agni-VI with 12000 km range to be ready by 2014". IBNLive. 24 May 2012. Archived from the original on 9 అక్టోబరు 2013. Retrieved 17 July 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Subramanian, T. S. (4 February 2013). "Agni-VI all set to take shape". The Hindu. Retrieved 5 February 2013.
  3. 3.0 3.1 O'Donnell, Frank. "Managing India's Missile Aspirations". Institute for Defence Studies and Analyses. Archived from the original on 20 ఫిబ్రవరి 2013. Retrieved 19 February 2013.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Shukla, Ajai. "Advanced Agni-6 missile with multiple warheads likely by 2017". Business Standard. Retrieved 8 May 2013.
  5. 5.0 5.1 Jatinder Kaur Tur (27 May 2012). "India will launch Agni VI next, says DRDO chief". Deccanchronicle. Archived from the original on 28 మే 2012. Retrieved 17 July 2012.
  6. Prerna, Singh (2010). Atul Kohli (ed.). Routledge handbook of Indian politics. London: Routledge. p. 345. ISBN 0415776856.
  7. 7.0 7.1 7.2 "DRDO developing missile capable of carrying multiple warheads". Zee News. Retrieved 8 February 2013.
  8. "SURYA Missile".
  9. 9.0 9.1 Courtesy, The Pioneer (20 June 2011). "India Serious About 10,000 km ICBM". Indian Defence News. Archived from the original on 26 ఏప్రిల్ 2012. Retrieved 9 March 2012.
  10. "India's need for an ICBM". Center For Land Warfare Studies. 5 July 2011. Retrieved 22 February 2012.
  11. 11.0 11.1 "Air chief PV Naik in favour of flexing missile power". Archived from the original on 2012-06-27. Retrieved 2016-07-29.
  12. "With Russian help, India to join ICBM big league soon". Dailypioneer. Archived from the original on 26 April 2012.
  13. Administrator (2011-10-10). "Indian media said Russia will provide for the Indian Agni-5 intercontinental missile guidance technology". Military of China, force comment. Archived from the original on 7 జూన్ 2015. Retrieved 5 March 2012.
  14. "Agni V can launch mini-satellites too". Deccan Herald. 20 April 2012.
  15. "India working on Agni-VI missile, to be in world's elite nuclear club". The Indian Express. 8 February 2013. Retrieved 8 February 2013.
  16. "India developing Agni-VI ballistic missile". News Bulletin. 8 February 2013. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 8 February 2013.
  17. "DRDO Lab Develops Detonator for Nuclear Capable Agni-V Missile As It Gets Ready For Launch". defencenow. 17 January 2012. Archived from the original on 22 జనవరి 2012. Retrieved 29 జూలై 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=అగ్ని-6&oldid=3844956" నుండి వెలికితీశారు