సాగరిక క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
K-15/సాగరిక
దస్త్రం:BO5 K15 missile.jpg
K-15 (code-named B05) 2013 జనవరి 27 న విశాఖపట్నం తీరం నుండి ప్రయోగించారు.
రకంShort-range SLBM
అభివృద్ధి చేసిన దేశంభారత దేశము
సర్వీసు చరిత్ర
సర్వీసులో2010
వాడేవారుభారత నావికా దళం
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
విశిష్టతలు
బరువు6–7 ట. (6.6–7.7 short tons)[1][2]
పొడవు10 మీ. (33 అ.)
వ్యాసం0.74 మీ. (2.4 అ.)
వార్‌హెడ్1,000 కి.గ్రా. (2,200 పౌ.)

ఇంజనురెండు దశల ఘన ఇంధన రాకెట్ మోటార్లు
ఆపరేషను
పరిధి
  • 750 km[3] (435 mi) with 1,000 kg payload
    * 1,900 కి.మీ. (1,200 మై.) with 180 kg payload[4][5]
లాంచి
ప్లాట్‌ఫారం
అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు

సాగరిక (K-15)  జలాంతర్గామి నుంచి ప్రయోగించే  అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 750 కిలోమీటర్లు.[3] ఇది కె క్షిపణి కుటుంబానికి చెందినది. భారత అణ్వాయుధ త్రయంలో ఇది ఒక భాగం. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు ఇది ఉపయోగపడుతుంది.[6]

అభివృద్ధి

[మార్చు]

K-15 క్షిపణి అభివృద్ధి 1990 ల చివర్లో మొదలైంది. అరిహంత్ శ్రేణి జలాంతర్గాముల నుండి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణిని తయారుచెయ్యడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.[7][8] హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క క్షిపణి ప్రాంగణంలో దీన్ని తయారుచేసారు.[9]

నీటి లోపలి నుండి ప్రయోగించగల క్షిపణి ప్రయోగ వేదిక, ప్రాజెక్ట్-420, ని తయారుచేసి పరీక్షల కోసం 2001 లో భారత నావికా దళానికి అందజేసారు. దీన్ని గుజరాత్ లోని హజీరాలో తయారుచేసారు.[10] సాగరిక క్షిపణిని  అరిహంత్ జలాంతర్గామితో మేళవించి, నౌకాశ్రయ పరీక్షలు చెయ్యడం 2009 జూలై 26 న మొదలైంది.[11]

2008 నాటికి క్షిపణిని 7 సార్లు విజయవంతంగా పరీక్షించారు. నాలుగు సార్లు దాని పూర్తి పరిధిని పరీక్షించారు. 2008 ఫిబ్రవరి 26 న విశాఖపట్నంతీరప్రాంతంలో సముద్రంలో 50 మీటర్ల లోతున ఒక పాంటూన్ నుండి పరీక్షించారు.[7][9][12][13] 2008 నవంబరు 12 న భూమ్మీద నుండి ప్రయోగించగల  సాగరికను విజయవతంగా ప్రయోగించారు.[14] 2012 మార్చి 11 న పూర్తి స్థాయి పరీక్ష జరిపారు.[15] 2013 జనవరి 27 న 12 వది, చిట్టచివరిదీ  అయిన పరీక్షను జరిపారు. 'ఈ పరీక్ష అన్ని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో సాధించింది' అని DRDO డైరెక్టర్ జనరల్, వికె సరస్వత్ చెప్పాడు.[16] ఆ తరువాత క్షిపణిని అరిహంత్ లో చేర్చడానికి ప్రయత్నాలు మొదయ్యాయి.[17][18][19] 2015 నవంబరు 15 న ఆయుధాలు లేని డమ్మీ K-15 సాగరిక క్షిపణిని అరిహంత్ నుండి విజయవంతంగా పరీక్షించారు[20]. 2015 డిసెంబరులో సాగరిక ఉత్పత్తి మొదలైందని వార్తలు వచ్చాయి.[21]

ఇవి కూడా చూడండి

[మార్చు]

References

[మార్చు]
  1. "India successfully test-fires underwater missile". The Hindu. 27 January 2013. Retrieved 1 February 2013.
  2. "Sagarika missile test-fired successfully". The Hindu. 27 February 2008. Archived from the original on 29 ఫిబ్రవరి 2008. Retrieved 1 February 2013.
  3. 3.0 3.1 http://www.timesofindia.com/india/India-tests-new-underwater-nuclear-missile/articleshow/32694060.cms
  4. http://www.indiaresearch.org/Shourya_Missile.pdf
  5. Rajat Pandit (2008-05-13). "Going ballistic: India looks to join elite missile club". The Times of India. Archived from the original on 2013-12-08. Retrieved 2013-05-02.
  6. "India gets sub-marine missile power". Ibnlive.com. 2007-07-07. Archived from the original on 2008-06-17. Retrieved 2013-05-02.
  7. 7.0 7.1 "Final test of K-15 ballistic missile on Tuesday : Latest Headlines, News - India Today". Indiatoday.intoday.in. 2008-02-25. Retrieved 2013-05-02.
  8. "India ready for new missile test". BBC News. 1998-09-04. Retrieved 2013-05-02.
  9. 9.0 9.1 "Sagarika missile test-fired successfully". Hindu.com. 2008-02-27. Archived from the original on 2008-02-29. Retrieved 2013-05-02.
  10. "In a workshop at Hazira, Indian underwater missile launcher gets ready for trial". Indianexpress.com. 2001-05-28. Retrieved 2013-05-02.
  11. "thaindian.com/newsportal/india-news India joins elite group". Thaindian.com. 2009-07-27. Archived from the original on 2012-10-06. Retrieved 2013-05-02.
  12. Rajat Pandit (2008-02-19). "India ready to join elite N-strike club". The Times of India. Archived from the original on 2012-10-19. Retrieved 2013-05-02.
  13. "India can now fire missiles from under water". Ibnlive.com. 2008-05-12. Archived from the original on 2008-09-16. Retrieved 2013-05-02.
  14. India test-fires nuclear-capable missile[permanent dead link] [dead link]
  15. "K15 test fired". Ibnlive.in.com. 2012-03-13. Archived from the original on 2012-03-16. Retrieved 2013-05-02.
  16. "K-15 SLBM is a beast with gen-next tech". Indian Express. 30 January 2013. Archived from the original on 4 ఫిబ్రవరి 2013. Retrieved 5 February 2013.
  17. "India test fires missile from under sea, completes nuclear triad". NDTV. 27 January 2013. Retrieved 27 January 2013.
  18. "India successfully test-fires underwater missile". The Hindu. 27 January 2013. Retrieved 27 January 2013.
  19. "Report: India successfully tests nuclear-capable, medium-range missile". The Washington Post. 27 January 2013. Archived from the original on 28 జనవరి 2013. Retrieved 27 January 2013.
  20. Luthra, Gulshan (26 November 2015). "Nuclear capable Arihant submarine successfully test-fires unarmed missile". The Economic Times. Archived from the original on 28 జనవరి 2016. Retrieved 26 November 2015.
  21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-09. Retrieved 2016-07-22.