సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) | |
---|---|
सतीश धवन अंतरिक्ष केंद्र | |
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం | |
![]() | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 1 అక్టోబరు 1971 |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | ![]() 13°43′12″N 80°13′49″E / 13.72000°N 80.23028°E |
ఉద్యోగులు | అందుబాటులో లేదు |
వార్షిక బడ్జెట్ | ఇస్రో బడ్జెట్ చూడండి |
కార్యనిర్వాహకులు | పి. కున్‌హికృష్ణన్, సంచాలకుడు |
Parent agency | ఇస్రో |
వెబ్‌సైటు | |
[1] ISRO SHAR home page | |
Map | |
![]() | |
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం |
భారతదేశంలో రాకెట్, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రం. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
చరిత్ర[మార్చు]
1969 లో హరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. అప్పట్లో దీన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజి అనేవారు. 1971, అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి. అది మొదలు, చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్‌తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబరు 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణమ్లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.
ప్రయోగ వేదికలు[మార్చు]
షార్‌లో ప్రస్తుతం రెండు ప్రయోగ వేదికలు ఉపయోగంలో ఉండగా ఎస్సెల్వీ లాంచ్ ప్యాడ్ అనే పాత వేదికను ప్రయోగాలనుండి విరమింపజేసారు. మూడవ వేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
మొదటి ప్రయోగ వేదిక[మార్చు]
మొదటి ప్రయోగ వేదిక 1990 లలో ఉపయోగంలోకి వచ్చింది. దీన్ని పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల కోసం తయారు చేసారు. తరువాత జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు కూడా ఉపయోగించారు.
రెండవ ప్రయోగ వేదిక[మార్చు]
రెండవ ప్రయోగ వేదిక 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఇది ఆధునిక సాంకేతిక హంగులతో వివిధ రకాల రాకెట్ల ప్రయోగాలకు అనుగుణంగా సార్వత్రిక వేదికగా నిర్మించబడింది.