Jump to content

పిఎస్‌ఎల్‌వి

వికీపీడియా నుండి
(పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక నుండి దారిమార్పు చెందింది)
పిఎస్‌ఎల్‌వి
PSLV-C8 (CA Variant) carrying the AGILE x-ray and γ-ray astronomical satellite of the ASI lifting off from Sriharikota
విధిమధ్య స్థాయి వాహన వ్యవస్థ
తయారీదారుఇస్రో
మూల దేశం భారతదేశం
Size
ఎత్తు44 metres (144 ft)
వ్యాసం2.8 metres (9 ft 2 in)
బరువు294,000 kilograms (648,000 lb)
దశలు4
Capacity

|Payload to
LEO
|3,250 kilograms (7,170 lb) |- |Payload to
HCO
|1,600 kilograms (3,500 lb)[1] |- |Payload to
GTO
|1,410 kilograms (3,110 lb)[1]

|-
Launch history
స్థితిసచేతనం
ప్రయోగ స్థలాలుసతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
మొత్తం ప్రయోగాలు36
PSLV: 11
PSLV-CA: 11
PSLV-XL: 14
విజయాలు35
పిఎస్‌ఎల్‌వి-జి: 10
పిఎస్‌ఎల్‌వి--సిఎ: 11
పిఎస్‌ఎల్‌వి--ఎక్ష్‌ఎల్: 14
వైఫల్యాలు1 ('PSLV)
పాక్షిక వైఫల్యాలు1 (పిఎస్‌ఎల్‌వి)
తొలి ఫ్లైటుPSLV: 1993 సెప్టెంబరు 20
PSLV-CA: 2007 ఏప్రిల్ 23
PSLV-XL: 2008 అక్టోబరు 22
Carries passengers or cargoచంద్రయాన్-1
Boosters
బూస్టర్ల సంఖ్య6
ఇంజన్లు1 సాలిడ్
థ్రస్టు502.600 kN
స్పెసిఫిక్ ఇంపల్స్262 సెకండ్లు
మండే సమయం44 సెకండ్లు
ఇంధనంHTPB (సాలిడ్)
First stage
ఇంజన్లు1 సాలిడ్
థ్రస్టు4,860 kN
స్పెసిఫిక్ ఇంపల్స్269 సె
మండే సమయం105 సెకండ్లు
ఇంధనంHTPB (సాలిడ్)
Second stage
ఇంజన్లు1 వికాస్ ఇంజను (ద్రవ)
థ్రస్టు800 కిన్యూ
స్పెసిఫిక్ ఇంపల్స్293 సెకండ్లు
మండే సమయం158 సెకండ్లు
ఇంధనంN2O4/UDMH
Third stage
ఇంజన్లు1 సాలిడ్
థ్రస్టు328 కెన్యూ
స్పెసిఫిక్ ఇంపల్స్294 సెకండ్లు
మండే సమయం83 సెకండ్లు
ఇంధనంఘన
Fourth stage
ఇంజన్లు2 liquid
థ్రస్టు14 kN
స్పెసిఫిక్ ఇంపల్స్308 సెకండ్లు
మండే సమయం425 సెకండ్లు
ఇంధనంMMH/MON

పిఎస్‌ఎల్‌వి, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ (Polar Satellite Launch vehicle) అనే పదానికి సంక్షిప్త పదం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించి, అభివృద్ధి పరచిన ఉపగ్రహ వాహక నౌక ఇది. ఇస్రో తయారు చేసిన రాకెట్‌లలో అత్యంత విశ్వసనీయమైన పనితనాన్ని కనబరుస్తున్న నౌక ఇది. ఈ వాహక రాకెట్ గత 23 సంవత్సరాలలో 100 కు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. చరిత్రాత్మకమైన చంద్రయాన్-1, మార్సు ఆర్బిటర్ మిషన్, స్పేస్ కాప్స్యుల్ రికవరీ ప్రయోగం, ఇండియన్ రీజినల్ నేవిగేషన్ సెటిలైట్ సిస్టమ్ (IRNSS) మొదలైనవన్నీ పిఎస్ఎల్‌వి వాహక నౌక ద్వారా ప్రయోగించి విజయం సాధించారు. ఇస్రో రూపొందించిన వివిధ శ్రేణుల ఉపగ్రహ వాహకనౌకలలో అత్యంత నమ్మకమైనదిగా పిఎస్ఎల్‌వి నిలిచింది.

పిఎస్‌ఎల్‌విని మొదటిసారి 1993 సెప్టెంబరు 20 న ప్రయోగించారు. 2016 జూన్ 22 నాటికి మొత్తం 113 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. అందులో భారతదేశానివి 39 కాగా, 74 విదేశాలకు చెందినవి.[2] 2016 జూన్ 22 న పిఎస్ఎల్‌వి సి34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు.[3] ఒకే యాత్రలో ప్రయోగించిన అత్యధిక ఉపగ్రహాల రికార్డు ఇది -పిఎస్‌ఎల్‌వికి, ఇస్రోకు.

పిఎస్‌ఎల్‌వి ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టే ఉపగ్రహాల బరువు 1425 కిలోల నుండి 1750 కిలోల వరకు ఉంటుంది. భూ సమవర్తన (Geosynchronous) కక్ష్యలో లేదా భూస్థిర కక్ష్య (Geostationary) లో ప్రవేశ పెట్టే ఉపగ్రహాల భారం 1425 కిలోలు ఉంటుంది. సూర్య సమవర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టు ఉపగ్రహాల బరువు 1750 కిలోల వరకు ఉంటుంది.

పిఎస్‌ఎల్‌వి సాంకేతిక వివరాలు

[మార్చు]

ఈ ఉపగ్రహప్రయోగ వాహనం మొత్తం ఎత్తు 44 మీటర్లు. దీని వ్యాసం 2.8 మీటర్లు. ఈ రాకెట్‌లో మొత్తం నాలుగు దశలు ఉన్నాయి. ప్రయోగదశలో ఈ వాహక నౌక బరువు 320 టన్నుల వరకు ఉంటుంది (పిఎస్‌ఎల్‌వి - XLరకం). పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలో మూడు రకాలు ఉన్నాయి: పిఎస్‌ఎల్‌వి -జి, పిఎస్‌ఎల్‌వి-సిఏ, పిఎస్‌ఎల్‌వి-ఎక్స్ఎల్.

పిఎస్‌ఎల్‌వి -జి పిఎస్‌ఎల్‌వి-సిఏ పిఎస్‌ఎల్‌వి-ఎక్స్ఎల్
మొత్తం బరువు (టన్నులు) 296 229 320
స్ట్రాపాన్ బూస్టర్లు 6 (PSOM) లేవు 6 (PSOM XL)

పిఎస్‌ఎల్‌వి రకాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-జనరిక్

[మార్చు]

రాకెట్ యొక్క మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాపాన్‌ బూస్టరులు ఉంటాయి. ఈ బూస్టరులు ఒక్కొక్కటీ 11.3 మీ పొడవుతో, అన్నిటినిలోనూ కలిపి 53.52 టన్నుల ఘన ఇంధనం కలిగి ఉంటాయి.

పిఎస్‌ఎల్‌వి-సీఏ (కోర్‌ ఎలోన్)

[మార్చు]

పేరు సూచిస్తున్నట్లుగా ఇది పిఎస్‌ఎల్‌వి లోని నాలుగు దశలను మాత్రమే కలిగి ఉంటుంది, స్ట్రాపాన్ బూస్టర్లను అమర్చరు. దీనిద్వారా తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూనిమ్న దశలోకి ప్రయోగిస్తారు.

పిఎస్‌ఎల్‌వి-ఎక్స్‌ఎల్

[మార్చు]

ఇందులో అధిక దహన సామర్ధ్యం ఉన్న PSOM XL స్ట్రాపాన్‌ బూస్టర్లను ఉపయోగిస్తారు. దీనిద్వారా 1400-1700 కిలోల భారమున్న ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఈ బూస్టరులు జనరిక్ బూస్టర్ల కంటే పొడవుగా ఉండి ఎక్కువ ఇంధనాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్కటీ 14.8 మీ పొడవుతో, మొత్తం అన్ని బూస్టరులు కలిసి 77.4 టన్నుల ఘన ఇంధనం కలిగి ఉంటాయి. ఈ ఎక్స్‌ఎల్ రూపాన్ని సాధారణంగా భూ స్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టవలసిన ఉపగ్రహాల కోసం వాడతారు.

పిఎస్‌ఎల్‌వి దశల వివరాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలో నాలుగు దశలుంటాయి. నాలుగోదశ చివర, ప్రయోగించవలసిన ఉపగ్రహం లేదా ఉపగ్రహాలు అమర్చబడి ఉంటాయి. వివిధ దశలు మండే సమయం, అవి విడిపోయే ఎత్తులు కింది విభాగాల్లో ఇవ్వబడ్డాయి. వీటిని సూచన మాత్రంగా పరిగణించాలి. పేలోడ్ బరువు, నౌక కాన్ఫిగరేషను, చేరాల్సిన కక్ష్యలు మొదలైన వాటిపై ఆధారపడి ఇవి మారుతూ ఉంటాయి.

మొదటి దశ (PS1)

[మార్చు]

మొదటిదశలోని S139 ఘన ఇంధన మోటారు, 4800 కిన్యూ (కిలో న్యూటన్)ల థ్రస్ట్ (thrust)ను ఇస్తుంది. ఈ దశలో 138 టన్నుల HTPB ఇంధనాన్ని వాడతారు. మొదటి దశ 105 సెకండ్ల పాటు మండి, నౌక 74 కిమీ ఎత్తుకు చేరాక, రెండవ దశ నుండి విడిపోతుంది. మొదటి దశ విడివడి దూరం అయ్యాక రెండవ దశ మండుతుంది.

స్ట్రాపాన్ బూస్టర్లు

[మార్చు]

మొదటి దశకు 6 స్ట్రాపాన్ బూస్టర్లను అమరుస్తారు. ఈ అరింటిలో 4 బూస్టర్లు మొదటి దశతో పాటే (అర సెకండు తేడాతో) మండిస్తారు. రాకెట్ పైకిలేచిన 25 సెకండ్ల తర్వాత మిగిలిన రెండు బూస్టర్లను మండిస్తారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్లలో కూడా ఘన ఇంధనాన్నే వాడుతారు. స్ట్రాపాన్ ఇంజన్ కలుగజేయు థ్రస్ట్ 719 కిన్యూ. మొదటి 4 బూస్టర్లు 24 కిమీ ఎత్తున, మిగతా రెండు బూస్టర్లు 41 కిమీ ఎత్తున విడిపోయి పడిపోతాయి.

రెండవ దశ (PS2)

[మార్చు]

రెండవ దశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. రెండవ దశకు వికాస్‌ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ను లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Centre) తయారు చేసింది. ఇందులో ఉపయోగించే ఇంధనం UDMH + N2O4. ఈ ఇంజను ఇచ్చే థ్రస్ట్ 799 కిన్యూ. ఈ దశ 158 సెకండ్లు మండి, 277 కిమీ ఎత్తు వద్ద విడివడి పోతుంది.

మూడవ దశ (PS3)

[మార్చు]

ఈ దశలో ఘన ఇంధనం HTPB వాడతారు. ఇది 240 కిన్యూల థ్రస్ట్‌ను అందిస్తుంది. ఈ దశ 112 సెకండ్ల పాటు మండి, 580 కిమీ వద్ద విడిపోతుంది.

నాల్గవ దశ (PS4)

[మార్చు]

ఇది పిఎస్‌ఎల్‌వి లోని అంతిమ దశ. పేలోడ్ దీనికి చేర్చి ఉంటుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే బాధ్యత ఈ దశదే. ఈ దశలోని రెండు PS-4 ద్రవ ఇంధన ఇంజనులు ఒక్కొక్కటి 7.6 కిన్యూ థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. ఉపయోగించు ఇంధనం MMH + MON. యాత్ర అవసరాన్ని బట్టి ఈ దశ 540 సెకండ్ల వరకు మండుతుంది.

నాల్గవ దశలోనే పరికరాల అర కూడా ఉంటుంది. ఈ అరలో ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థ, ఫ్లైట్ కంప్యూటరు, టెలిమెట్రీ, ఏవియానిక్స్ పరికరాలు ఉంటాయి.

పేలోడ్ భాగం

[మార్చు]

కక్ష్యలో ప్రవేశపెట్టవలసిన ఉపగ్రహం లేదా ఉపగ్రహాలు భద్రంగా రక్షణ షీల్డ్ కలిగిన గదిలో ఉంటాయి. ఈ రక్షణ గదిని పేలోడ్ ఫెయిరింగ్ లేదా హీట్‌షీల్డ్ అంటారు. ఇది రెండు భాగాలుగా, 3.2 మీ వ్యాసంతో, 8.3 మీ పొడవుతో ఉంటుంది. భూ వాతావరణం గుండా నౌక ప్రయాణించేటపుడు ఎదురయ్యే గాలి వత్తిడి, ఉష్ణోగ్రత, శబ్దం మొదలైన శక్తుల నుండి పేలోడ్‌కు రక్షణగా ఇది పనిచేస్తుంది. భూవాతావరణాన్ని దాటగానే - సుమారు 165 సెకండ్ల తరువాత, 130 కిమీల ఎత్తున - దీన్ని తొలగించేస్తారు.

యాత్రల జాబితా

[మార్చు]

మొట్టమొదటి పిఎస్‌ఎల్‌వి యాత్ర పిఎస్‌ఎల్‌వి డి1, విఫలమైంది. రెండవ దశ ఇంజను మండడంలో జరిగిన లోపం కారణంగా రాకెట్ బంగాళాఖాతంలో పడిపోయింది. నాల్గవ యాత్రలో, ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలో కాక, దానికంటే కింది కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీన్ని పాక్షిక వైఫల్యంగా భావిస్తారు. ఈ రెండు తప్ప, మిగిలిన యాత్రలన్నీ విజయవంతమయ్యాయి.

పిఎస్‌ఎల్‌వి ద్వారా ఇంతవరకు అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు:[4]

పేరుప్రయోగతేదివాహన శ్రేణికక్ష్యపేలోడ్
పిఎస్‌ఎల్‌వి-సి-62 జనవరి 12,2026 పిఎస్‌ఎల్‌వి - DL మూడో దశలో విఫలం
పిఎస్‌ఎల్‌వి-సి-61 మే 18, 2025
పిఎస్‌ఎల్‌వి-సి-60 డిసెంబర్ 30, 2024
పిఎస్‌ఎల్‌వి-సి-59 డిసెంబర్ 5, 2024
పిఎస్‌ఎల్‌వి సీ-58 జనవరి 01, 2024 పిఎస్‌ఎల్‌వి - DL XPoSat
పిఎస్‌ఎల్‌వి సీ-57 సెప్టెంబర్ 02, 2023 పిఎస్‌ఎల్‌వి - XL Aditya-L1 payloads
పిఎస్‌ఎల్‌వి సీ-56 జూలై 30, 2023 పిఎస్‌ఎల్‌వి - CA DS-SAR
పిఎస్‌ఎల్‌వి సీ-55 ఏప్రిల్ 22, 2023 పిఎస్‌ఎల్‌వి - CA TeLEOS-2
పిఎస్‌ఎల్‌వి సీ-54 నవంబర్ 26, 2022 పిఎస్‌ఎల్‌వి - XL EOS_06
పిఎస్‌ఎల్‌వి సీ-53 జూన్ 30, 2022 పిఎస్‌ఎల్‌వి
పిఎస్‌ఎల్‌వి సీ-52 ఫిబ్రవరి 14, 2022 పిఎస్‌ఎల్‌వి - XL
పిఎస్‌ఎల్‌వి సీ-51 ఫిబ్రవరి 28, 2021 పిఎస్‌ఎల్‌వి - DL
పిఎస్‌ఎల్‌వి సీ-50 డిసెంబర్ 17, 2020 పిఎస్‌ఎల్‌వి - XL CMS-01
పిఎస్‌ఎల్‌వి సీ-49 నవంబర్ 07, 2020 పిఎస్‌ఎల్‌వి - DL EOS-01
పిఎస్‌ఎల్‌వి సీ-48 డిసెంబర్ 11, 2019 పిఎస్‌ఎల్‌వి - QL RISAT-2BR1
పిఎస్‌ఎల్‌వి సీ-47 నవంబర్ 27, 2019 పిఎస్‌ఎల్‌వి - XL Cartosat-3
పిఎస్‌ఎల్‌వి సీ-46 మే 22, 2019 పిఎస్‌ఎల్‌వి - CA RISAT-2B
పిఎస్‌ఎల్‌వి సీ-45 ఏప్రిల్ 01, 2019 పిఎస్‌ఎల్‌వి - QL EMISAT
పిఎస్‌ఎల్‌వి సీ-44 జనవరి 24, 2019 పిఎస్‌ఎల్‌వి - DL Microsat-R
పిఎస్‌ఎల్‌వి సీ-432018,నవంబరు,29పిఎస్‌ఎల్‌వి కోర్ అలోన్సూర్యానువర్తితహైసిస్
పిఎస్ఎల్‌వి- సీ 422018 సెప్టెంబరు,16పిఎస్‌ఎల్‌విసూర్యానువర్తిత దృవీయ కక్ష్య--
పిఎస్ఎల్‌వి- సి412018 ఏప్రిల్,12పిఎస్‌ఎల్‌వి-XLభూస్థిర కక్ష్యIRNSS-1I
పిఎస్‌ఎల్‌వి-సీ402018 జనవరి12పిఎస్‌ఎల్‌వి-XLసూర్యానువర్తితకార్టోశాట్-2శ్రేణి ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ392017 అగస్టు 31పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యIRNSS-1H ప్రయోగం విఫలం
పిఎస్‌ఎల్‌వి-సీ382017 జూన్ 23పిఎస్‌ఎల్‌వి-XLసూర్యానువర్తితకార్టోశాట్-2ఈ ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక2017 ఫిబ్రవరి 15పిఎస్‌ఎల్‌వి-XLసూర్యానువర్తితకార్టోశాట్-2D ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక2016 జూన్ 22పిఎస్‌ఎల్‌వి-XLసూర్యనువర్తితCartosat-2 Series Satellite
పిఎస్‌ఎల్‌వి-సి332016 ఏప్రిల్ 28పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యIRNSS 1G
పిఎస్‌ఎల్‌వి-సి322016 మార్చి 10పిఎస్‌ఎల్‌వి-XLభూ సమవర్తన బదిలీ కక్ష్యIRNSS 1F
పిఎస్‌ఎల్‌వి-C312016 జనవరి 20పిఎస్‌ఎల్‌వి-XLభూ సమవర్తన బదిలీ కక్ష్యIRNSS 1E
పిఎస్‌ఎల్‌వి-C292015 డిసెంబరు 16పిఎస్‌ఎల్‌వి-CAభూ నిమ్న కక్ష్యTeLEOS-1
పిఎస్‌ఎల్‌వి-C302015 సెప్టెంబరు 28పిఎస్‌ఎల్‌వి-XLఆస్ట్రోశాట్
పిఎస్‌ఎల్‌వి-C282015 జూలై 10పిఎస్‌ఎల్‌విభూ నిమ్న కక్ష్యDMC3
పిఎస్‌ఎల్‌వి-C272015 మార్చి 28పిఎస్‌ఎల్‌వి-XLభూ సమవర్తన బదిలీ కక్ష్యIRNSS 1D
పిఎస్‌ఎల్‌వి-C262014 అక్టోబరు 16పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యIRNSS 1C
పిఎస్‌ఎల్‌వి-C232014 జూన్ 30పిఎస్‌ఎల్‌వి-CAభూ స్థిర బదిలీ కక్ష్యSPOT-7
పిఎస్‌ఎల్‌వి-C242014 ఏప్రిల్ 4పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యIRNSS-1B
పిఎస్‌ఎల్‌వి-C252013 నవంబరు 5పిఎస్‌ఎల్‌వి-XLHEOMars Orbiter Mission Spacecraft
పిఎస్‌ఎల్‌వి-C222013 జూలై 1పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యIRNSS-1A
పిఎస్‌ఎల్‌వి-C202013 ఫిబ్రవరి 25పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యSARAL
పిఎస్‌ఎల్‌వి-C212012 సెప్టెంబరు 9పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యSPOT 6
పిఎస్‌ఎల్‌వి-C192012 ఏప్రిల్ 26పిఎస్‌ఎల్‌వి-XLసౌర సమవర్తన ధ్రువ కక్ష్యRISAT-1
పిఎస్‌ఎల్‌వి-C182011 అక్టోబరు 12పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యMegha-Tropiques
పిఎస్‌ఎల్‌వి-C172011 జూలై 15పిఎస్‌ఎల్‌వి-XLభూ స్థిర బదిలీ కక్ష్యGSAT-12
పిఎస్‌ఎల్‌వి-C162011 ఏప్రిల్ 20పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యRESOURCESAT-2
పిఎస్‌ఎల్‌వి-C152010 జూలై 12పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యCARTOSAT - 2B
పిఎస్‌ఎల్‌వి-C142009 సెప్టెంబరు 23పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యOceansat-2
పిఎస్‌ఎల్‌వి-C122009 ఏప్రిల్ 20పిఎస్‌ఎల్‌వి-CAసౌర సమవర్తన ధ్రువ కక్ష్యRISAT-2
పిఎస్‌ఎల్‌వి-C112008 అక్టోబరు 22పిఎస్‌ఎల్‌వి-XLHEOChandrayaan-1
పిఎస్‌ఎల్‌వి-C102008 జూన్ 23పిఎస్‌ఎల్‌వి-CAభూ నిమ్న కక్ష్య
పిఎస్‌ఎల్‌వి-C92008 ఏప్రిల్ 28పిఎస్‌ఎల్‌వి-CASPOCARTOSAT – 2A
IMS-1
పిఎస్‌ఎల్‌వి-C52007 అక్టోబరు 17పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యIRS-P6 / RESOURCESAT-1
పిఎస్‌ఎల్‌వి-C82007 ఏప్రిల్ 23పిఎస్‌ఎల్‌వి-CAభూ నిమ్న కక్ష్య
పిఎస్‌ఎల్‌వి-C72007 జనవరి 10పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యCARTOSAT-2
SRE-1
పిఎస్‌ఎల్‌వి-C62005 మే 5పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యCARTOSAT – 1
HAMSAT
పిఎస్‌ఎల్‌వి-C42002 సెప్టెంబరు 12పిఎస్‌ఎల్‌వి-Gభూ స్థిర బదిలీ కక్ష్యKALPANA-1
పిఎస్‌ఎల్‌వి-C32001 అక్టోబరు 22పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యThe Technology Experiment Satellite (TES)
పిఎస్‌ఎల్‌వి-C21999 మే 26పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యOceansat (IRS-P4)
పిఎస్‌ఎల్‌వి-C11997 సెప్టెంబరు 29పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యIRS-1D
పిఎస్‌ఎల్‌వి-D31996 మార్చి 21పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యIRS-P3
పిఎస్‌ఎల్‌వి-D21994 అక్టోబరు 15పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యIRS-P2
పిఎస్‌ఎల్‌వి-D11993 సెప్టెంబరు 20పిఎస్‌ఎల్‌వి-Gసౌర సమవర్తన ధ్రువ కక్ష్యIRS-1E

పీ ఎస్ ఎల్ వీ సాధించిన అద్భుతాలు

[మార్చు]

చంద్రయాన్-1’ ను 2008 అక్టోబరు 22 లో పీ.ఎస్.ఎల్.వీ.సి.-11 ద్వారా కక్ష్య లోనికి ప్రవేశపెట్టారు.’మంగళయాన్’ ను నవంబరు 5 2019 న పీ.ఎస్.ఎల్.వీ.సి. సీ-25 ద్వారా కక్ష్య లోనికి ప్రవేశపెట్టారు. పీఎస్ ఎల్ వీ సీ-37 ద్వారా నింగిలోనికి ఒకేసారి ’నూట నాలుగు ఉపగ్రహాలను’ ప్రవేశ పెట్టడం ఒక ప్రపంచ రికార్డు.[5]

క్రాప్స్ (CROPS - Compact Research Module for Orbital Plant Studies) ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసి లోకి పంపిన అలసంద విత్తనాలు (బొబ్బర్లు) సూక్ష్మ గురుత్వాకరణ వాతావరణంలో నాలుగు రోజులలో మొలకెత్తాయి. వాటికి రెండేసి ఆకులు కూడా వచ్చాయి. రాకెట్‌ నాలుగో దశలోని పీఎ్‌సఎల్వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (పోయెమ్‌-4) ద్వారా 24 పేలోడ్లను ఇస్రో రోదసీలోకి పంపింది. వాటిలో కంపాక్ట్‌ రిసెర్చ్‌ మాడ్యూల్‌ ఫర్‌ ఆర్బిటల్‌ ప్లాంట్‌ స్టడీ (క్రాప్స్‌) అనే పరికరం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం (వీఎ్‌సఎ్‌ససీ) అభివృద్ధి చేసింది. దీనిని అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేసేందుకు రూపొందించారు. వ్యోమగాములకు ఆహారాన్ని ఉత్పత్తి చేయగల, గాలి, నీటిని పునరుత్పత్తి చేయగల లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, మొక్కలు సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా ఎలా మారతాయో అర్థం చేసుకోవడమే ఈ ప్రయోగం ఉద్దేశ్యం.[6] [7][8]

శాస్త్ర సాంకేతిక రంగం లోనూ మూఢనమ్మకాలు:

[మార్చు]

పీఎస్ ఎల్ వీ క్రమంలో పీ ఎస్ ఎల్ వీ పన్నెందు తర్వాత తయారు చేసి పంపిన వాహక నౌక పేరు పీఎస్ ఎల్ వీ పద్నాలుగు. పీఎస్ ఎల్ వీ 13 లో సంఖ్యల మొత్తం సరి సంఖ్య నాలుగు రావడం తో ఆ పేరు తో వాహన నౌక లేదు.12 వ నంబరు వాహకనౌక 2009 ఏప్రిల్ 20 నుండి 14 వ వాహన నౌక 2009 సెప్టెంబరు 23 మధ్య వేరే ఏ పీ ఎస్ ఎల్ వీ ని పంపలేదు.[9]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 Polar Satellite Launch Vehicle
  2. "మొత్తం 113 ఉపగ్రహాలను ప్రయోగించింది". Archived from the original on 2016-07-23. Retrieved 2016-07-29.
  3. "ఇస్రో ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించింది". Archived from the original on 2016-07-23. Retrieved 2016-07-29.
  4. "PSLV Launches Till Date". isro.gov.in. Archived from the original on 2016-12-22. Retrieved 2015-09-02.
  5. https://www.eenadu.net/districts/mainnews/219065013/Nellore/19/9[permanent dead link]
  6. "ISRO: కక్ష్యలో అలసంద మొలకలు". ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి. 2025-01-07. Retrieved 2025-01-07.
  7. "ISRO: కక్ష్యలో మొలకెత్తిన అలసంద విత్తనాలు". ఈనాడు. 2025-01-05. Retrieved 2025-01-07.
  8. "ISRO's cowpea seeds sprout leaves in space". ది ఇండియన్ ఎక్సప్రెస్. 2025-01-07. Retrieved 2025-01-07.
  9. "ఇంతింతై విశ్వమంతై". eenadu. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-09.