కార్టోశాట్-2D ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఎసెల్వి రాకెట్ హీట్ షీల్డ్

కార్టోశాట్-2D ఉపగ్రహం ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతయారు చేసిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని 2017 ఫిబ్రవరి 15 న పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్తారు[1].కార్టోశాట్-2D ఉపగ్రహం ఇస్రో రూపొందించి ప్రయోగించిన కార్టోశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహం. అంతకు ముందు కార్టోశాట్ శ్రేణికి సంబంధించి నాల్గు ఉపగ్రహాలను ప్రయోగించారు. అవికార్టోశాట్-1 ఉపగ్రహం, కార్టోశాట్-2 ఉపగ్రహం, కార్టోశాట్-2A ఉపగ్రహం‎కార్టోశాట్-2B ఉపగ్రహాలు.కార్టోశాట్ సంబంధించి ఇది ఐదవది అయిన శ్రేణిపరంగా ఇది కార్టోశాట్-2D ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 714 కిలోలు. దీన్ని తొలుత 505 కి.మీ సుర్యానువర్త్న క్షక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కాలపరిమితి 5 సంవత్సరాలు. కార్టోశాట్ ఉపగ్రహాలు భూమి ఉపరితలాన్ని పటాలుగ చిత్రికరిస్తాయి. అనగా భూఉపరితల చిత్రీకరణ విజ్ఞానాన్ని కార్టోగ్రఫీ అంటారు. ఈ ఉపగ్రహాల ద్వారా గ్రామీన పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంతాల్లో నేలవినియోగం, దాని నియంత్రణ, రోడ్దురవాణా వ్యవస్థపర్యవేక్షణ, నీటీ విస్తరణ అధ్యయణము, నేల వినియోగ పటాల తయారి వంటి అనేక ప్రయోజానాలు ఈ కార్టోశాట్ ఉపగ్రహంవలన ఉన్నాయి. పై ఉపయోగాలతో పాటు భౌగోళిక సమాచార వ్యవస్థ ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహంలో ప్రధానంగా రెండు ఉపకరణాలు ఉన్నాయి.అవి ఒకటి ప్యాన్ క్రొమెటిక్ కెమరా, రెండవది మల్టీ స్పెక్ట్రల్ కెమరా[2][3]

ఉపగ్రహం యొక్క ఆన్‌బోర్డ్ పవర్ 930 watts.వాలుతలం 97.89 డిగ్రీలు. ఆవర్తన కాలం 97.38 నిమిషాలు. ఈ ఉపగ్రహంలో ఒక పాన్ క్రోమాటిక్ (PAN) కెమారాను అమర్చారు. ఉపగ్రహంలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ కెమరా విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క కనిపించే ప్రాంతంలో భూమియొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రికరించగలదు. కెమరా తరంగ పొడవు 0.5 – 0.85 మైక్రో మీటర్లు, రెజల్యుసన్ 1 మీటరుకన్న తక్కువ. కార్టోశాట్-2B ఉపగ్రహం 26 డిగ్రీల కోణంలో అటు ఇటు తిరుగలదు.ఈ ఉపగ్రహ ప్రదక్షిణలను, పనితీరును బెంగలూరు లోఉన్న స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ కేంద్రము, దానితో నెట్‌వర్క్ అనుబంధమున్నలక్నో, మారిటస్, రష్యాలోని బేర్ స్లాక్, ఇండోనేషియా లోని భయాక్, నార్వే లోని స్వల్బార్డ్ నెట్‌వర్కు కేంద్రాల సహకారంతో పర్యవేక్షణ చేస్తుంది.

2017 సంవత్సరం చివర్లో కార్టోశాట్-2D కీ అనుబంధంగా కార్టోశాట్-2E ఉపగ్రహన్ని ప్రయోగించ బొతున్నది ఇస్రో[4].

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]