కార్టోశాట్-2E ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్టోశాట్-2E
మిషన్ రకంభూపర్యవేక్షణ
నిర్వహించే సంస్థభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
వెబ్ సైటుPSLV-C38 webpage
మిషన్ కాలము5 సంవత్సరాలు.
జూన్23 2017న ప్రయోగించారు
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్IRS-2[1]
తయారీదారుడుఇస్రో
ప్రారంభ ద్రవ్యరాశి712 కి.గ్రా. (1,570 పౌ.)[2]
శక్తి986 watts[2]
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ23 June 2017, 03:59 (2017-06-23UTC03:59) UTC[3]
రాకెట్పిఎస్‌ఎల్‌వి-సీ38[3]
ప్రారంభించిన స్థలంసతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం,మొదటి ప్రయోగ వేదిక,శ్రీహరికోట[2]
Contractorఇస్రో
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థGeocentric
Regimeసూర్యానువర్తిత కక్ష్య
Perigee505 కి.మీ. (314 మై.)
Apogee505 కి.మీ. (314 మై.)
Inclination97.44°
Period94.72 నిమిషాలు
EpochPlanned[2]
----
కార్టోశాట్ ఉపగ్రహ శ్రేణి
← కార్టోశాట్-2D

కార్టోశాట్-2E ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసింది. ఇది ఇస్రో రూపొందించి ప్రయోగించిన కార్టోశాట్ శ్రేణిలో ఏడవ ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి 2017 జూన్ 23 శుక్రవారం నాడు పిఎస్‌ఎల్‌వి-సీ38 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఉపయోగించారు.

కార్టోశాట్-2E ఉపగ్రహం[మార్చు]

కార్టోశాట్-2E బరువు 712 కిలోలు. దీని జీవిత కాలం 5 సంవత్సరాలు. ఈ ఉపగ్రహంలో ప్రధానంగా రెండు ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి ప్యాన్ క్రొమెటిక్ కెమెరా కాగా, రెండవది మల్టీ స్పెక్ట్రల్ కెమెరా. ఉపగ్రహం యొక్క ఆన్‌బోర్డ్ పవర్ 930 watts. వాలుతలం 97.89 డిగ్రీలు. ఆవర్తన కాలం 97.38 నిమిషాలు. ఉపగ్రహంలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ కెమెరా భూమియొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రికరించగలదు. కెమెరా తరంగ దైర్ఘ్యం 0.5 – 0.85 మైక్రో మీటర్లు, రిజల్యూషన్ 1 మీటరు కన్న తక్కువ.

కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహ సముదాయ వివరాలు[మార్చు]

కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహాలను ఇస్రో దేశీయ అవసరాల కోసం ప్రయోగిస్తున్నది. భౌగోళిక సమాచార సేకరణ ఈ కార్టోశాట్ ఉపగ్రహాల ప్రధాన లక్ష్యం. కార్టోశాట్ -2 ఉపగ్రహాల శ్రేణిని 2005 లో రూపొందించారు. 2007 జనవరి 10 న పీఎస్ఎల్వీ-సీ7 ద్వారా కార్టోశాట్ -2ను ప్రయోగించారు.2008 ఏప్రిల్ 28 న పీఎస్ఎల్వీ-సీ9 ద్వారా కార్టోశాట్ -2Aను ప్రయోగించారు. 2010 జూలై 12 న పీఎస్ఎల్వీ-సీ15 ద్వారా కార్టోశాట్ -2B ప్రయోగించారు.2016 జూన్ 22 న పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా కార్టోశాట్ -2C ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2016 ఫిబ్రవరి 15 న ప్రయోగించినకార్టోశాట్ -2Dతో కలుపుకుని ఇప్పటికి 5 కార్టోశాట్ ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. కార్టోశాట్ -2E ఈ శ్రేణిలో ఆరవ ఉపగ్రహం. దీని జీవితకాలం 5 సంవత్సరాలు. కార్టోశాట్ -2 ఉపగ్రహశ్రేణి ఉపగ్రహాలన్నీ సూర్యానువర్తిత ధ్రువీయ కక్ష్యలో భూమికి 500-520 కి.మీ. పైబడిన ఎత్తులో, భూమి చుట్టూ తిరుగుతున్నాయి.[4]. ఉపగ్రహ వ్యవస్థలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ మల్టీస్పెక్ట్రమ్‌ కెమెరా అత్యంత నాణ్యమైన నలుపు తెలుపు చిత్రాలను తీసి పంపిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్రతీర ప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణి, భూవినియోగంపై చిత్రాలను తయారుచెయ్యడం వంటి పనులు చేస్తుంది. విపత్తులను విస్తృతంగా అంచనా వేసి సమాచారం అందిస్తుంది. వ్యయసాయ సంబంధిత సమాచారం అందుబాటులోకి తెస్తుంది. రాకెట్, ఉపగ్రహనిర్మాణానికి సుమారు 350 కోట్లు ఖర్చు అయ్యినది.

ఇవికూడా చూడండి[మార్చు]

అధారాలు/మూలాలు[మార్చు]

  1. Krebs, Gunter. "Cartosat 2, 2A, 2B, 2C, 2D, 2E". Gunter's Space Page. Retrieved 19 June 2017.
  2. 2.0 2.1 2.2 2.3 "PSLV-C38: Cartosat-2 Series Satellite Brochure" (PDF). Indian Space Research Organisation. Archived from the original (PDF) on 12 జూలై 2017. Retrieved 19 June 2017.
  3. 3.0 3.1 Graham, William (22 June 2017). "PSLV rocket launches Cartosat 2E and 30 small sats". NASASpaceFlight.com. Retrieved 23 June 2017.
  4. "ISRO PSLV-C38 launched: What is Cartosat-2 series satellite?". indianexpress.com. Retrieved 2017-06-27.