కార్టోశాట్-2A ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cartosat-2A
మిషన్ రకంEarth observation
ఆపరేటర్ISRO
COSPAR ID2008-021A Edit this at Wikidata
SATCAT no.32783Edit this on Wikidata
మిషన్ వ్యవధి5 years
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి690 కిలోగ్రాములు (1,520 పౌ.)[1]
శక్తి900 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ28 April 2008, 03:53 (2008-04-28UTC03:53Z) UTC
రాకెట్PSLV C9
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SLP
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Low Earth[1]
Perigee altitude630 కిలోమీటర్లు (390 మై.)[1]
Apogee altitude630 కిలోమీటర్లు (390 మై.)[1]
వాలు degrees
వ్యవధి97.4 minutes[1]
పునరావృత వ్యవధి4 days
Main camera
తరంగ దైర్ఘ్యములు0.5 – 0.85 micrometre
రిజల్యూషన్Less than 1 metre
 

కార్టోశాట్-2A అనునది ఒక భూఅధ్యానయన/భుపరిశీలన ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు రూపొందించి, ప్రయోగించారు.కార్టోశాట్ ఉపగ్రహశ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం.అంతకు మునుపు కార్టోశాట్-1ని మేనెల 5తేది,2005సంవత్సరం లో, తరువాత కార్టోశాట్-2 ఉపగ్రహన్ని 2007 జనవరి 10లో ప్రయోగించారు.అలాగే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అర్గనైజేసన్ శ్రేణిలో, ఇస్రో చే తయారు చెయ్యబడి, ప్రయోగింపబడి, నిర్వహించబడిన 13 వ ఉపగ్రహం కార్టోశాట్-2A.ఈ ఉపగ్రహం పీఎస్ఎల్వీవాహకనౌక శ్రేణికి చెందిన PSLV–C9 అను ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా అంతరిక్షములో నిర్దేశించినకక్ష్యలో ప్రవేశపెట్ట బడింది.ఈ ఉపగ్రహాన్ని 2008 ఏప్రిల్ 28వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని సతీష్ థావన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.

ఈ ఉపగ్రహంతో పాటు 87 కేజీల బరువుఉన్న ఇండియన్ మినీశాటిలైట్ (IMS-1), కెనడా, డెన్మార్క్, జర్మనీ, జపాన్,, నెథర్లాండ్ దేశాలకు చెందిన ఎనిమిది ప్రయోగాత్మక సూక్ష్మ (నానో) ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది.కార్టోశాట్-2A ఉపగ్రహం భారత ప్రభుత్వరక్షణ శాఖా మంత్రిత్వశాఖకు చెందినది.

ఉపగ్రహ సమాచారం

[మార్చు]

ఉపగ్రహం బరువు 690 కిలోలు.ఒక పాన్‌క్రోమాటిక్ కెమెరాను కలిగి ఉంది. కక్ష్య 635కిలోమీటర్ల సూర్యసమస్థితి కక్ష్య (sun synchronous). ఉపగ్రహం కనిష్ఠఎత్తు భూకక్ష్యలో పరిభ్రమణం చేస్తుంది.ఉపగ్రహప్రయోగ ముఖ్య ఉద్దేశం భూఅధ్యయనం.ఉపగ్రహం పనిచెయ్యు జీవితకాలం 5 సంవత్సరాలుగా నిర్ణయించారు.ఉపగ్రహం యొక్క అన్‌బోర్డ్ పవర్ 900 watts.ఉపగ్రహం యొక్క ఏటవాలు తలం 97.44 డిగ్రీలు.కార్టోశాట్-2A ఉపగ్రహంలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ కెమరా విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క కనిపించే ప్రాంతంలో భూమియొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రికరించగలదు.కెమరా అంతరిక్షరెసోల్యుసన్ 1 మీటరు కన్నతక్కువ, కెమెరా swath పరిధి 9.6 కిలోమీటర్లు.కార్టోశాట్-2A ఉపగ్రహం 45 డిగ్రీల కోణంలో అటు, ఇటు తిరుగలదు.ఈ ఉపగ్రహ ప్రదక్షిణలను, పనితీరును బెంగలూరులో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ కేంద్రము, దానితో నెట్‌వర్క్ అనుబంధమున్న లక్నో, మారిటస్, రష్యాలోని బేర్‌స్లాక్, ఇండోనేషియా లోని భయాక్, నార్వే లోని స్వల్బార్డ్ నెట్‌వర్కు కేంద్రాల సహకారంతో పర్యవేక్షణచేస్తుంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]