పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
PSLV-C37
వాహకనౌక మాదిరి
Model of the PSLV rocket
మిషన్ రకం104 ఉపగ్రహాలను కక్ష్యలోప్రవేశ పెటడం
ఆపరేటర్ఇస్రో
వెబ్ సైట్ISRO website
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకదృవీయ ఉపగ్రహవాహక నౌక(PSLV)
అంతరిక్ష నౌక రకంExpendable launch vehicle
తయారీదారుడుISRO
లాంచ్ ద్రవ్యరాశి320,000 kilograms (710,000 lb)
పే లోడ్ ద్రవ్యరాశి1,378 kilograms (3,038 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ09:28:00, 2017 ఫిబ్రవరి 15 (2017-02-15T09:28:00) (IST)
రాకెట్పిఎస్‌ఎల్‌వి
లాంచ్ సైట్సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం,మొదటి ప్రయోగ వేదిక
కాంట్రాక్టర్ఇస్రో
పేలోడ్
Cartosat-2D, INS-1A & INS-1B
101 others
ద్రవ్యరాశి1,378 kilograms (3,038 lb)
← PSLV-C36
PSLV-C38]] →
 

పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక. ఈ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం ఇస్రో సంస్థకు అత్యంత ప్రముఖమైన, ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలో ఉన్న సతిష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఫిబ్రవరి నెల 15వ తారిఖు (బుధవారం) న ప్రయోగించుటకు ఇస్రో సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇస్రో సంస్థ పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూంది. ఇందులో మూడు స్వదేశానికి చెందినవి కాక మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. ఈ పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెంది 39 వ ప్రయోగం. ఎక్సెల్ స్ట్రాపను బూస్టరు కలిగిన వాహకనౌకగా ఇది 16వది. ఉపగ్రహ నౌకలో అమర్చిన 104 ఉపగ్రహాల మొత్తం బరువు 1,378 కిలోలు. వీటిని భూమికి 505 నుండి524 కిలో మీటర్లేత్తులో సుర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టబడును. వాహక నౌకలోని స్వదేశానికి చెందిన కార్టోశాట్-2 శ్రేణికి చెందిన ఉపగ్రహం బరువు 714 లకిలోలు కాగా మిగిలిన ఉపగ్రహాలబారం 664 కిలోలు.భారత దేశానికి చెందిన మిగతా రెండు నానో ఉపగ్రహాలను మినహాయించగా మిగతా 101 ఉపగ్రహాలు నానో (సూక్ష్మ) ఉపగ్రహాలు.ఇజ్రాయిల్, ఖజకిస్థాన్, ది నెథర్లాండ్సు, స్విట్జెర్లాండు, సంయుక్త అరబ్ ఎమిరేట్ (UAE) కు హెందిన ఒక్కొక ఉపగ్రహాన్ని, అమెరికాకు చెందిన 96 నానో ఉపగ్రహాలను ఉపగ్రహ నౌకలో అమర్చారు.పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక లోని మొత్తం ఉపగ్రహాల బరువు1378 కిలోలు[1][2]

పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక నిర్మాణ వివరాలు[మార్చు]

పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన రకెట్లలో పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ఎక్సుఎల్ (XL) రకానికి చెందినది.ఈ రాకెట్తుకు మొదటి కోర్ అన్ దసకు బహ్యంగా అౠ స్ట్రాపాను బూస్టరు ఇంజన్లు బిగించబడి ఉందును.ఈ స్ట్రాపాను బూస్టరు చోదకంలో మొదటి దశ ఇంజనులో/చోదకంలో నింపిన విధంగ ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు.వాహకనౌక మొత్తం పొడవు44.4 మీటర్లు.ప్రయోగ సమయానికి దీనీ భారం 320 టన్నులు.ఇందులో మొత్తం నాలుగు దశలుండును.అనగా నాలుగు అంచెల్లో చోదక ఇంజన్లను బిగించారు.మొదటి, మూడో దశలో ఘన ఇంధనం, రెండవ, నాల్గవ దశల్లో ద్రవ ఇందనాన్ని చోదక ఇంజన్లలో నింపారు.నాల్గవదశ పై భాగాన ఎక్యుపుమెంట్ బే ఉండి, దాని అడాప్టరుపై ఉపగ్రహాలను వరుస క్రమంలో అమర్చారు.[3]

మొదటి దశలో 211.4 టన్నుల ఘన ఇంధనాన్ని నింపారు.మొదటి కోర్ అలోను చోదక ఇంజనులో 138.2 టన్నుల ఇంధనం, బయట అమర్చిన స్ట్రాపను ఇంజన్లులలో 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపారు.రెండవ దశలో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు, మూదవ దశలో 7.6 ఘన ఇంధనాన్ని నింపారు.నాల్గవదశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు.[4]

ప్రయోగముందు చర్యలు[మార్చు]

శ్రీ హరికొటలోని సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఎంఎస్‌టిలో పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌకను అనుసంధానంచేసారు.ఉపగ్రహ నౌక శిఖర భాగంలో శనివారం (11-02-17) కే 104 ఉపగ్రహాలను అమర్చి హీట్ షీల్డును (వేడినుండి ఉపగ్రహ గదిని కాపాడె రక్షక కవచం) బిగించారు.ఆదివారం (12-02-17) న ఉపహగ్రహానికి చెందిన స్థాయి-1, స్థాయి-2, స్థాయి-3 కి చెందిన తనిఖీ పరీక్షలను నిర్హహించారు.సోమవారం (12-02-17) చివరి విడత మిసను సంస్థిత సమావేసాన్ని (ఎం.ఆర్‌.ఆర్) నిర్వహించి.ఉపగ్రహం ప్రయగానికి సిద్దమని ప్రకటించి, ఉపగ్రహ పరయాన్ని లాంచ్ అథరైజెషన్ బోర్డుకు (ల్యాబ్) కు అప్పగించారు.ల్యాబ్ ఆద్వరంలో మరోసారి తనీఖీలి నిర్వహించి, సంతృప్తి చెందాక ఉపగ్రహ వాహకనౌకను ఎంఎస్‌టి నుండి మొదటి ప్రయోజక వేదిక వద్దకు తెచ్చారు[5].మంగళ వారం ఉదయం (14-02-17) ఉదయం 5.28 నిమిషాలకు 28 గంటల కౌంట్‌డౌను మొదలై, అది బుధవారం ఉదయం 9:28 గంటలకు విజయవంతంగా ముగిసి, పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక గగన తలం వైపు విజయవంతంగ దూసుకెల్లింది.

ఉపగ్రహాల వివరాలు[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టుతున్న 104 ఉపగ్రహాల్లో మూడు ఇస్రో సంస్థ తయారు చేసినవి, వాటిని భారతదేశం తరుపున ప్రవేశ పెట్టుతున్నారు.మిగిలినవి విదేశి నానో ఉపగ్రహాలు.

ఇస్రోవారి ఉపగ్రహాలు[మార్చు]

అందులో ఒకటి 714 కిలోల బరువున కార్టోశాట్ శ్రేణికి చెందిన కార్టోశాట్-2డీ ఉపగ్రహం.ఇది దూరపరిశీలన ఉపగ్రహం (Remote sensing satellite). మిగిలిన రెండు ఉపగ్రహాలు సూక్ష్మ ఉపగ్రహాలు.అందులో ఐఎన్‌ఎస్-1ఏ నానో ఉపగ్రహం బరువు 8.4 కిలోలు, ఐఎన్‌ఎస్-1బి బరువు 9.7 కిలోలు.

విదేశి ఉపగ్రహాలు[మార్చు]

నెదర్లాండ్స్కు చెందిన పీయాస్-1 బరువు మూడు కిలోలు.స్విట్జర్లాండ్కు చెందిన డిడో-2 యొక్క బరువు 4.2 కిలోలు.ఇజ్రాయిల్కు చెందిన బీజీయూశాట్ బరువు 4.3 కిలోలు.కజకస్తాన్కు చెందిన ఆల్-ఫరాబీ-1 బరువు 1.7 కిలోలు., యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నాయిఫ్-1 బరువు 1.1 కిలోలు.మిగిలిన 96 ఉపగ్రహాలు అమెరికాకు చెందిన నానో ఉపగ్రహాలు.వాటి మొత్తం బరువు 631.8 కిలోలు.అందులో డౌవ్ శాటీలైట్స్ 88, లీమూర్ శాటిలైటులు 8.అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్ -3పీ శాటిలైట్సులో 88 చిన్న ఉపగ్రహాలను అమర్చారు.వీటీన్నింటిని ఒక చిన్న పెట్టెలో అమర్చారు.దీనిని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన తదుపరి అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ గ్రౌండు స్టేషను ఈ బాక్సును తెరచి అందులోని సూక్ష్మ ఉపగ్రహాలను తమకు అవసరమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టును.ఈ సూక్ష్మ ఉపగ్రహాలు వాణిజ్య ప్రయోజనాలు అందించడంతో పాటు వాతావరణ సమాచారం తెలుపును.అలాగే అమెరికాకు చెందిన మరో లేమూర్ సూక్ష్మ ఉపగ్రహ వ్యవస్థలో 8 ఉపగ్రహాలున్నాయి.ఇవి కూడా భూమికి సంబంధిన సమాచారాన్ని అందిస్తాయి.[6]

ప్రయోగ వివరాలు[మార్చు]

ముందుగా నిర్ధేసించిన ప్రణాలిక ప్రకారం పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక 15-02-17 (బుధవారం) భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 9:28 గంటలకు సతీష్ అంతరిక్ష కేంద్రం లోని మొదటి వాహక నౌకప్రయోగ కేంద్రం నుండి నింగికి ఎగిరింది.గగనంలోకి పయనం సాగించిన 16 నిమిషాల 48 సెకన్లకు భారత దేషానికి చెందిన మూడు ఉపగ్రహాలు సుర్యానువర్తన క్షక్ష్యలో, భూమికి 506 కి.మీ ఎత్తులో, భూమధ్య రేఖకు 97.46డిగ్రీల ఎటవాలులో కక్ష్యలో ప్రవేశించాయి.తరువాత మిగిలిన 12 నిమిషాల్లో తత్తిమ్మా 104 సూక్ష్మ ఉపగ్రహాలను క్షక్ష్యలో ప్రవేశించాయి.ఇప్పటివరకు పిఎస్‌ఎల్‌వి వాహక బౌక ద్వారా 46 భారతీయ ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్తడం జరిగింది.[7] మొదటి దశ 110.3 సెకన్లల్లో విజయవంతంగా ముగిసింది.రెండ్వ దశ 262.8 సెకన్లల్లో ముగిసింది.మూడో దశ 497.8సెకన్లల్లో అనుకున్నవిధంగా ముగిసింది.నాల్గవ దశ 1103. సెకన్లకు ముగిసింది.భూమికి 510.383 కిలో మిటర్లేత్తులో 714 కిలో;అ బరువున్న కార్టోశాట్-2D ఉపగ్రహాన్ని 17.41 నిమిషాలకు సుర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టబడింది.తరువాత 17.58 నిమిషాలకు 510.590 కిలో మీటర్ల ఎత్తులో ఇస్రో నానోశాటీలైటు ఐఎన్‌ఎస్‌-1ఏ ఉపగ్రహాన్ని,17.59 నిమిషాలకు 510.601 కిలో మీటర్ల ఎత్తులో ఐఎన్‌ఎస్‌-1బి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టబడినవి.ఆ తరువాత 18.32 నిమిషాలకు 511.719 కిలో మీటర్ల ఎత్తులో మొదటి బాక్సులో అమర్చిన నానో శాటీలైట్లను, అనంతరం 524.075 కిలో మీటర్ల ఎత్తులో చివరి బాక్సులో అమర్చిన మరో 50 సాటిలైట్లను కక్ష్యలో ప్రవేశించాయి[4]

బయటి వీడియోలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధరాల్లు[మార్చు]

  1. "PSLV-C37 / Cartosat -2 Series Satellite". isro.gov.in. Archived from the original on 2017-02-16. Retrieved 2017-02-14.
  2. "ISRO to launch record 104 satellites on February 15". newindianexpress.com. 10 February 2017. Archived from the original on 2017-02-14. Retrieved 2017-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో". shaksi.com. 2017-02-16. Archived from the original on 2017-02-16. Retrieved 2017-02-16.
  4. 4.0 4.1 "సాహో ఇస్రో". sakshi.com. 16 Feb 2017. Archived from the original on 2017-02-16. Retrieved 2017-02-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "రేపు పీఎస్‌ఎల్‌వీసీ37 ప్రయోగం". sakshi.com. 2014-02-14. Archived from the original on 2017-02-14. Retrieved 2017-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "ఒక రాకెట్..104 ఉపగ్రహాలు". sakshi.com. 2017-02-15. Archived from the original on 2017-02-15. Retrieved 2017-02-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "PSLV-C37 Successfully Launches 104 Satellites in a Single Flight". isro.gov. 2017-02-05. Archived from the original on 2017-02-15. Retrieved 2017-02-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)