Jump to content

పిఎస్‌ఎల్‌వి-సీ35

వికీపీడియా నుండి
పిఎస్‌ఎల్‌వి-సీ35
Model of the PSLV rocket పిఎస్‌ఎల్‌వి రాకెట్ మాదిరి
పేర్లుScatsat-1 mission
మిషన్ రకం8 ఉపగ్రహాలను రెండు భిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టెను
ఆపరేటర్ISRO
వెబ్ సైట్ISRO website
మిషన్ వ్యవధి8,133 సెకన్లు
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకపిఎస్‌ఎల్‌వి
అంతరిక్ష నౌక రకంExpendable launch vehicle
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి320,000 కిలోగ్రాములు (710,000 పౌ.)
పే లోడ్ ద్రవ్యరాశి671.25 కిలోగ్రాములు (1,479.9 పౌ.)
కొలతలు44.4 మీటర్లు (146 అ.)
(మొత్తం పొడవు)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ03:42:00, సెప్టెంబరు 26, 2016 (2016-09-26T03:42:00) (UTC)
రాకెట్పోలారు శాటిలైట్ లాంచింగు వెహికల్(ధ్రువీయ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక
లాంచ్ సైట్సతిష్ థవన్ అంతరిక్షప్రయోగ కేంద్రమం,శ్రీహరికోట,నెల్లూరు జిల్లా
కాంట్రాక్టర్ఇస్రో
మిషన్ ముగింపు
పారవేయడంNot known
డియాక్టివేట్ చేయబడిందిసెప్టెంబరు 26, 2016 (2016-09-26)
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థధ్రీవీయ కక్ష్య అరియు
సూర్యానువర్తన క్షక్ష్య
పేలోడ్
ScatSat-1, PISat & Pratham,
Alsat-1B, Alsat-2B & Alsat-1N,
NLS-19,
Pathfinder-1
ద్రవ్యరాశి671.25కిలోగ్రాములు
 

పిఎస్‌ఎల్‌వి-సీ35 ఉపగ్రహ వాహకనౌకను భారతదేశ అంతరిక్షప్రయోగ సంస్థ ఇస్రో రూపొందించి, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని మొదటి ప్రయోగ వేదిక నుండి 2016 సెప్టెంబరు 26, సోమవారం ఉదయం 9:12 గంటలకు ప్రయోగించింది. దీని ద్వారా 8 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహ వాహకనౌక ప్రయోగంలో మరో విశిష్టత ఉంది.గతంలో పిఎస్‌ఎల్‌వి వాహకనౌక ద్వారా ఒకేసారి 6 పైగా ఉపగ్రహలను ఒకేసారి ప్రవేశ పెట్టినప్పటికీ, వాటన్నిటినీ ఒకే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగంలో మొదటి ఒక ఉపగ్రహాన్ని ఒక కక్ష్యలో ప్రవేశపెట్టగా మిగతా వాటిని మరోకక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ రాకెట్ ద్వారా రెండు వేర్వేరు ఎత్తుల్లో, సుర్యానువర్తన ధ్రువకక్ష్యలోకి ఒకటి, మిగతా వాటిని సుర్యానువర్తన కక్ష్యలోకీ ప్రవేశపెట్ట్రు. దీనిని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సాధారణంగా పిఎస్‌ఎల్‌వి రాకెట్ లలో నాల్గవదశలోని ఇంధనాన్నిపూర్తిగా మండించిన తరువాత ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపెదరు. ఈ రాకెట్ లో నాల్గవ దశను కొంత సమయం మండించి, దహన క్రియను ఆపి, స్కాట్శాట్-1 ఉపగ్రహాన్ని 724 కి.మీ ఎత్తులో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో, 98.1 డీగ్రిల కోణంలో ప్రవేశ పెట్టారు. తరువాత నాల్గవదశ ఇంజన్లను మండించి, 55 కిలోమీటర్లు కిందికి దించి, భూమికి 669 కిలోమీటర్ల ఎత్తులో సుర్యానువర్తన కక్ష్యలో, 98.21 డిగ్రీలవాలులో మిగిలిన 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.[1]

ఉపగ్రహ వాహక నౌక వివరాలు

[మార్చు]

ఉపగ్రహ వాహక నౌక పొడవు 44.4 మీటర్లు.మొత్తంబరువు 320 టన్నులు. మొదటి, మూడవ దశల్లో ఘన ఇంధనాన్ని, రెండవ, నాల్గవ దశల్లో ద్రవ ఇంధనాన్నీ ఉపయోగించారు. వాహక నౌక నిర్మాణం ఈ దిగువ వర్ణించిన ప్రకారం ఉన్నది[2]

మొదటి దశ

[మార్చు]

మొదటి దశను కోర్ దశ అనికూడా అంటారు. దీని పొడవు 20 మీటర్లు. ఇందులో నింపిన ఘన ఇంధనం బరువు 138.2 టన్నులు. ఉపయోగించిన ఇంధనం HTPB (హైడ్రోక్సిల్ టెర్మినెటెడ్ పాలి బ్యూటడైన్). ఈ దశ వ్యాసం 2.8 మీటర్లు. మొదటి దశకు అనుబంధంగా 6 స్ట్రాపాన్ బూస్టరు మోటార్లను అనుసంధానించారు. ఈ స్ట్రాపాన్ బూస్టరు వ్యాసం 1 మీటరు, పొడవు 8.8 మీటర్లు. ఒక్కో స్ట్రాపాన్ బూస్టరులో 8.9 టన్నుల ఘన ఇంధనాన్ని (HTPB) నింపారు.

రెండవ దశ

[మార్చు]

ఈ దశను PS2 అనికూడా అంటారు. పొడవు 12.8 మీటర్లు.వ్యాసం 2.8 మీటర్లు. ద్రవ ఇంధన భారం 42.0టన్నులు. ఉపయోగించిన ద్రవ ఇంధనం UH25+N2O4

మూడవ దశ

[మార్చు]

మూడవ దశను PS3 అంటారు.ఈ దశ పొడవు 3.6 మీటర్లు, వ్యాసం 2.0 మీటర్లు. ఇందులో కూడా మొదటి దశలో వాడిన ఘన ఇంధనాన్నే వాడారు. ఇంధన భారం 7.6 టన్నులు.

నాల్గవ దశ

[మార్చు]

ఈ దశను PS4 అంటారు. ఇందులో ద్రవ ఇంధనం వాడారు. ఇంధనం/చోదకం MMH+MON-3 (మొనో మిథైల్ హైడోజిన్+మిశ్హ్రమ నైట్రోజన్ ఆక్సైడులు). ఇంధన బరువు 2.5 టన్నులు. ఈ దశ పొడవు 3.0 మీటర్లు, పొడవు 1.3 మీటర్లు.

ప్రయోగ వివరాలు

[మార్చు]

శనివారం రోజున మొదలై, 48:30 గంటల పాటు జరిగిన కౌంట్‌డౌన్ తరువాత, సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి-సీ35 మొదటి ప్రయోగ వేదిక నుండి గగనం వైపుకు దూసుకెళ్ళింది. ప్రయోగం మొదలైన సమయం నుండి స్ట్రాపాన్ బూస్టరులు, కోర్ మోటర్లు మొత్తం 111 సెకన్లపాటు మండిన తరువాత, మొదటిదశ విజయవంతంగా ముగిసింది. రెండవదశ 262 సెకన్ల పాటు కొనసాగగా, మూడవదశ 586 సెకన్ల పాటు కొనసాగింది. చివరి నాల్గవదశ 1021 సెకనులు మండింది. అనంతరం స్వదేశీ ఉపగ్రహం స్కాట్‌శాట్-1 ని 1058 సెకన్లకు (17:40గంటలకు) విజయవంతంగా 724 కి,మీ ఎత్తున సూర్యానువర్తన ధ్రుకక్ష్యలో ప్రక్షేపించింది. 1.05 గంటల తరువాత రాకెట్ నాలుగవ దశను (PS-4) రెండు విడతలుగా మండించి వాహకనౌకను 55 కి.మీ దిగువకు ప్రయాణింపచేసారు. భూమికి 669 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో 98.21 డిగ్రీల వాలులో మిగతా 7 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు[1] .

పిఎస్‌ఎల్‌వి-సీ35 ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ35 వాహకనౌక ద్వారా ఈ దిగువ పేర్కొన్న ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలో ప్రవేశపెట్టారు.

స్కాట్‌శాట్-1

[మార్చు]

భారతీయ ఉపగ్రహం.ఇది రోదశిలో 5 సంవత్సరాలపాటు సేవలు అందిస్తుంది.ఊపగ్రహం 371 బరువు .ఉపగ్రహంలోని పేలోడు (పరికరాల)సహితబరువు675 కిలోలు.గతంలో ప్రవేశపెటీన ఓషన్‌శాట్-2 కాలవ్యవధి ముగియడంతో అత్యంత అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన స్కాట్‌శాట్-1 ను దాని స్థానంలో ప్రవేశపెట్టారు.ఇందులో కెయు-బ్యాండు స్కాతరోమీటరు అమర్చారు.వాతావరణంపై ముందస్తు అంచనాలు,తుఫానులు కనిపట్టడం,అచూకీ కనుగొను సేవలను ఇది అందిస్తుంది.[3]

భారతీయ వర్సీటిల ఉపగ్రహాలు

[మార్చు]

రెండు ఉపగ్రహాలు

  • ప్రథమ్‌
  • పైశాట్

ఉపగ్రహాలసంఖ్య:3

  • ఆల్‌శాట్-1బి,ఆళ్‌శాట్-2భి,ఆల్‌శాట్-1ఎన్

సంఖ్య :ఒకటి

  • పాత్ ఫైండర్-1

కెనడా ఉపగ్రహం

[మార్చు]

సంఖ్య:1

  • ఎన్‌ఎల్‌ఎస్-19

బయటి లింకు విడియోలు

[మార్చు]

ఆధారాలు/మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "వినువీథిలోకీర్తిపతాక". sakshi.com. 2016-09-27. Archived from the original on 2016-09-28. Retrieved 2016-09-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "PSLV-C35". isro.gov.in. Archived from the original on 2016-09-27. Retrieved 2016-09-29.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-02. Retrieved 2016-09-28.