పిఎస్‌ఎల్‌వి-సీ14 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో తయారుచేసి ప్రయోగించిన 16 వ అంతరిక్ష వాహకనౌక/రాకెట్.పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక సహాయంతో 958 కిలోల బరువు ఉన్న ఓసెన్ శాట్-2 అను IRS (indian remote sensing) కు చెందిన సముద్రశాస్ర అద్యయనానికి సంబంధించినఉపగ్రహాన్ని, యోరోపియన్ సంస్థకు సంబంధించిన ఆరుసూక్ష్మ ఉపగ్రహాలను, భూమి నుండి 720 కి.మీ. ఎత్తులో సుర్యానువర్తన ధ్రువకక్షలో (SSPO) ప్రవేశపెట్టారు.

పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకల ప్రయోగం

[మార్చు]

పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలు నాలుగుదశలను కలిగి ఘన, ద్రవచోదక దశలను ఒకదాని తరువాత మరొకటి చొప్పున ఉన్న ఉపగ్రహ వాహకనౌక.ఇస్రో సంస్థకు అత్యంత నమ్మకమైన రాకెట్‌లు పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలు.సెప్టెంబరు 1993 నుండి ఏప్రిల్ 2009 వరకు మొత్తం 15 పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహక] నౌకలను ప్రయోగించగా, అందులో 14 ఉపగ్రహ వాహననౌక ప్రయోగాలు విజయ వంతం అయ్యాయి.2009 నాటికి పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకల ద్వారా మొత్తంమీద 39 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టగా, అందులో 17 ఉపగ్రహాలు భారత దేశానికి చెందినవి కాగా మిగిలిన 22 అంతర్జాతీయన వినియోగదార్లవి.ఈ వాహన ప్రయోగానికి ముందు, ఏప్రిల్ 20,2009న ప్రయోగించిన పిఎస్ఎల్‌వి వాహకనౌక ద్వారా రిశాట్ -2, అనుశాట్ అంతరిక్షనౌక/ ఉపగ్రహాలను కక్షలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు[1][2].

ఉపగ్రహ వాహకనౌక నిర్మాణ వివరాలు

[మార్చు]

పిఎస్ఎల్‌వి–సీ14 ఉపగ్రహ వాహకనౌక మొత్తం పొడవు 44.4 మీటర్లు. ప్రయోగ సమయానికి ఉపగ్రహ వాహకనౌక మొత్తం బరువు 230టన్నులు.[3] పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక మొత్తం నాలుగు చోదక దశలను కలిగి ఉంది.మొదటి, మూడవదశలో ఘన ఇంధనచోదకాలు, రెండవ, నాల్గవదశలలో ద్రవఇంధన చోదకయంత్రాలను అమర్చారు.నాలుగవ దశ పైభాగాన పరికారల పెట్టె (equipment bay) ఉండిదాని పైన ఓసెన్ శాట్-2 ఉపగ్రహం, మిగిలిన ఆరు సూక్ష్మఉపగ్రహాలను అమర్చారు.పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక మొదటి దశ మోటారుకు అదనంగా మరో ఆరు స్ట్రాపాన్ చోదక మోటరులను అమర్చారు.పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌకలో మొదటిసారిగా కొత్త AMC/ATS ఆధారిత avionics ను ఉపగ్రహాన్ని సుర్యానువర్తన కక్షలో పెట్టుట కై ఉపయోగించారు.ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టుటకై కోర్ అలోన్ కన్ఫిగరేసన్ అఫ్ వెహికిల్ పద్ధతిని PS4 L2.5దశ/స్టేజిలో ఉపయోగించారు.కోర్ అలోన్ కన్ఫిగరేసన్ విధానాన్ని అమలుపరచిన 5 వ ప్రయోగం ఇది[1][2][3].

మొదటిదశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ
పేరు కోర్ (PSI) PS2 PS3 PS4
చోదకం ఘనHTPB ద్రవUH25+N2O4 ఘనHTPB ద్రవMMH +MON-3
బరువు, టన్నులు 138.0 41.0 7.6 2.5
గరిష్ఠ త్రోపుడుశక్తిKN 4817.0 799 238 7.3 x 2
ఇంధన దహన
సమయము, సెకన్లు
101 147 112 497
స్టేజి వ్యాసం, మీ 2.8 2.8 2.0 2.8
స్తేజి పొడవు 20 12.8 3.6 2.6
వాహన నియంత్రణ SITVC for Pitch & Yaw,
Reaction Control
Thrusters for Roll
Engine Gimbal for
Pitch & Yaw, Hot Gas
Reaction Control Motor
for Roll Control
Flex Nozzle for
Pitch & Yaw,
PS4 RCS for Roll
Engine Gimbal for
Pitch, Yaw and Roll,
On-off RCS for
Coast Phase Control.

ఉపగ్రహ వాహనంలో చేసిన ముఖ్యమైన మార్పులు[1][2]

[మార్చు]
  • PS4 లో L2.5 ని అమర్చారు.
  • సుర్యానువర్తన ధ్రువకక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టుటకై మొదటిసారిగా ECI ఫ్రేమ్, క్వాటేరినియాన్ ఆధారితం కంపుటేసన్ ను ఉపయోగించారు.
  • పరికారల పెట్టె (FBమీద రూబిన్ ఉపగ్రహాన్ని ఉంచినడెక్ ను 45° ఏటవాలులో అమర్చారు.
  • కూబ్‌శాట్ ఉపగ్రహాన్ని వాహకనౌక నుండి వేరుచేయుటకు వినియోగదారుడు ఇచ్చిన S/Cతోపాటు SPLసపరేసన్ సిస్టాన్ని అమర్చారు.

పిఎస్‌ఎల్‌వి-సీ14 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం

[మార్చు]

ఓసెన్ శాట్-2 ఉపగ్రహాన్ని ఇస్రోవారు తయారు చేసిన పిఎస్ఎల్‌వి-సీ14 అను ఉపగ్రహప్రయోగ వాహననౌక ద్వారా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి 23 సెప్టెంబరు 2013నఉదయం 11.51గంటలకు ప్రయోగించారు.ఉపగ్రహాన్ని నిర్దేశితకక్ష్యలో ప్రవేశపెట్టుటకు పట్టిన సమయం 1200 సెకన్లు.ఓసెన్ శాట్-2 ఉపగ్రహం తోపాటు ఆరు నానో యురోపియన్ ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు[3].ప్రయోగ సమయంలో ఓసెన్ శాట్-2 ఉపగ్రహం బరువు 960కిలోలు.మిగిలిన ఆరు నానో ఉపగ్రహాల మొత్తం బరువు 20 కిలోలు.అందులో 4 ఉపగ్రహాల బరువు, ఒక్కొకటి ఒక కిలో కాగా, మిలిన రెండు ఉపగ్రహాల లలో ఒక్కొక్క దాని బరువు 8 కిలోలు.ఓసెన్ శాట్-2 ఉపగ్రహాన్ని 720 కిలోమీటర్ల ఎత్తులో సుర్యానువర్తన కక్ష్యలో (sun-synchronous orbit (SSO, లో ప్రవేశపెట్టారు[1][2][3].

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "PSLV-C14". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-13.
  2. 2.0 2.1 2.2 2.3 "PSLV-C14/OCEANSAT-2 MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-10-13.
  3. 3.0 3.1 3.2 3.3 "PSLV-C14 Successfully Launches Oceansat-2 Satellite". vssc.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-13.