ఆస్ట్రోశాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రోశాట్
Astrosat folded large.png
ఆస్ట్రోశాట్
General information
Organization ఇస్రో
Launch date 28 సెప్టెంబర్ 2015[1][2]
Launch site సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్, శ్రీహరికోట
Launch vehicle PSLV-XL
Mission length 5 సంవత్సరాలు
Mass 1,650 kg (3,640 lb)
Type of orbit భూమధ్యరేఖ-సమీప
Orbit height 650 km (400 mi)
Orbit period 5 సంవత్సరాలు
Wavelength బహుళ తరంగ దైర్ఘ్యాల
Instruments
UVIT అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్
SXT సాఫ్ట్ ఎక్స్-రే టెలిస్కోప్
LAXPC X- రే సమయ మరియు తక్కువ రిజల్యూషన్ వర్ణపట అధ్యయనాలు
CZTI హార్డ్ ఎక్స్-రే ఇమేజర్
Website http://astrosat.iucaa.in/
ఆస్ట్రోశాట్

ఆస్ట్రోశాట్ అనేది భారతదేశం ఖగోళ పరిశోధన కోసం మొట్టమొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చే పీఎస్‌ఎల్‌వీ సీ-30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 2015 సెప్టెంబరు 28 న ప్రయోగించిన ఉపగ్రహం.

ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన పదేళ్ల కృషి ఫలితమే భారత తొలి ప్రయోగ ఖగోళ అధ్యయన ఉపగ్రహం ఆస్ట్రోశాట్. దీనిని విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్ వంటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం మన గెలాక్సీ అవతలి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు.

ఈ ఉపగ్రహంలో అమర్చిన ఉపకరణాలు[మార్చు]

ఈ ఉపగ్రహంలో మొత్తం 750 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఆరు సాధనాలను అమర్చారు.

  • అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (The UltraViolet Imaging Telescope - UVIT)
  • సాఫ్ట్ ఎక్స్-రే ఇమేజింగ్ టెలిస్కోప్ (Soft X-ray imaging Telescope - SXT)
  • LAXPC ఇన్స్ట్రుమెంట్ (The LAXPC Instrument)
  • కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ (Cadmium Zinc Telluride Imager - CZTI)
  • స్కానింగ్ స్కై మానిటర్ (Scanning Sky Monitor - SSM)
  • ఆవేశ కణ మానిటర్ (Charged Particle Monitor - CPM)

ఆస్ట్రోశాట్ లో అమర్చిన ఈ ఉపకరణాల విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మరో నాలుగు యూనివర్సిటీల మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ ఉపగ్రహ జీవితకాలాన్ని ఐదు సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు.

మూలాలు[మార్చు]

  • 28-08-2015 సాక్షి దినపత్రిక - (ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ - ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం)
  1. "India's eye on universe ready for tests". Retrieved May 20, 2015. 
  2. "ASTROSAT: A Satellite Mission for Multi-wavelength Astronomy". IUCAA. 2012-04-20. Archived from the original on 2013-04-22. Retrieved 2013-09-07.