పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
294 టన్నులు
Polar Satellite Launch Vehicle

విధి Medium lift launch system
తయారీదారు ఇస్రో
దేశము ఇండియా
పరిమాణము
ఎత్తు 44.4 metres (146 ft)
వ్యాసము 2.8 metres (9 ft 2 in)
ద్రవ్యరాశి PSLV: 295,000 kg (650,000 lb)
PSLV-CA: 230,000 kg (510,000 lb)
PSLV-XL: 320,000 kg (710,000 lb)
దశలు 4
సామర్థ్యము
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగ స్థలాలు సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం బూస్టర్లు (PSLV-G) - S12
బూస్టర్ల సంఖ్య 6
ఇంజన్లు off
థ్రస్టు 662 kN (149,000 lbf)
Specific impulse 262 s (2.57 km/s)
మండే సమయం 45 seconds
ఇంధనం HTPB
First దశ
ఇంజన్లు S139
థ్రస్టు 4,628 kN (1,040,000 lbf)
Specific impulse 237 s (2.32 km/s) (sea level)
269 s (2.64 km/s) (vacuum)
మండే సమయం 107.4 seconds
ఇంధనం HTPB
Second దశ
ఇంజన్లు 1 Vikas
థ్రస్టు 725 kN (163,000 lbf)
Specific impulse 293 s (2.87 km/s)
మండే సమయం 163 seconds
ఇంధనం N2O4/UDMH
Third దశ
ఇంజన్లు S7
థ్రస్టు 340 kN (76,000 lbf)
మండే సమయం 76 seconds
ఇంధనం solid HTPB
Fourth దశ
ఇంజన్లు 2 x L-2-5
థ్రస్టు [convert: invalid number]
మండే సమయం 415 seconds
ఇంధనం MMH/MON

పిఎస్ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)నిర్మించి ,ప్రయోగించినది.ఈ వాహకనౌక పిఎస్ఎల్‌వి శ్రేణికి చెందిన రెండవ ఆపరేసనల్ ప్రయోగం.ఈ ఉపగ్రహ వాహకం ద్వారా ఒకేసమయంలో మూడు ఉపగ్రహాలను/అంతరిక్షనౌకలను అంతరిక్షము లో సుర్యానువర్త ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు.[1] కక్ష్యలొ ప్రవేశపెట్టిన మూడుఉపగ్రహాలలో భారతదేశానికి చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఓసెన్‌శాట్ /(IRS-P4)ప్రధాన మొదటి ఉపగ్రహం కాగా,కొరియాకు చెందిన కిట్‌శాట్-3(KITSAT-3), జర్మనీ కి చెందిన DLR-TUBSAT అనునవి మిగిలిన రెండు ఉపగ్రహాలు.[2] [3] ఇందులో ఓసెన్‌శాట్ ఉపగ్రహం బరువు 1050 కిలోలు.కొరియాకు చెందిన కిట్‌శాట్-3(KITSAT-3) బరువు 107 కిలోలు, జర్మనికి చెందిన డిఎల్ఆర్-టుబ్‌శాట్ బరువు 45 కిలోలు.

ఉపగ్రహ వాహకనౌక యొక్క పైభాగాన పరికారాలపెట్టె(equipment bay)పైభాగాన ఓసెన్‌శాట్ ను అమర్చగా, మిగిలిన రెండు ఉపగ్రహాలను పరికారాలపెట్టె(equipment bay) మీద ఒకదానికి ఒకటి వ్యతిరేఖం దిశలో ఎదురుగా గా అమర్చారు.కక్ష్యలొ మొదట ఓసెన్‌శాట్ /(IRS-P4) ఉపగ్రహం ప్రవేశపెట్టబడినది.తరువాత కిట్‌శాట్-3, దాని తరువాత డిఎల్ఆర్-టుబ్‌శాట్ ఉపగ్రహాలు కక్ష్యలొ ప్రవేశించాయి. ఉపగ్రహ వాహకనౌక ,ఉపగ్రహాలను 727 కిలోమీటర్ల ఎత్తులో సుర్యానువర్త ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టినది[2][3].

పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక నిర్మాణవివరాలు[మార్చు]

ఉపగ్రహ వాహకనౌక పొడవు44.4మీటర్లు. ప్రయోగసమయంలో వాహకం యొక్క మొత్తం బరువు 294 టన్నులు.ఉపగ్రహ వాహకం మొత్తం నాలుగు చోదకదశలను కలిగిఉన్నది.మొదటి, మూడవ దశలో ఘనచోదకాన్ని ఉపయోగించగా, రెండవ, నాల్గవ చోదకదశలలో ద్రవచోదక ఇంధనాన్ని ఉపయోగించారు.మొదటి దశచోదక మోటారుకు అదనంగా ఆరుస్ట్రాపాన్ బూస్టరు మోటరులను అమర్చారు. ఈ స్ట్రాపాన్ మోటరులలో కూడా మొదటి చోదకదశలో ఉపయోగించిన ఘనఇంధనాన్నే ఉపయోగించారు[2][3].

మొదటిదశ స్ట్రాపాన్ రెండవ దశ మూడవదశ నాల్గవదశ
పేరు కోర్PSI PSOM 6Nos PS2 PS3 PS4
చోదకం ఘనHTPB ఘనHTPB ద్రవUDMH+ N2O4 ఘనHTPB MMH + N2O4
చోదకం బరువు,టన్నులు 138.0 6X9.0 40.6 7.2 2.0
దశ/అంచె బరువు,టన్నులు 229 46 8.4 2.89
త్రోపుడు శక్తి KN 4628 662 x 6 725 340 7.4 x 2
దహన సమయం,సెకన్లు 107.4 45 163 76 415
దశ వ్యాసం,మీటర్లు 2.8 1.0 2.8 2.0 1.3
దశపొడవు,మీటర్లు 20 10 12.5 3.6 2.1

ప్రయోగం[మార్చు]

పిఎస్ఎల్‌వి –C2 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్రాష్టంలోని నెల్లూరు జిల్లా లోనిశ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్షప్రయోగ వేదికనుండి మే నెల 26 తేది,1999 న ప్రయోగించారు.మొదటి పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకను సెప్టెంబరు 29,1997 లో ప్రయోగించారు. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా IRS-1D ఉపగ్రహాన్ని అంతరిక్షకక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "PSLV SUCCESSFULLY LAUNCHES THREE SATELLITES". pib.nic.in. Retrieved 2015-10-01.
  2. 2.0 2.1 2.2 "PSLV-C2". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-01.
  3. 3.0 3.1 3.2 "PSLV-C2 MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-10-01.