పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
294 టన్నులు
Polar Satellite Launch Vehicle

పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక
విధి Medium lift launch system
తయారీదారు ఇస్రో
దేశము ఇండియా
పరిమాణము
ఎత్తు 44.4 metres (146 ft)
వ్యాసము 2.8 metres (9 ft 2 in)
ద్రవ్యరాశి PSLV: 295,000 kg (650,000 lb)
PSLV-CA: 230,000 kg (510,000 lb)
PSLV-XL: 320,000 kg (710,000 lb)
దశలు 4
సామర్థ్యము
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగ స్థలాలు సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం బూస్టర్లు (PSLV-G) - S12
బూస్టర్ల సంఖ్య 6
ఇంజన్లు off
థ్రస్టు 716 kN (161,000 lbf)
Specific impulse 262 s (2.57 km/s)
మండే సమయం 49.5 seconds
ఇంధనం HTPB
First దశ
ఇంజన్లు S139
థ్రస్టు 4,819 kN (1,083,000 lbf)
Specific impulse 237 s (2.32 km/s) (sea level)
269 s (2.64 km/s) (vacuum)
మండే సమయం 101.51సెకన్లు
ఇంధనం HTPB
Second దశ
ఇంజన్లు 1 Vikas
థ్రస్టు 804 kN (181,000 lbf)
Specific impulse 293 s (2.87 km/s)
మండే సమయం 149 సెకన్లు
ఇంధనం N2O4/UDMH
Third దశ
ఇంజన్లు S7
థ్రస్టు 240 kN (54,000 lbf)
మండే సమయం 112.1సెకన్లు
ఇంధనం solid HTPB
Fourth దశ
ఇంజన్లు 2 x L-2-5
థ్రస్టు [convert: invalid number]
మండే సమయం 523 సెకన్లు
ఇంధనం MMH/MON

పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌకభారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రోరూపొందించిన, పిఎస్ఎల్ వి ఉపగ్రహ వాహకశ్రేణికి చెందిన 21 వ ఉపగ్రహవాహకం[1].పిఎస్ఎల్ వి అనగా దృవీయ ఉపగ్రహ ప్రయోగవాహనం (Polar Satellite Launch Vehicle) అని అర్థం.పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇస్రో వారు తయారు చేసిన, భారతీయ మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్-1 ను అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టినారు. పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక, పిఎస్ఎల్ వి ఉపగ్రహ వాహకశ్రేణిలో PSLV-XL రకానికిచెందిన మూడవ ఉపగ్రహ వాహకం.అంతకు ముందు ప్రయోగించిన PSLV-XL రకానికి చెందిన రెండు ఉపగ్రహ వాహకనౌకల ద్వారా చంద్రయాన్-1 అంతరిక్షనౌక, జీశాట్-12 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షములోకి విజయవంతంగాపంపారు.

ఉపగ్రహ వాహకనౌక నిర్మాణం[మార్చు]

పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక 4 అంచెలు/దశలు/స్టేజిలను కలిగిన వాహకనౌక. ఈనౌకలో ద్రవ, ఘనఇంధనాలను చోదకయంత్రాలలో/మోటరులలో ఉపయోగించారు.ఘన, ద్రవ చోదకదశలను ఒకదాని తరువాత ఒకటి చొప్పున అమర్చారు. అనగా మొదటి, మూడవ దశలో ఘన ఇంధనాన్ని చోదక మొటారులలో వాడగా, రెండవ-నాల్గవదశ మోటరులలో ద్రవఇంధనాన్ని వాడారు. ఉపగ్రహ వాహకనౌక పొడవు 44.5 మీటర్లు. ప్రయోగ సమయంలో వాహకనౌక బరువు 321 టన్నులు[1]

మొదటి దశ[మార్చు]

మొదటి దశ కోర్‌దశ లేదా PS1 దశ.S 138 మోటారు బిగించబడినది.[2] ఈ దశ వ్యాసం 2.8 మీటర్లు.పొడవు 20 మీటర్లు.ఇందులో ఘనఇంధనాన్ని ఉపయోగించారు. చోదకఇంధనం HTPB.అనగా హైడ్రాక్సీ టెర్మినేటేడ్ పాలి బ్యుటడైన్ అని అర్థం. ఈదశలో ఉపయోగించిన చోదక ఇంధన భారం 138.0 టన్నులు. ప్రయోగ సమయంలో ఈదశలో ఏర్పడు గరిష్ఠ త్రోపుడు శక్తి 4819 కిలోన్యూటన్లు.మొదటి దశ/అంచులో చోదక ఇంధనం మండుటకు పట్టు సమయం 101.5 సెకన్లు[1].

మొదటిదశ-స్ట్రాపాన్ మోటరులు[మార్చు]

ఉపగ్రహప్రయోగ మొదటిదశలో వాహనం కదలుటకై గరిష్ఠ చలనశక్తిని అందించుటకై మొదటిదశకు అదనంగా ఆరుస్ట్రాపాన్ మోటరులను బిగించారు. ఈ స్ట్రాపాన్ మోటరులలో కూడామొదటి దశలోమాదిరి ఘన HTPB ఇంధనాన్ని నింపారు. ఒక్కో స్ట్రాపాన్ మోటరు/చోదక యంత్రం పొడవు 14.7మీటర్లు.స్ట్రాపాన్ వ్యాసం 1.0 మీటరు.ఒక్కో మోటరులోని ఇంధనం బరువు 12.0 టన్నులు.ఒక్కొక్క స్ట్రాపాన్ మోటరు దహనసమయంలో కల్గించు గరిష్ఠ త్రోపుడుశక్తి 716 కిలోన్యూటన్లు. ఇంధనం మండుటకుకు పట్టుసమయం 49.5 సెకన్లు[1].

రెండవ దశ[మార్చు]

రెండవదశలో మిశ్రమ ద్రవఇంధనాన్ని చోదకమోటరులో నింపారు.L40 వికాస్ ఇంజన్ను బిగించారు[2]. మిశ్రమ ఇంధనం UH25మరియుN2O4.UH25 అనగా అన్ సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాజీన్+హైడ్రాజీన్ హైడ్రేట్, N2O4 అనగా డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. రెండవదశలో ఇంధన భారం 41.7 టన్నులు. రెండవదశ వ్యాసం 2.8 మీటర్లు, పొడవు 12.8 మీటర్లు.మండే సమయంలో కల్గు త్రోపుడుశక్తి 804 కిలోన్యూటనులు. ఇంధన దహనంనకు పట్టు సమయం149 సెకన్లు[1].

మూడవ దశ[మార్చు]

మూడవదశలో చోదక మోటరులో ఘనఇంధనాన్ని నింపారు.మూడవదశలో S-7 మోటరును బిగించారు[2]. ఇందులో నింపిన ఘనఇంధనం HTPB. అనగా హైడ్రాక్సీటెర్మినేటేడ్ పాలిబ్యుటడైన్ అని అర్థం.ఈదశలో ఉపయోగించిన చోదక ఇంధన భారం 7.6టన్నులు. మండే సమయంలో కల్గు త్రోపుడుశక్తి 240 కిలోన్యూటన్లు. ఇంధనం పూర్తిగా మండుటకు పట్టుసమయం 112.1.మూడవదశ వ్యాసం 2.0 మీటర్లు.ఈ దశయొక్క పొడవు 3.6 మీటర్లు[1].

నాలగవదశ[మార్చు]

4వదశ యొక్క పొడవు 2.6 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు.4వ దశలో చోదకయంత్రంలో ద్రవఇంధనాన్ని నింపారు.నింపిన ఇంధన మిశ్రమం MMH + MON-3. MMH అనగా మొనోమిథైల్ హైడ్రాజీన్, MON అనగా నైట్రోజన్ యొక్క మిశ్రమఆక్సైడ్ లు.ఈ దశలో నింపిన ఇంధన భారం 2.5 టన్నులు.నాల్గవదశలో రెండు L-2.5 ఇంజన్లు అమర్చబడిఉన్నవి[2].రెండు ఇంజనులు పనిచేయును.ఇంధనం మండుటకు పట్టే సమయం 523 సెకన్లు.ఇంజన్ మండునపుడు ఏర్పడు త్రోపుడుశక్తి 2x7.3 కిలోన్యూటన్లు[1].

నాల్గవదశ తరువాత నిర్మాణం[మార్చు]

నాలగవ దశకు పైభాగాన ఉపగ్రహ వాహనాన్ని నియంత్రణ చెయ్యు పరికరాలపెట్టె (equipment bay) ఉండి, దానిపై భద్రంగా ఉపగ్రహం అమర్చబడిఉన్నది. దీని చుట్టూ 3.2 మీటర్ల వ్యాసమున్న, రెండు సమభాగాలుగా నిర్మాణం కలిగిన ఉష్ణరక్షక కవచంఉన్నది.ఇది ఐసోగ్రిడ్ నిర్మాణం.ఈ రక్షక కవచం, ఉపగ్రహ వాహనం/కం సాంద్రతయుత వాతావరణం గుండా ప్రయానించుసమయంలో, గాలితో వాహకం ఘర్షణవలన ఏర్పడు వేడి, వత్తిడి/పీడనం నుండి ఉపగ్రహాన్ని, పరికారాల పెట్టెను, అందులోని నియంత్రణ ఉపకరణాలను సంరక్షించును.[3] [4]

ఉపగ్రహ వాహనం గమనంలో ఉండునపుడు వాహక నియంత్రణ వ్యవస్థ[మార్చు]

మొద దశలో పిచ్, యవ్ (pitch and yaw) నియంత్రణకు సెకండరి ఇంజెక్షను త్రస్ట్ వెక్టరు కంట్రోల్ (SITVC) వ్యవస్థ, రోల్ (roll) నియంత్రణకు రియక్షన్ కంట్రోల్ త్రస్టరులు (RCT) కలవు, రెండు స్ట్రాపాన్ మోటరుల మీద అమర్చిన SITVC ద్వారా రోల్ కంట్రోల్ అగుమేంటేసన్ జరుగుతుంది.రెండవదశలో పిచ్, యవ్ (pitch and yaw) నియంత్రణకు ఇంజిన్ గింబాల్ (Engine gimbal) విధానం, ఫ్లైట్ రోల్ కై హాట్ గ్యాస్ రియాక్షన్ నియంత్రణ ఉంది.మూడవదశలో పిచ్, యవ్ నియంత్రణకు ఫెక్సు నాజిల్, రోల్ కై PS-4 RCS వ్యవస్థను అమర్చారు.నాల్గవదశలో ఇంజిన్ గింబాల్ నియంత్రణ వ్యవస్థ ద్వారా పిచ్, యవ్, రోల్ నియంత్రణ చెయ్యు బడును[3].

నాలగవదశ పైభాగాన అమర్చిన పరికారలపెట్టెలో అమర్చిన (equipment bay) ఇనేర్టియాల్ నావిగేసన్ సిస్టం (INS) ద్వారా ఉపగ్రహా వాహనం బయలు దేరినది మొదలు, ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టు వరకు ఉపగ్రహ ప్రయోగ వాహనాన్నిమార్గ నిర్దేశం చేయును[3][4].

ప్రయోగ వివరాలు[మార్చు]

పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా రీశాట్-1 ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా) లోని బంగాళాఖాతం నకు సమీపంలోని పులికాట్ సరస్సు పరిసర ప్రాంతంలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం లోని మొదటి ప్రయోగవేదిక నుండి ఏప్రిల్ 26,2012 సంవత్సరంలో అంతరిక్షములోకి పంపారు.

ఇవికూడా చూడండి[మార్చు]

బహ్యలింకులు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "PSLV-C19". isro.gov.in. Archived from the original on 2016-02-05. Retrieved 2015-10-25.
  2. 2.0 2.1 2.2 2.3 "ISRO PSLV launches with RISAT-1 satellite". nasaspaceflight.com. Retrieved 2015-10-25.
  3. 3.0 3.1 3.2 "PSLV-C4". isro.gov.in. Archived from the original on 2015-12-07. Retrieved 2015-09-29.
  4. 4.0 4.1 "PSLV C4-METSAT MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-09-30.