జీశాట్-12 ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీశాట్-12 ఉపగ్రహం
జీశాట్-12 ఉపగ్రహం
మిషన్ రకంసమాచార వ్యవస్థ
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2011-034A Edit this at Wikidata
SATCAT no.37746
మిషన్ వ్యవధి8 సంత్సరాలు
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి1,412 kilograms (3,113 lb)
డ్రై ద్రవ్యారాశి559 kilograms (1,232 lb)[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ15 July 2011, 11:18 (2011-07-15UTC11:18Z) UTC
రాకెట్PSLV-XL C17
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SLP
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం83° East
Perigee altitude35,782 kilometres (22,234 mi)
Apogee altitude35,803 kilometres (22,247 mi)
వాలు0.01 degrees
వ్యవధి23.93 hours
ఎపోచ్25 December 2013, 01:49:32 UTC[2]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్12[విడమరచి రాయాలి]
 

జీశాట్-12 ఒక సమాచార పంపిణి ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని భారతదేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ‘’’ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గనైజెసన్ (క్లుప్తంగా ఇస్రో) వారు తయారు చేసారు.ఈ ఉపగ్రహాన్ని PSLV-XL /C17అనే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఉపగ్రహన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్షప్రయోగ కేంద్రంనుండి ప్రయోగించారు. సతీష్ థావన్ ఉపగ్రహప్రయోగ కేంద్రం నుండి జీశాట్-12 ఉపగ్రహాన్ని 2011 జూలై 15 11:18 (UTC) గంటలకు అంతరిక్షములోకి పంపారు.

ఉపగ్రహం[మార్చు]

అంతకు ముందు ప్రయోగించిన INSAT-3B ఉపగ్రహం యొక్క జీవితకాలం ముగిసినందున, దాని స్థానంలో పనిచేయుటకై జీశాట్-12 ఉపగ్రహాన్నికక్ష్యలో ప్రవేశపెట్టారు.జీశాట్-12 ద్వారా దూరవిధ్యాబోధన, దూర విద్యావిధానం, విపత్తు ఏర్పడినపుడు నివారణ చర్యలు వంటి సేవలనుశాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా అందించుట ప్రధాన ఉద్దేశం.[3]

జీశాట్-12 ఉపగ్రహ ప్రయోగ నేపథ్యం[మార్చు]

జీశాట్-12 ప్రయోగం ఒక విశిష్టతను సంతరించుకుంది.ఈ ప్రయోగంలో పాలుపంచుకొన్న వారందరు మహిళలే కావటం ఆ విశిష్టత.ఈ ప్రాజెక్టు డైరెక్టరు T.k.అనురాధ, మిసను డైరెక్టరు ప్రమోద హెగ్డే, ఆపరేసను డైరెక్టరు అనురాధ.ఎస్.ప్రకాశ్.అందరు మహిళామణులే.

పేలోడ్ వివరాలు[మార్చు]

ఇంధన సమేతంగా ఉపగ్రహం బరువు 1410 కిలోగ్రాములు.ఖాళి ఉపగ్రహం బరువు 559 కిలోగ్రాములు.ఉపగ్రహం పరిమాణం 1.485 x 1.480 x 1.446 దీర్ఘఘనచతురస్రాకారం.ఉపగ్రహం 12 ఎక్సుటెండెడ్ C-బాండ్ ట్రాన్స్‌పాండరులు కలిగి ఉంది.ఉపగ్రహానికి కావలసిన విద్యుతును ఉత్పత్తి చెయ్యుటకై, ఒక సౌరపలకను, ఒక 64 Ah Li-Ion బ్యాటరికలిగి ఉంది. సౌరపలక విద్యుతు ఉత్పత్తి సమర్ధ్యం 1430 Watts.సమాచారాన్ని పంపుటకు, స్వీకరించుటకు ఒక ౦.7వ్యాసమున్న పరాబోలిక్‌ యాంటెన్నా (తరంగ గ్రహకం),1.2 మీటర్ల వ్యాసమున్న పొలారిసాసన్ సెన్సిటివ్ కలిగి విస్తరణ సౌకర్య మున్నయాంటెన్నా ఉంది.ఉపగ్రహాన్ని కావలసిన కక్ష్యలోకి జరుపుటకు ఉపగ్రహంలో 440 న్యూటన్ శక్తిగల లిక్విడ్‌ త్రస్ట్ మోటరు/ఇంజన్ ఉంది.

ప్రయోగం[మార్చు]

జీశాట్-12 ఉపగ్రహాన్ని, పీఎస్ఎల్‌వి C-17 ఉపగ్రహవాహకనౌక ద్వారా, శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్షకేంద్రంలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి, 2011 జూలై 15న ప్రయోగించారు.[4] ఉపగ్రహం యొక్క జీవిత కాలం 8 సంవత్సరాలు.[5][6]

ఉపగ్రహ కక్ష్య[మార్చు]

భూసమస్థితి కక్ష్యలో ఉపగ్రహం యొక్క పెరిజీ 35,782 కిలోమీటర్లు, అపోజీ 35,803కిలోమీటర్లు,83° తూర్పాక్షాంశంలో ప్రదక్షిణ.వాలు 0.01 డిగ్రీలు.

ఇవికూడా చూడండి[మార్చు]

అధారాలు/మూలాలు[మార్చు]

  1. "UCS Satellite Database". Union of Concerned Scientists. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 25 December 2013.
  2. Peat, Chris (25 December 2013). "GSAT 12 - Orbit". Heavens Above. Retrieved 25 December 2013.
  3. "GSAT-12 reaches its home in a circular geo-synchronous orbit". The HIndu. Jul 15, 2011. Retrieved March 20, 2013.
  4. "ISRO successfully launches latest communication satellite GSAT-12". Economic Times. Jul 15, 2011. Retrieved March 20, 2013.
  5. "GSAT-12". space.skyrocket.de. Archived from the original on 2015-09-27. Retrieved 2015-09-07.
  6. "GSAT-12 powered by PSLV is ready to launch". engineersworldonline.com. Archived from the original on 2016-03-03. Retrieved 2015-09-07.