జీశాట్-19

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీశాట్-19 E
మిషన్ రకంసమాచార వ్యవస్థ ఉపగ్రహం
ఆపరేటర్INSAT
COSPAR ID2017-031A Edit this at Wikidata
SATCAT no.42747Edit this on Wikidata
వెబ్ సైట్isro.gov.in/gslv-mk-iii-d1-gsat-19
మిషన్ వ్యవధిపది సంవత్సరాలు[1]
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి3,136 కి.గ్రా. (6,914 పౌ.)[1]
డ్రై ద్రవ్యారాశి1,394 కి.గ్రా. (3,073 పౌ.)[1]
కొలతలు2.0 × 1.77 × 3.1 మీ. (6.6 × 5.8 × 10.2 అ.)[1]
శక్తి4,500 watts[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ5 June 2017 (2017-06-05)[2][3]
రాకెట్GSLV Mk III D1[3]
లాంచ్ సైట్సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం,శ్రీహరికోట,నెల్లూరు జిల్లా
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రిత కక్ష్య
రెజిమ్భూఅనువర్తిత స్థిరకక్ష్య
 

జీశాట్-19 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసిన ఉపగ్రహం. గతంలో ఇస్రో జీశాట్ సీరిస్‌లో జీశాట్-1 ఉపగ్రహం, జీశాట్-2 ఉపగ్రహం జీశాట్-3 ఉపగ్రహం, అలాగాజీశాట్-19 వరకు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోహించడంజరిగింది. ఈ ప్రయోగం విజయవంతం అయినచో అత్యంత బరువైన ఉపగ్రహాలను స్వంతగడ్ద మీదనుంచి ప్రయోగించేసత్తా ఇస్రోకు లభి స్తుంది. అందువలన ఈ ప్రయోగ విజయం ఇస్రోకు, భారత దేశానికి అత్యంత ప్రతిష్ఠకరామిన ప్రయోగం. జీశాట్-19 ఉపగ్రహం బరువు 3, 136 కిలోలు. ఇంతటి బరువున్న ఉపగ్రహాన్నిభారత ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించ లేదు. ఈ ఉపగ్రహాన్ని నిర్దిష్త అంతరిక్షకక్షలో ప్రవేశపెట్టుటకై జీఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన మార్క్3డీ1 అను ఉపగ్రహవహక నౌకను ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో వున్న శ్రీహరికోటలోని సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి సోమవారం జూన్ 5. 2017న ప్రయోగించుటకు అన్ని ఏర్పట్లు పూర్తి చేసారు. అనుకున్న విధంగా ప్రయోగం విజయవంతంఅయ్యింది. మొదటిసారిగా చేసిన మార్క్3డీ1 ఉపగ్రహ నౌక ప్రయోగం విజయవంతం అయ్యింది. అనుకున్న విధంగా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశ పెత్తినది. ఈ ప్రయోగంతో 3నుండిచ్4 టన్నులబరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్తగల సామర్ధ్యం పొంది, ఇలాంటి అంతరిక్ష పరిజ్ఞానంకలిగిన అమెరికా, రష్యా, యూరొఫ్, చైనా, జపాన్ దేశాల సరసన చేరింది[4] ఇంతకుముందు 2. 2-2. 5టన్నుల ఉపగ్రహాలను మాత్రమే ప్రవేశపెట్టారు.

జీశాట్-19 ఉపగ్రహ వివరాలు

[మార్చు]

జీశాట్-19 ఉపగ్రహం బరువు 3136 కిలోలు.[5] ఇది దేశములో టెలివిజను ప్రసారలు, టెలికాం రంగంలో విస్రుతసేవలు, ఇంటర్నెట్ వేగవంతంగ పనిచెయ్యడమే గాక అధునాతనమైన కమ్యూనికేసను వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రయిడ్ మోబైల్సులో ఇంతర్నెట్ సేవలు త్వరితగతిగ అందేలా చేస్తుంది. ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రిక్వెంసి ట్రాన్సుపాందరులతో బాటుగా జియో స్టేషనరీ రేడియేసన్ స్పెక్టోమీటరు పేలోడ్సు/ఉపకరణాలు అమర్చారు. మొత్తం గా3136 కిలోలు ఉన్న ఉపగ్రహంలో 1742 కిలోల ఇంధనాన్ని నింపారు. ఉపకరణాల బరువు 1364 కిలోలు. జీశాట్-19 ఉపగ్రహం పనిచేయు జీవిత కాలం 10 సంవత్సరాలు.[6]

జీఎస్‌ఎల్‌వి-మార్క్3డీ1 ఉపగ్రహ వాహకనౌక వివరాలు

[మార్చు]

వాహకనౌక ఎత్తు 43. 45 మీటర్లు. ఇంధనంతో సహ మొత్తం బరువు 640 టన్నులు.[7] మొత్తం మూడు దశలున్నాయి. మొదటి దశలో ఎస్200 ఇంజన్లు రెండు, రెండో స్టేజిలో ఎల్110 ద్రవ ఇంధనం కోరు ఇంజిన్, మూడవదశలో సీ25 క్రయోజనిక్ ఇంజిన్ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16:20 నిమిషాలకు ఉపగ్రహం వాహకనౌక నుండి విడిపోయి కక్ష్యలో చేరును. ఇది ఉపగ్రహాన్ని భూ అనువర్తిత బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. మార్క్ 3 డీ1 వాహక నౌక, ఈ శ్రేణిలో మొదటిప్రయోగం.[8] అందువల్ల ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం ప్రకటించారు. ప్రధాని రాష్ట్రపతులు అభినందనలు తెలిపారు. ఈ ఉపగ్రహ వాహకనౌక రెండు స్ట్రాపాన్ మోటారులు కలిగి ఉంది. ఈ స్ట్రాపాన్ మోటారులను ‘S200’ అంటారు. ఇందులో ఒక్కోదానిలో 205 టన్నుల సంయుక్త ఘన ఇందనం నింపారు. ఈ స్ట్రాపాన్ మోటారులను మండించడంతో రాకెట్ పయనం మొదలైంది. ఈ స్ట్రాపాన్ మోటారులు 140 సెకనులు పనిచేసి రాకెట్ను గగన తలం వైపు తీసుకెళ్ళాయి. బయలు దేరిన 114 సెకన్లకు, స్ట్రాపాన్ మోటారులు పనిచేసే సమయంలోనే, రెండవదశలోని రెండు L110 వికాస్ ద్రవ ఇంధన మోటరులు పనిచెయ్యడం మొదలైంది. 140 సెకన్లకు స్ట్రాపాన్ మోటారులు వేరుపడిన తరువాత కూడా L110 పనిచేయును. రెండవ స్టేజి పైన అత్యంత క్లిష్తమైన కయోజెనిక్ ఇంజను వ్యవస్థ ఉంది. ఈ రాకెట్ 4 టన్నుల బరువున్నఉపగ్రహాన్ని భూఅనువర్తిత బదిలో కక్ష్యలోను, 10 టన్నుల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యలో ప్రవేశ పెట్టును.[9]

కౌంట్ డౌన్ వివరాలుమరియు ప్రయోగవివరాలు

[మార్చు]

కౌంట్ డవును ప్రక్రియ ఆదివారం మధ్యహాన్నం 3:58గంటలకు ప్రారంభమైనది. ఇది 25:30గంటలు నిర్వివిరామంగా జరిగిన తరువాత ప్రయోగం మొదలగును. వాహక నౌకనుశ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోనిరెండవ ప్రయోగ కేంద్రంలో అమర్చారు. కౌంట్ డౌన్ పూర్తవ్వగానే సరిగ్గా 5:28 నిమిషాలకు ఉపగ్రహవాహక నౌక గగనతలం వైపు నిరాంతరాయంగా సరైన దిశలో ప్రయణించి 16:20 నిమిషాల తరువాత జీశాట్-19 ను కక్ష్యలో ప్రవేశపెట్టినది. భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూఅనువర్తితబదిలి కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు[10]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "GSLV Mark III-D1 / GSAT-19 Brochure". IRSO. Archived from the original on 2018-11-18. Retrieved 2017-06-05.
  2. "Launch Schedule". Spaceflight Now. 8 May 2017. Archived from the original on 12 May 2017.
  3. 3.0 3.1 Laxmi Ajai, Prasannal (19 May 2017). "Come June 5, Isro to launch 'game changer' rocket". The Times of India. Times News Network. Retrieved 21 May 2017.
  4. "ISRO's heaviest rocket with GSAT-19 satellite launches into space". deccanchronicle.com. Retrieved 2017-06-12.
  5. "GSAT-19". isro.gov.in. Archived from the original on 2018-08-15. Retrieved 2017-06-05.
  6. "నేడు నింగిలోకి ఇస్రోబహుబలి". sakshi.com. 2017-06-05. Archived from the original on 2017-06-07. Retrieved 2017-06-05.
  7. "India's heaviest rocket with GSAT-19 satellite to lift-off into space today". hindustantimes.com. hindustan times. Archived from the original on 2017-06-04. Retrieved 2017-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "GLSV Mark III rocket set for 'all-up' launch with GSAT-19 satellite". nasaspaceflight.com. Retrieved 2017-06-05.
  9. "GSLV Mk III". isro.gov.in. Archived from the original on 2017-06-05. Retrieved 2017-06-13.
  10. "sro scripts history with GSLV Mark III rocket, GSAT-19 satellite launch". livemint.com. Retrieved 2017-06-12.
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-19&oldid=3855430" నుండి వెలికితీశారు