జీశాట్-9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీశాట్-9
మిషన్ రకంసమాచార వ్యవస్థ
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2017-024A Edit this at Wikidata
SATCAT no.42695Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 సంవత్సరాలు
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుఇస్రో
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి2,330 కిలోగ్రాములు (5,140 పౌ.)
శక్తి2.3 kilowatts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ5 May 2017[1]
రాకెట్GSLV Mk.II
లాంచ్ సైట్సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం,నెల్లూరు
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రియ కక్ష్య
రెజిమ్భూస్థిర కక్ష =
రేఖాంశం48° తూర్పు[2]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్12 Ku band
 

జీశాట్-9 ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో రూపొందించింది. ఇది ఒక సమాచార ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వి మార్క్-2 ఎఫ్9 వాహకనౌక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అతరిక్ష కేంద్రం నుండి 2017 మే 5 న ప్రయోగించారు.

ఉపగ్రహ నిర్మాణానికి నాంది

[మార్చు]

ఈ ఉపగ్రహ ప్రయోగ ప్రతిపాదన 2014 లో వచ్చింది. ప్రదానిమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ తన పదవీ స్వీకారానికి సార్క్ కూటమి దేశాధిపతులను అహ్వానించాడు. ఆ సందర్భంలో సార్క్ ప్రాంతాభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించాడు. ప్రధానిమంత్రి అప్పుడు చేసిన వాగ్దానాన్ని ఇస్రో ఇప్పుడు సాకారం చేసి చూపించింది. జీశాట్-9 కి సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టాలనుకున్నప్పటికి, సార్క్ లో భాగమైన పాకిస్తాన్ ఈ ప్రాజెక్టులో చేరేందుకు నిరాకరించడంతో, ఈ ఉపగ్రహం పేరును దక్షిణాసియా ఉపగ్రహంగా మార్చారు. [3]

జీశాట్ ఉపగ్రహ సాంకేతిక వివరాలు

[మార్చు]

జీశాట్-9 లో 12 KU-band ట్రాన్సుపాండరు లున్నాయి. ప్రస్తుతం DTH (Direct to home)/ఇంటికే నేరుగా సేవ సిగ్నల్ వ్యవస్థను అందించుటకు Ku-బాండ్ ట్రాన్సుపాండరుల వ్యవస్థ ఎంతో శక్తి వంతంగా, సమర్ధవంతంగా పని చేస్తుంది. ఈ ఉపగ్రహంలో KU-బాండు ట్రాన్సుపాండరులతో పాటు రెండు బెకాన్ (Becon) ట్రాన్సిస్టరులను కూడా అమర్చారు. ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం 12 సంవత్సరాలు. ఈ ఉపగ్రహాన్ని 48° డిగ్రీల తూర్పు ఏటవాలు తలంలో అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.[4]

ట్రాన్సు పాండరుల పౌనఃపున్యం (Frequency)

[మార్చు]

ఇందులో KU –బాండ్: U/L: 14250 – 14500 MHz (LV & LH) D/L:11450 – 11700 MHz (LH & LV)[4] kU-బెకాన్: D/L : 11698. 5 MHz (LV) & 11699. 5 MHz (LH)

జీశాట్-19 ఉపగ్రహం ప్రయోగం ముఖ్యోద్దేశ్యం దక్షిణాసియా ప్రాంతంలో అంతరిక్ష సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇందుకై ఇందులో 12 KU బాండ్ ట్రాన్సుపాండరులను ఆమర్చారు. ఇందుకు అనుగుణంగా ఈ ఉపగ్రహాన్ని I-2K bus ప్రామాణికంగా రూపకల్పన చేసారు. ఈ ఉపగ్రహం బరువు 2230 కిలో గ్రాములు. ఈ ఉపగ్రహం యొక్క ప్రధానభాగం చరురస్రాకార షౌష్టవాన్ని కల్గివున్నది. ఈ ఉపగ్రహాన్ని సతీష ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ఉపగ్రహ ప్రయోగవేదిక నుండి ప్రయోగించుటకు సిద్దం చేయ్యడమైనది.[5] ఉపగ్రహం లో అమర్చిన KU బాండ్ ట్రాన్సుపాండరులు అహమ్మదాబాదు లోని స్పేస్ అప్లికేసన్సు సెంటరునందు తయారు చేయబడినవి. ఈ పరికర సముదాయ వ్యవస్థ వలన అండమాన్ నికోబార్ రాష్ట్రాలతో సహితం మొత్తంభారత దేశ సమాచార వ్యవస్థను కవరు చేయును. ఈ ఉపగ్రహం కేవలం భారతదేశ సమాచార వ్యవస్థకే కాకుండా పొరుగు దేశాలైన. సార్కు దేశాలకు (పాకిస్తాన్ మినహాయించి)కుడా తన సేవలను అందిస్తుంది. ఇది గతంలో ప్రయోగించిన ఇన్సాట్-4C/4CR కోవకు చెందినదే ఈ జీషాట్-9 ఉపగ్రహం. ఈ ఉపగ్రహంలోని విద్యుత్తూ వ్యవస్థ సామర్ధ్యం 2300W. [6]

ఉపగ్రహం వలన ఉపయోగాలు

[మార్చు]

ఈ ఉపగ్రహంలోని కెయూ బ్యాండ్ ట్రాన్సుపాండర్ల వలన దక్షిణాసియా దేశాలకు టెలికమ్యూనికేసన్స్, టెలివిజన్, డీ2హెచ్, వీశాట్స్, టెలి-ఎడ్యుకేసన్ టెలి మెడీసన్ వంటి రంగాల్లొ సెవలు అందుతాయి. భూకంపాలు, తుఫానులు, వరదలు, సునామీలు వంటి సమయంలో దక్షీణాసియా దేశాల మధ్య సమన్యయం కోసం హట్‌లైన్ సంభాషణలకు వీలు కల్పిస్తుంది. [3]

జిఎస్‌ఎల్‌వి మార్క్2 ఎఫ్9 వాహకనౌక వివరాలు

[మార్చు]

జీశాట్-9 ఉపగ్రహన్ని జిఎస్‌ఎల్‌వి-ఎఫ్9 వాహకనౌక ద్వారా అంతరిక్షంలో క్షక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహవాహక నౌక మూడు దహన దశలను కల్గిన మార్క్-2 రకానికి చెందిన వాహకనౌక. ఇందులో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండవ దశలో ద్రవ ఇంధనాన్నీ ఉపయోగించారు. జీఎస్ఎల్‌వి వాహకంలో క్లిష్టమైనది మూడవ దశ అయిన క్రయోజనిక్‌ దశ. క్రయోజనిక్ దశలో ఇంధనం అతి శీతల స్థితిలో ఉంటుంది. ఈ దశలో ద్రవఆక్సిజన్ (LOX) ను ఆక్సీకరణిగాను, ద్రవ హైడ్రోజన్ (LH2) ను ఇంధనంగానూ ఉపయోగిస్తారు. క్రయోజనిక్‌ భాగం వ్యాసం 2.8 మీటర్లు. జిఎస్‌ఎల్‌వి మార్క్. 2 వాహనంలోని క్రయోజనిక్ దశలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన CE-7.5 ఇంజన్ను అమర్చారు. అలాగే జిఎస్‌ఎల్‌వి మార్క్ 1 వాహనంలో రష్యా నుండి దిగుమతి చేసుకున్న క్రయోజనిక్ ఇంజన్ను బిగించారు. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ను కేరళ లోని వళియమల, తమిళనాడు లోని మహేంద్రగిరిలలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ లో తయారు చేసారు.[7] [8] ఈ వాహక నౌక పొడవు 49 మీటర్లు, బరువు 415 టన్నులు[3]

ప్రయోగ వివరాలు

[మార్చు]

ఉపగ్రహ వాహక నౌక కౌంట్ డౌన్ గురువారం, మేనెల 4 వతేది 2017 న మొదలైంది. 28 గంటల నిరాంతరాయ కౌంట్ డౌన్ తరువాత ఈ ఉపగ్రహ నౌక శుక్రవారం సాయంత్రం 4:57(5 వతేది మేనెల 2017) గంటలకు అంతరిక్షం వైపు తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఉపగ్రహ నౌకను సతిష ధవన్ కెంద్రం లోని రెందవ ఉపగ్రహప్రయోగ వేదికనుండి ప్రయోగించారు. ఈ వాహక నౌక భూమి నుండి బయలు దేరిన 17 నిమిషాల్లో తన గమ్యం చేరుకుని ఉపగ్రహన్ని అనుకున్న విధంగా కక్షలో ప్రవేశ పెట్టినది. జిఎస్‌ఎల్‌వి శ్రేణిలో ఇప్పటికి 11సార్లు ప్రయోగించగ 8 సార్లు విజయము సాధించారు. ఇది జిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన 8 విజయం. ఈ ప్రయోగ విజయంతో భారతదేశం 3 టన్నుల కంటే బరువైన ఉపగ్రహాలను భూ స్థిర బదిలీ కక్షలో ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని సాధించింది. [3]. స్వదేశీ క్రయోజనిక్ ఇంజను ఉపయోగించి చేసిన ఇంజనుతో ఇది వరుసగా నాలుగో విజయం. 2010 లో ప్రయోగించిన రెండు ప్రయోగ వైఫల్యాలను అధిగమించి. క్రయోజనిక్ ఇంజన్ను అభివృద్ధి పరచి వరుస విజయాలు సాధించారు. అనంతరం 2014, 2015, 2016 లో చేసిన విజయాలతో హ్యాట్రిక్ సాధించారు.

ప్రాజెక్టు ఖర్చు

[మార్చు]

జీశాట్-9 తయారీకి రూ. 235 కోట్లు ఖర్చుకాగా మొత్తం ప్రాజెక్టుకు 450 కోట్లు ఖర్చైంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "India to launch GSAT-9 communication satellite on May 5: ISRO". Retrieved 2017-04-29.
  2. "GSAT-9". Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 January 2014.
  3. 3.0 3.1 3.2 3.3 "జీశాట్-9 విజయవంతం". sakshi.com. 2017-05-06. Archived from the original on 2017-05-06. Retrieved 2017-05-06.
  4. 4.0 4.1 "GSAT-9". sac.gov.in. Archived from the original on 2014-01-07. Retrieved 2017-04-30.
  5. "GSLV-F09 / GSAT-9". isro.gov.in. Archived from the original on 2017-05-01. Retrieved 2017-04-30.
  6. "GSat 9 (South Asian Satellite)". space.skyrocket.de. Retrieved 2017-04-30.
  7. "ISRO's Cryogenic Stage Fails in Maiden Flight". Space News. Archived from the original on 2012-05-26. Retrieved November 27, 2013.
  8. "GSLV, PSLV flights put off". The Hindu. Chennai, India. 1 January 2010. Archived from the original on 5 జనవరి 2010. Retrieved 6 మే 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-9&oldid=3979955" నుండి వెలికితీశారు