జీశాట్-18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీశాట్-18
మిషన్ రకం సమాచార వ్యవస్థ కు చెందిన ఉపగ్రహం
నిర్వహించే సంస్థ ఇండియన్ నేషనల్ సెటిలైట్ సిస్టం
వెబ్ సైటు http://isro.gov.in/gsat-18
మిషన్ కాలము సేవలు అందించుజీవితకాలం:15 సంవత్సరాలు
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్ I-3K[1]
తయారీదారుడు ISRO Satellite Centre
Space Applications Centre
ప్రారంభ ద్రవ్యరాశి 3,425 kilograms (7,551 lb)[1]
శక్తి 6,000 W[1]
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ 6 October 2016 (2016-10-06)[2]
రాకెట్ ఏరియాన్ 5 ఈసిఎ (Ariane 5 ECA), VA231[1]
ప్రారంభించిన స్థలం గయనాఅంతరిక్షకేంద్రం ELA-3[1]
Contractor ఏరియన్ స్పేస్[1]
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థ భూకేంద్రిత
Regime భూస్థిర కక్ష్య
Longitude 74° E
Transponders
Band 24 × C band
12 × extended C band
12 × Ku band
2 × Ku beacon

జీశాట్-18 అనునది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసి, నిర్మించిన కృత్రిమ ఉపగ్రహం. సముద్ర జలాల వాతావరణ పరిశీలన, పరిశోధన మరియు ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాల్లో జరిగిగే మార్పులను గమనించే ఉద్దేశంతో ఓసెన్శాట్ ఉపగ్రహాల ప్రయోగం జరిగింది. ఆ వరుసలో ప్రయోగించిన ఉపగ్రహం ఇది. దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది. జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్‌పాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది. జూన్‌ 8న ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా మరో రెండు దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఫ్రాన్స్‌కు చేరడం ఆలస్యం కావడంతో ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇస్రోకు చెందిన 14 ఉపగ్రహాలు సమాచార సేవలు అందిస్తున్నాయి[3] జీశాట్-18 ఉపగ్రహంతో కలిపి ఇప్పటివరకు ఇస్రో సంస్థ తయారుచేసిన 20 ఉపగ్రహాలను యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ సంస్థ ప్ర‌యోగించింది. ఏరియ‌న్‌-5 రాకెట్‌కు అతిభారీ ఉప‌గ్ర‌హాల‌ను మోసుకెళ్ల‌గల సామర్ధ్యం ఉంది. అందువలన ఎక్కువ బరువుగల్గిన ఉపగ్రహాలను కక్ష్యలో పెట్టుటకు ఇస్రో యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ మీద ఆధార‌ప‌డుతుంది. అయితే అతిభారీ శాటిలైట్ల‌ను మోసుకెళ్లేందుకు ఇస్రో కూడా జీఎస్ఎల్వీ ఎంకే -3ని అభివృద్ధి చేస్తోంది. జీశాట్-18 ఉపగ్రహపు మొత్తం బ‌రువు 3404 కిలోలు. దాంట్లో 48 క‌మ్యూనికేష‌న్ ట్రాన్స్‌పాండ‌ర్లు ఉన్నాయి. నార్మ‌ల్ సీ బ్యాండ్‌, అప్ప‌ర్ ఎక్స్‌టెండెడ్ సీ బ్యాండ్‌, కెయు బ్యాండ్ సేవ‌ల‌ను ఈ ఉపగ్రహం అందించ‌నుంది[4]

ఉపగ్రహ వివరాలు[మార్చు]

ఈ ఉపగ్రహంలో 24 సి-బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు, 12 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు, 2 కేయూ రీకాండ్‌ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ళ పాటు సేవలందించనుంది. జీశాట్‌తో ట్రాన్స్‌పాండర్ల కొరత కొంత వరకూ తీరనుంది. ఇది పూర్తిగా సమాచార ఉపగ్రహం. 6474 వాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పాదన చేయు సౌరపలకలను కలిగి ఉంది. ఉపగ్రహంలో 144 ఏఎచ్ (ఏంపియర్ అవర్) లిథియం-అయాన్ బ్యాటరీలు 2 ఉన్నాయి[3][5].

వ్యయం[మార్చు]

ఈ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూ.800 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఉపగ్రహ వ్యయం రూ.300 కోట్లు కాగా, ప్రయోగానికి సంబంధించి రూ.500 కోట్లు చెల్లించింది.

ప్రయోగ వివరాలు[మార్చు]

జీశాట్-18 ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలో ఫ్రెంచి ఆధీనంలో ఉన్న గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్-5 వీఏ-231 ఉపగ్రహ వాహక నౌక ద్వారా, భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున సుమారు 2.00 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. నిజానికి ఈ ప్రయోగం మంగళవారం రాత్రి జరుగవలసి ఉండగా వాతావరణం అనుకూలించని కారణం చేత వాయిదా వేసారు. ఏరియాన్-5 వీఏ-231 ఉపగ్రహ వాహక నౌక, భారతీయ జీశాట్-18 ఉపగ్రహంతో పాటు అస్ట్రేలియా సంస్థ నేషనల్ బ్రాడ్‌బాండు నెట్ వర్కు (NBN) కు చెందిన స్కై మస్టరు-2 అనే ఉపగ్రహాన్ని కూడా మోసుకెళ్ళింది. ప్రయోగ కేంద్రం నుండి బయలు దేరిన 32 నిమిషాల తరువాత, మొదట అస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తరువాత కాసేపటికే అత్యంత శక్తివంతమైన జీశాట్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది[3]. జీశాట్-18 ని మొదట దీర్ఘవృత్తాకార భూఅనువర్తిత బదిలీ (GTO) లో ప్రవేశ పెటారు. ఉపగ్రహం 251.7 కిలోమీటర్ల భూసమీపదూరం (పెరిజీ) తో, 35,888 కిలోమీటర్ల భూసుదీర్ఘదూరం (అపోజీ) లో కక్ష్యలో ప్రవేశపెట్తబడింది. తరువాత రానున్నవారం రోజుల్లో, ఉపగ్రహంలోని స్వంతచోదక ఇంజన్లను మండించి, ఉపగ్రహన్ని భూమధ్య రేఖకు ఎగువన 36 వేల కిలోమీటర్ల అపోజీలో 74 డిగ్రీల తూర్పు రేఖాంశంపైన దీన్ని ఉంచుతారు[5]. ఉగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టీన వెంటనే కర్ణాటకలోని హాసనులో ఉన్నఇస్రో మాస్టరు కంట్రోలు ఫెసిలిటి (MCF) ఈ ఉపగ్రహన్ని తన నియంత్రణకు తీసుకుని ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు తెలిపినది.ఇప్పటికే దేశీయటెలికమ్యూనికేసను రంగంలో ఇండియాకుచెందిన 18 సమాచార ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి.[6]

కక్ష్య పెంపు స్థిరీకరణ[మార్చు]

ఉపగ్రహంలో ఉన్న 2004 కిలోల ఇంధనంలో కొంతమొత్తాన్ని శుక్రవారం తెల్లవారుజామున 6040 సెకన్లు మండించి కక్ష్యదూరాన్ని పెంచారు. మొదటి దఫాగా 241.7 కి.మీ.ఉన్న పెరిజీని 14,843 కి.మీకు పెంచి, 35,888 కి.మీ. అపోజీని 35,802 కి.మీ.కు తగ్గించారు. తిరిగి శని, ఆదివారాల్లో కూడా ఇంధనాన్ని తగిన విధంగా మండించి, 35,802 కి.మీ. అపోజీ, 35,209 కి.మీ. పెరిజీతో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో స్థిరపరచారు. ఆదివారం ఉదయానికి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. అక్టోబరు 13 నుండి జీశాట్-18 సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది[7]

జీశాట్-18 ద్వారాలభించు సమాచార సేవలు[మార్చు]

జీశాట్-18 ఉపగ్రహం దిగువపేర్కొన్న సమాచారసేవలు అందిస్తుంది.

  • జీశాట్‌లో సాధారణ సిబ్యాండు, ఎగువ విస్తృత సి-బ్యాండు, కెయూ బ్యాండులలో పనిచేసే 48 కమ్యూనికేషన్ ట్రాన్సుపాండర్లు ఉన్నాయి. ఇది 15 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది.

అధారాలు/మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-18&oldid=2322089" నుండి వెలికితీశారు