జీశాట్-15 ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జీశాట్-15
జీశాట్-15 ఉపగ్రహం
మిషన్ రకంసమాచార ఉపగ్రహం
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2015-065A Edit this at Wikidata
SATCAT no.41028Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 సంవత్సరాలు
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి3,100 kilograms (6,800 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ10 November 2015 (planned)[1]
రాకెట్ఆరియన్ 5/ఆరియన్5ECA
లాంచ్ సైట్గయనా అంతరిక్ష కేంద్రం/కౌరౌ ELA-3
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూ కేంద్రీయ
రెజిమ్భూస్థిర కక్ష్య
రేఖాంశం93.5° East
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్24 Ku-band
బ్యాండ్ వెడల్పు36 megahertz
 

జీశాట్-15 ఉపగ్రహం భారతదేశపు భారతీయ అంతరిక్ష ప్రయోగసంస్థ ఇస్రోరూపకల్పన చేసి తయారు చేసిన ఉపగ్రహం.ఇది ఇస్రో తయారుచేసిన అతి శక్తివంతమైన సమాచార ఉపగ్రహం.జీశాట్-15 ఉపగ్రహం ఇన్శాట్/జీశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహంమొత్తం బరువు (ప్రయోగ సమయంలో) 3164 కిలోలు.జీశాట్-15 ఉపగ్రహం Kuబ్యాండులో పనిచేయు 24 ట్రాన్స్‌పాండరులను కలిగిఉన్నది.జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాల తరువాత గగన్ ఉపకరణాలను (GAGAN payload) కలిగిఉన్న మూడవ ఉపగ్రహం.GAGAN అనగా GPS తో పనిచేయు జియో అగుమెంటెడ్ నావిగేసన్ (GEO Augmented Navigation).గగన్ ఉపకరణాలు L1 మరియుL5 బ్యాండులలో పనిచేయును.[2]

ఉపగ్రహ ఉపకరణాలు(Payload)[మార్చు]

జీశాట్-15 ఉపగ్రహం Kuబ్యాండులో పనిచేయు 24 ట్రాన్స్‌పాండరులను కలిగిఉన్నది.జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాల తరువాత గగన్ ఉపకరణాలను (GAGAN payload) కలిగిఉన్న మూడవ ఉపగ్రహం[3] సమాచార ప్రసారానికి సంబంధించి ఇది పదవ ఉపగ్రహం.వీటితో పాటు అదనంగా 2 Ku-బ్యాండ్ బీకాన్లు ఉన్నాయి.[4]

ఉపగ్రహ నిర్మాణ వ్యయం[మార్చు]

ప్రయోగానికి ముందుగా ఈ ఉపగ్రహాన్ని 860 కోట్ల రూపాయలకు బీమా చేసారు.[5]

ఉపగ్రహ ప్రయోగ వివరాలు[మార్చు]

దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని కౌర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుండి నవంబరు 11,2015 న బుధవారం, ఉదయం 3:04 (భారత కాలమానం) గంటలకు ప్రయోగ కేంద్రంనుండి బయలుదేరి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. యూరోపియన్ ఏరియన్ సంస్థకు చెందిన ఏరియన్ 5 VA-227 అను ఉపగ్రహ వాహకనౌక ద్వరా అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. 11గంటల 33 నిమిషాల కౌంట్‌డౌన్ తరువాత ఉపగ్రహ ప్రయోగం జరిగింది. ఉపగ్రహ వాహన ప్రయోగంజరిగిన 43 నిమిషాల 24 సెకన్ల తరువాత జీశాట్-15 ఉపగ్రహం దీర్ఘవృత్తాకార భూఅనువర్తిత బదిలో కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.జీశాట్-15 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్తినపుడు జీశాట్-15 ప్రదక్షణ పెరిజీ (భూమికి దగ్గరి దూరం) 250 కి.మీ. అపోజీ (భూమినుండి ఎక్కువ దూరం)35,819 కి.మీ.జీశాట్-15 ఉపగ్రహన్ని కక్ష్యలో భూమధ్యరేఖకు 3.9 డిగ్రీల ఎటవాలులో కక్ష్యలో పరిభ్రమించేలా ప్రవేశపెట్టారు.[6]

జీశాట్-15 ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వెంటనే కర్నాటకరాష్ట్రంలోని హాసన్ లోని ఇస్రోకుచెందిన మాస్టర్ కంట్రొల్ ఫెసిలిటి సంస్థ ఉపగ్రహన్ని తన ఆధీనంలోకి తీసుకున్నది. ఉపగ్రహం చక్కగా ఉన్నదని తెలిపినది.

బయటి విడియోలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "GSAT-16 launch to ease ISRO's capacity crunch a bit". Retrieved 26 December 2014.
  2. "GSAT-15". isro.gov.in. Archived from the original on 2016-09-04. Retrieved 2015-11-09.
  3. "Future Programme". Indian Space Research Organisation. Archived from the original on 2010-11-25. Retrieved October 11, 2013.
  4. "GSAT-15". Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 January 2014.
  5. "Cabinet approves GSAT-15, GSAT-16 communication satellites". ANI News. ANI. June 28, 2013. Archived from the original on 2014-12-09. Retrieved October 11, 2013.
  6. "India's communications satellite GSAT-15 launched successfully". timesofindia.indiatimes.com/. Archived from the original on 2015-11-11. Retrieved 2015-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)