Jump to content

జీశాట్-17

వికీపీడియా నుండి
జీశాట్-17
మిషన్ రకంసమాచార ప్రసార ఉపగ్రహం
ఆపరేటర్ఇండియన్ నేషనల్ శాటీలైట్ సిస్టం ( భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ)
COSPAR ID2017-040B Edit this at Wikidata
SATCAT no.42815Edit this on Wikidata
వెబ్ సైట్http://www.isro.gov.in/gsat-17-0
మిషన్ వ్యవధి15 సంవత్సరాల జీవితకాలం
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి3,425 కిలోగ్రాములు (7,551 పౌ.)[1]
శక్తి6,000 W
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీభారత కాలమాన ప్రకారం గురువారం,29తేది జూన్ నెల,2:45 గంటలు[2]
రాకెట్ఏరియన్ 5 ECA [2]
లాంచ్ సైట్గయానా అంతరిక్ష కేంద్రం, ELA-3[1]
కాంట్రాక్టర్ఏరియన్ స్పేస్[1]
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్భూ స్థిర కక్ష్య
రేఖాంశం93.5° E
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్24 × C band
2 × lower C band
12 × upper C band
2 × C-up/S-down
2 × S-up/C-down
1 × DRT & SAR
 

జీశాట్-17, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కృత్రిమ ఉపగ్రహం. ఇది సమాచార సేకరణ, ప్రసారణ ఉపగ్రహం. ఇందుకు ముందు సమాచార వ్యవస్థకు సంబంధించి జీశాట్-1 ఉపగ్రహం, జీశాట్-2, జీశాట్-3, జీశాట్-6, జీశాట్-16 వంటి పలు ఉపగ్రహాలను ప్రయోగించారు. 3,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని 2017 జూన్ 29 న ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భూస్థిర కక్ష్యలో పనిచేసే జీశాట్-17 జీవిత కాలం 15 సంవత్సరాలు. ఈ జీశాట్-17 ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసిన జీఎస్‌ఎల్‌వి మార్క్ III రాకెట్ ద్వారా ప్రయోగించే సామర్ద్యం ఉన్నప్పటికి, మార్క్ III రాకెట్ ప్రయోగానికి ముందే ఏరియన్ రాకెట్ యజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం వలన, జీశాట్-17 ఉపగ్రహన్ని గయానా నుండి ప్రయోగించారు. 2017 జూన్ 5 న ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మార్క్3 డీ1 అను ఉపగ్రహవాహక నౌక ద్వారా 3,136 కిలోలు బరువున్నజీశాట్-19 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.

ఉపగ్రహంలోని ఉపకరణాలు

[మార్చు]

ఉపగ్రహంలో మొత్తం 42 ట్రాన్సుపాండరులను అమర్చారు. IEEEసీ-బాండ్ (C-band) ట్రాన్స్‌పాండరులు 24, లోవరు C band ట్రాన్స్‌పాండరులు రెండు, అప్పర్ సి బ్యాండ్ ట్రాన్స్‌పాండరులు 12, రెండు సి అప్ ఎస్ డౌన్ ట్రాన్స్‌పాండరులు, రెండు S-up/C-down ట్రాన్స్‌పాండరులు, ఒక DRT & SAR ఉపకరణమూ ఉన్నాయి.[3].ఉపగ్రహం 15 సంవసత్సరాలు తన సేవలను అందిస్తుంది. భారత దేశ అవసరాలకు 550 ట్రాన్సుపాండరులు అవసరం కాగా ప్రస్తుతం 250 అందుబాటులో ఉన్నాయి. ఉపగ్రహ నిర్మాణానికి, ప్రయోగానికీ మొత్తం 1013 కోట్లు ఖర్చు అయ్యింది.[4] విద్యుత్తు సామర్థ్యం 6000 వాట్లు.

ఉపగ్రహ ప్రయోగ వివరాలు

[మార్చు]

భారత కాలమానం ప్రకారం గురువారం 2017 జూన్ 29 వేకువజామున 2:45 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి జీశాట్-17 ఉపగ్రహాన్ని ఏరియన్ అను రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించా రు. 2:29 గంటలకు ప్రయోగం నిర్వహించ వలసి ఉండగా 16 నిమిషాలు అలస్యంగా 2:45 గంటలకు ప్రయోగించి జీశాట్-17 ఉపగ్రహాన్ని విజయవంతంగా భూస్థిర బదిలీ కక్ష్యలో (35,975 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూరంగా), 181 కిలో మీటర్ల పెరిజీ (భూమికి దగ్గరగా)) ప్రవేశ పెట్టారు.[3] ప్రయోగం మొత్తం 39 నిమిషాల్లో పూర్తి అయ్యింది. ఉపగ్రహాన్ని ప్రయోగించిన అరగంటకు కర్నాటకలోని హాసన్ లోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం జీశాట్-17 ఉపహ్రహాన్ని స్వాధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఉపగ్రహంలో ఉన్న 1,1997 కిలోల ఇంధనాన్ని మండించి, జీశాట్-17ను 36 కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టెచర్యలను ఇస్రో సంస్థ చేపట్టును.

జీశాట్-17 కక్ష్య ఎత్తు పెంపు

[మార్చు]

2017 జూన్ 30 న కర్నాటకలో ఉన్న హాసన్ లోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి ఉపగ్రహానికి సందేశాలు పంపి 5,912 సెకన్ల పాటు ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి ఉపగ్రహం యొక్క అపోజీని 35,975 కిలో మీటర్ల నుండి 35,803 కిలో మీటర్లకు తగ్గించారు. అలాగే 175 కిలో మీటర్లు ఉన్న పెరీజిని 13,291 కిలో మిటర్లకు పెంచారు. జూలై 1 న మరోసారి మోటారును పనిచేయించి, ఉపగ్రహాన్ని 35812 కి.మీ. X 30314 కి.మీ. కక్ష్యలోకి తరలించారు.

కౌరు అంతరిక్ష కేంద్రంతో ఇస్రో అనుబంధం

[మార్చు]

ఇస్రో భారతదేశ అవసరాల నిమిత్తం ఫ్రెంచి గయానా లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఇప్పటివరకు 21 ఉపగ్రహాలను ప్రయోగించింది. 1981లో మొదటగా యాపిల్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎక్కువ బరువును మోసుకుపోగలిగే రాకెట్‌ల రూపకల్పన ప్రయోగ దశలో ఉన్నందున, బరువైన ఉపగ్రహాలను ఇక్కడి నుండి ప్రయోగించేవారు. 2017 జూన్ 5 సోమవారం నాడు జీఎస్‌ఎల్‌వి-మార్క్3డీ1 అనే రాకెట్ ద్వారా 3136 కిలోల బరువున్న జీశాట్-19ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో బరువైన ఉపగ్రహాలను తమ స్వంత రాకెట్ల ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టే సత్తాను ఇస్రో సాధించింది.

బయటి విడియోల లింకులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Annual Report 2015-2016" (PDF). Indian Space Research Organisation. December 2015. p. 28. Archived from the original (PDF) on 2016-07-05. Retrieved 2017-06-28.
  2. 2.0 2.1 "Launch Schedule". Spaceflight Now. 22 June 2017. Archived from the original on 24 June 2017.
  3. 3.0 3.1 "జీసాట్-17 ప్రయోగం సక్సెస్". sakshi.com. 2017-06-30. Archived from the original on 2017-06-30. Retrieved 2017-06-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Communication satellite GSAT-17 launched from French Guiana". thehindu.com. Archived from the original on 2017-06-30. Retrieved 2017-06-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-17&oldid=3832127" నుండి వెలికితీశారు