జీశాట్-2 ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GSAT-2
మిషన్ రకంCommunications satellite
ఆపరేటర్[[Indian Space Research Organisation|ఇస్రో]]
COSPAR ID2003-018A Edit this at Wikidata
SATCAT no.27807
మిషన్ వ్యవధి3-5 years
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి1,825 kilograms (4,023 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ8 May 2003, 11:28 (2003-05-08UTC11:28Z) UTC[1]
రాకెట్GSLV Mk.I D2
లాంచ్ సైట్శ్రీహరికోట FLP
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్భూస్థిర కక్ష్య
రేఖాంశం47.95° east
Perigee altitude35,904 kilometres (22,310 mi)
Apogee altitude35,920 kilometres (22,320 mi)
వాలు2.43 degrees
వ్యవధి24.03 hours
ఎపోచ్29 October 2013, 19:06:36 UTC[2]
 

జీశాట్-2 ఉపగ్రహం భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసి ప్రయోగించింది.ఇస్రో వారు జీఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలశ్రేణిలో అభివృద్ధిపరచిన వాహకనౌక GSLV-D2 ను మొదటిగా ప్రయోగించి జీశాట్-2 ఉపగ్రహం ఉపగ్రహాన్ని అంతరిక్షంలో కక్ష్యలో ప్రవేశపెట్టారు.జీశాట్-2 ఉపగ్రహం ప్రయోగాత్మక సమాచార ఉపగ్రహం.GSLV-D2 ఉపగ్రహ వాహక నౌక 2.0టన్నుల (2000కిలోల) పేలోడు కలిగిన ఉపగ్రహాలను అంరతిక్షంలోకి మోసికొని పోగలదు.

ఉపగ్రహ ప్రయోగ వివరాలు[మార్చు]

1800 కిలోల పేలోడ్ కలిగిన జీశాట్-2 ఉపగ్రహన్ని గురువారం, మేనెల 8వతేదిన,2003 సంవత్సరాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతిష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుండి జీఎస్‌ఎల్‌వి -డీ2 అను ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షానికి పంపారు. ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహం యొక్క పెరిజీ35,904కిలోమీటర్లు, అపోజీ 35,920కిలోమీటర్లు. ఉపగ్రహం వాలు 2.43°. ఒక ప్రదక్షణకు పట్టు సమయం 24.03 గంటలు. ఉపగ్రహం నియమితకాలము 2013 అక్టోబరు 29.

GSLV-D2 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్-2 ఉపగ్రహన్ని, జియో-సమస్థితి బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ద్రవఅపోజి మోటారును వివిధదశలలో మండించి, అంతిమ నిర్దేశితకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఇది భౌమ స్థిరకక్ష్య చేరుకున్న తర్వాత, దాని యాంటెన్నా, సౌరఫలకాలను తెరచి, ఉపగ్రహ చివరకు 48° తూర్పు రేఖాంశం యొక్క స్లాట్‌లో దానికి కేటాయించిన కక్ష్యలో ఉంచారు.

ఉపగ్రహం వివరాలు[మార్చు]

ఉపగ్రహం యొక్క బరువు 1800కిలోలు. ఉపగ్రహంలో నాలుగు శాస్త్రీయ ప్రయోగాత్మకపేలోడ్లను టోటల్‌రేడియేషన్ డోస్ మానిటర్ (TRDM, ఛార్జ్ మానిటర్ (SCM) సర్ఫేస్‌సోలార్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (SOXS), కోహేరేంట్ రేడియో బెకన్ ప్రయోగపరికరం (CRABEX) అమర్చారు.ఉపగ్రహ నాలుగు సి-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, రెండుకూ (Ku) బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను, లింక్ కోసం ఎస్-బ్యాండ్, సి బ్యాండ్ లో పని చేయుసంచార ఉపగ్రహ సర్వీస్ (MSS) పేలోడ్ కలిగి ఉంది.

టోటల్ రేడియేషన్ డోస్ మానిటర్ (TRDM) (RADFET) ఒక రేడియేషన్ సెన్సిటివ్ ఫీల్డ్ ప్రభావం ట్రాన్సిస్టర్ ఉపయోగించి నేరుగా ఉపగ్రహ లోపల రేడియేషన్ పరిమాణాలు లెక్కించగలుగుతుంది., టోటల్రేడియేషన్ డోస్ మానిటర్ (TRDM) (RADFET) తోఉపగ్రహ లోపల అంచనా రేడియేషన్ పరిమాణాలు సరిపోల్చుతుంది. ఉపరితల ఛార్జ్ మానిటర్ (SCM) అంతరిక్ష సమీపంలోని పర్యావరణం యొక్క స్థితి సూచిస్తుంది.• సోలార్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (SOXS) 4 keV లో సౌరమంట ఉద్గారఅధ్యయనం - చెయ్యుటకు సోలార్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (SOXS)4 keVను అమర్చారు. 60 keV [3] శక్తి స్థాయిలో సెమీకండక్టర్ పరికరాలు, Phoswich సింటిలేషన్ డిటెక్టర్ ఉపయోగించారు. అంతరిక్షనిర్మాణం, భూమధ్యరేఖ ఎలెక్ట్రో వైవిధ్యాలు, నమిక్, తత్కాల ఐనోస్ఫేరే వంటిని తెలుసుకొనుటకు రేడియో బెకన్ ప్రయోగాలు (CRABEX) చెయ్యు అమరిక ఉంది.

ఉపగ్రహాన్నిప్రారంభ భూస్థిరకక్ష్య నుడి అంతిమ భూస్థిరకక్ష్యలో చేర్చుటకు ఒక 440 న్యూటన్ ద్రవఇంధన అపోజి (LAM) మోటరును, పదహారు 22 న్యూటన్ రియాక్షను కంట్రోల్ త్రస్టరులను అమర్చారు.GSAT-2ఉపగ్రహంలో840కిలోలఇంధనాన్నినింపారు (మొనోమిథైల్ హైడ్రాజీన్, MON-3)

దీని సౌరపలకల అమరిక 1380 W శక్తి ఉత్పత్తి చేస్తుంది, రెండు24 A•h Ni-Cd బ్యాటరిలను కలిగి ఉంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 30 October 2013.
  2. "GSAT 2 Satellite details 2003-018A NORAD 27807". N2YO. 29 October 2013. Retrieved 30 October 2013.