జీఎస్‌ఎల్‌వీ -డీ6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నమూనా
క్రయోజనిక్ ఇంజన్

జీఎస్‌ఎల్‌వీ డీ6 అను ఉపగ్రహవాహక నౌక/రాకెట్నునెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని షార్ వేదికగా ఇస్రో సంస్థ 2015, అగస్టు27 (గురువారం) సాయంత్రం 4గంటల52నిమిషాలకు ప్రయోగించి, ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా జీశాట్-6 ఉపగ్రహన్ని దిగ్విజంయంగా నిర్ణిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు[1] . ఈరాకెట్లో ఉపయోగించిన కయోజనిక్ ఇంజన్ స్వదేశీయంగా అభివృద్ధిచేసినది కావటం ఈ జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ యొక్క ప్రత్యేకత. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిపరచిన క్రయోనిక్ ఇంజను ఉపయోగించి, ప్రయోగించిన 3 జీఎస్‌ఎల్‌వీ వాహక నౌకల్లో మొదటిది విఫలమైనది.తరువాత ప్రయోగించిన రెండు జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు విజయవంతమైనవి.ఈఈ ప్రయోగం సఫలం కావటంతో అత్యంత బరువైన ఉపగ్రహలను అంతరిక్షంలో ప్రవేశపెట్టు సామర్ద్యాన్ని ఇస్రో పొందగలిగినది.జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగంలో ఇస్రోకు ఇది ఆరో విజయం. షార్ నుండి చేసిన మొత్తంరాకెట్ల ప్రయోగంలో ఇది 48 వ విజయం.

జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగ విశేషాలు[మార్చు]

జీఎస్‌ఎల్‌వీ-డీ6రాకెట్ ప్రయోగానికి బుధవారం (2015-08-26) మధ్యహ్నం 11:52 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్‌ 29 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగినది.2015-08-27తేది గురువారం సాయంత్రం 4:52గంటలకు ఎరుపు, నారింజ రంగు మంటలను ఎగజిమ్ముతూ జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ ఆకాశంలోకి దూసుకెల్లింది.రాకెట్ నిర్దేచించిన మార్గంలో దశలవారీగా విజయవంతంగా ప్రయాణించింది.రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి వాహక నౌక బయలు దేరిన 17:04నిమిషాల్లో కచ్చితంగా జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టినది[2].

జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగంలో 170.4 టన్నుల నాలుగు ద్రవఇంధన స్ట్రాపన్‌బూస్టర్లతో పాటు కోర్‌అలోన్‌దశలో 138.1టన్నుల ఘన ఇంధనం సాయంతో 151 సెకండ్ల మొదటిదశ విజయంగా పూర్తి అయ్యింది. 39.5టన్నుల ద్రవఇంధనం సాయంతో 293 సెకన్ల రెండో దశదిగ్విజయంగా పూర్తయినది. ఆ తరవాతది, అత్యంత కీలక దశ అయిన మూడోదశను 12.8 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,012 సెకండ్లలో పూర్తిఅయ్యినది. మొత్తం మీద 17:04 నిమిషాల్లోనే 170కిలో మీటర్ల పెరూజీ (భూమికి అతిదగ్గరి),35,975కిలోమీటర్ల అపోజి (భూమికి దూరంగా) భూసమాంతర కక్ష్యలో,19.95°డిగ్రీల వాలులో జీశాట్-6 ఉపగ్రహాన్నినిర్దేశిఅత కక్ష్యలో ప్రవేశపెట్టినది.కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం బాగానే ఉన్నట్లు కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ కేంద్రం ప్రకటించినది[3].

జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగ వివరాలు[3][మార్చు]

రాకెట్ సమాచారం ప్రయోగ వివరాలు
జీఎస్‌ఎల్‌వీ -డీ6రాకెట్‌ఖర్చు రు.210కోట్లు
జీశాట్-6 ఉపగ్రహం ఖర్చు రు.160కోట్లు
జీఎస్‌ఎల్‌వీ -డీ6రాకెట్‌ పొడవు 49.1మీటర్లు
రాకెట్ ప్రయోగంలో మొత్తం బరువు 416 టన్నులు
జీశాట్-6 ఉపగ్రహం మొత్తం బరువు 2,117కిలోలు
ఉపగ్రహంలో ఇంధనం బరువు 1,132 కిలోలు
కేవలం ఉపగ్రహం బరువు 985కిలోలు
కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టుటకు
పట్టిన సమయం
17.04నిమిషాలు

క్రయోజనిక్ టెక్నాలజి[మార్చు]

అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్ది ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందెటందుకు క్రయోజనిక్ యంత్రాలు మేలైనవి.కాని ఈఈ సాంకేతిక విజ్ఞానం చాలాక్లిష్టమైనది.రాకెట్ (వాహక నౌక) ఇంధనాలుగా వాడె వాయువులైన హైడ్రోజన్ మైనస్ 253°Cవద్ద, ఆక్సిజన్ మైనస్ 183°Cవద్ద ద్రవరూపంలోకి మారుతాయి[4].ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, దహన యంత్రాలలోవాడటం క్లిష్టమైన ప్రక్రియ.రాకెట్‌లోని ఇతర దహన ఇంజన్లనుండి వెలువడు ఉష్ణాన్ని/వేడిని క్రయోజనిక్ ఇంధనాల నిల్వ పాత్రను తాకకుండ జాగ్రత తీసుకోవాలి.అమెరికా 1969లోనే ఈఈ క్రయోజనిక్ సాంకేతిక విజ్ఞానాన్ని అభివ్ర్ద్ధి చేసుకొని చంద్రుడిపైకి ప్రయోగించిన అంతరిక్షనౌకలో ఉపయోగించింది.

క్రయోజనిక్ ఇంజన్ల తయారిలో ఇస్రో కృషి[మార్చు]

రెండు టన్నులకన్న అధిక బరువుగల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుటకు క్రయోజనిక్ యంత్రాలు అత్యంత కీలక పాత్రను కలిగిఉన్నవి.స్వదేశియంగా క్రయోజనిక్‌ఇంజన్‌లతయారిలో ఇస్రో యొక్కదశాబ్దాల అలుపెరగని శ్రమదాగిఉన్నది. 1990లో అమెరికా ఆంక్షల కారణంగా, రష్యా దేశం అమెరికాయొక్క ఒత్తిళ్ళకు లొంగి, భారతదేశానికి క్రయోజనిక్ ఇంజన్ల సంకేత విజ్ఞానం బదలాయింపు ఒప్పందాన్ని రద్దు చేసుకొనికేవలం ఏడు క్రయోజనిక్ యంత్రలను మాత్రమే ఇచ్చింది.అప్పటినుండి స్వదేశియంగా క్రయోజనిక్ ఇంజన్లను తయారుచేసుకొనే కార్యక్రమం మొదలైనది.1994లో ప్రారంభమైన ఈ ప్రణాళిక 2010 నాటికి తొలి క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగానికి సిద్ధమైనది.కాని ఈ ఇంజను అనుకొన్న విధంగా మండలేదు.ఈ విఫలాన్ని అధికమించి విజయపథంలోకిరావాటానికి అవిరళ కృషి సల్పినది.37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ దహన యంత్రాన్ని అభివృద్ధి పరచారు[4].2014 జనవరి 5 న జీఎస్‌ఎల్‌వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా ప్రయోగించింది.ఇప్పుడు జీఎస్‌ఎల్‌వీ -డీ6 లో అమర్చిన క్రయోజనిక్ యంత్రం సఫలమైవ్వడంతో ఈఈ విజ్ఞానంలో భారత అంతరిక్షశోధన సంస్థ పట్టు సాధించింది.

జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టిన జీశాట్-6 ఉపగ్రహ సమాచారం[మార్చు]

దస్త్రం:GSat-6 (1).JPG
జీశాట్-6 ఉపగ్రహం

జీఎస్‌ఎల్‌వీ-డీ6ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టబడిన జీశాట్-6 ఉపగ్రహం 2117 కేజీల బరువైనది.ఇందులో భాగంగా 10 ఎస్ బ్యాండ్ ట్రాన్స్ పాండర్స్ ఏర్పాటు చేశారు[5] జీశాట్-6 సమాచార ఉపగ్రహం డిజిటల్ మల్టీమీడియా, మొబైల్‌సమాచార రంగంలో అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుంది. దీనిద్వారా రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు మరింత భద్రమైన సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రానున్నవి. శాటిలైట్‌ పోన్ల ద్వారా ఈ వర్గాలవారు దేశంలోని ఏ ప్రాంతంనుంచైనా ఇతరప్రాంతాలవారితో మాట్లాడేటందుకు వీలుంటుంది. జీశాట్-6 ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్‌ ద్వారా 5 స్పాట్‌బీమ్స్, సీ బ్యాండ్‌లో ఒక జాతీయ స్థాయి బీమ్‌ అందుబాటులోకి వస్తుంది. రేడియా ఫ్రీక్వేన్సీని అత్యంత సమర్థంగా పయోగించుకొనుటకు వీలున్నది.గతంలో ఏ ఉపయ్రహానికి లేనటువంటీ అతిపెద్ద యాంటెన్నాను ఈఉపగ్రహం కలిగిఉన్నది. 6 మీటర్లవ్యాసార్ధమున్న ఈ యాంటెన్నావల్ల ఉపగ్రహం నుండి సమాచారాన్ని ఎక్కువ తెలుసుకొను అవకాశం ఉంది.ఈ ఉపగ్రహం 9సంవత్సరాలపాటు సేవ లంధిస్తుందని ఇస్రో తెలిపినది[3]. భారత సమాచార ఉపగ్రహాలలో 25వది అయిన జీశాట్‌-6 దేశంలో నిర్మించిన సమాచార ఉపగ్రహాలలో 12వది. జీశాట్‌ ఉపగ్రహంలో సమాచార సేవలను అందించే 10 ఎస్‌ బ్యాండ్‌, సీ బ్యాండ్‌ ట్రాన్స్‌ పాండర్లు పొందుపరిచారు (అయిదు 9 MHzతరంగ దైర్గ్యం గల C x Sట్రాన్సుఫాండరులు,2.7 MHzతరంగ దైర్గ్యం గల SxC ట్రాన్సుఫాండరులు) [6]. దీని ద్వారా ట్రాన్స్ పాండర్ల కొరత తీరనుంది. ఇస్రో అభివృద్ధి పరిచిన అత్యంత పెద్దదైన 6 డయామీటర్ల యాంటెనా ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఇది కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకున్న తర్వాత విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఈ యాంటీనా ద్వారా ఎస్‌ బాండ్‌ ట్రాన్స్‌ పాండర్లు దేశాన్ని పూర్తిగా కవర్ చేసి మల్టీమీడియా, శాటిలైట్‌ ఫోన్‌లకు తమ సేవలను అందించనున్నాయి. 83 డిగ్రీల తూర్పు అక్షాంశంపై చేరిన తర్వాత ఈ ఉపగ్రహం యాంటెనా పూర్తిగా విచ్చుకుంటుంది. తరువాత తన సేవలను అందించడం ప్రారంభిస్తుంది[7].

మూలాలు[మార్చు]

  1. "Launch of Isro's Geostationary Satellite Launch Vehicle". timesofindia.indiatimes.com. Retrieved 2015-08-28.
  2. "జీఎస్ఎల్వీడీ-6 విజయవంతం". expresstv.in. Retrieved 2015-08-28.
  3. 3.0 3.1 3.2 "ఇస్రో సుపర్ సిక్స్". shakshi. Retrieved 2015-08-28.
  4. 4.0 4.1 "Indigenous Cryogenic Engine and Stage". isro.gov.in. Retrieved 2015-08-28.
  5. "నింగికెగిరిన జీఎస్‌ఎల్‌వీ-డి6". andhrajyothy.com. Retrieved 2015-08-28.
  6. "GSAT-6". sac.gov.in. Retrieved 2015-08-28.
  7. "జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం". tnews.media. Retrieved 2015-08-28.

బయటి విడియోమరియు పోటో లింకులు[మార్చు]