Jump to content

రీశాట్-1 ఉపగ్రహం

వికీపీడియా నుండి
రీశాట్-1 ఉపగ్రహం
రీశాట్-1 ఉపగ్రహం
మిషన్ రకంRadar imaging satellite
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2012-017A Edit this at Wikidata
SATCAT no.38248
మిషన్ వ్యవధి5సంవత్సారాలు (planned)
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి1,858 కిలోగ్రాములు (4,096 పౌ.)[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ26 April 2012, 00:17 (2012-04-26UTC00:17Z) UTC
రాకెట్PSLV-XL C19
లాంచ్ సైట్సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంశ్రీహరికోట,నెల్లూరు జిల్లా
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రిత కక్ష్య
రెజిమ్Sun-synchronous
వాలు97 degrees
మీన్ మోషన్14
 

రీశాట్-1 (RISAT-1) లేదా రాడార్ శాటిలైట్ -1 అను ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తయారు చేసిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) లోని బంగాళాఖాతం నకు సమీపంలోని పులికాట్ సరస్సు పరిసర ప్రాంతంలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి 2012 ఏప్రిల్ 26 సంవత్సరంలో పిఎస్ఎల్ వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములోకి పంపారు[2].

రీశాట్-1 ఉపగ్రహం

[మార్చు]

రీశాట్-1 లేదా రాడార్ శాటిలైట్ -1 ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తయారు చేసింది.అంతరిక్ష కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినది కూడా ఇస్రో సంస్థనే.రీశాట్-1 ఉపగ్రహం బరువు 1858 కిలోలు.ఈ ఉపగ్రహంలో C-band (5.35 GHz) లో పనిచేయు సింథేటిక్ అపెర్చర్ రాడార్ (SAR) అమర్చారు.[3] ఈSAR పరికరం పగలు, రాత్రి సమయాలలో, అన్నిరకాల వాతావరణ పరిస్థితు లలో కూడా ఉపరితల పరిస్థితులను చిత్రీకరించు సామార్ధ్యాన్ని కల్గిఉన్నది.[4] ఉపగ్రహానికి అవసరమైన శక్తిని అందించుటకు సౌరఫలకాలను అమర్చారు.దీని వలన 2200 W విద్యుత్ శక్తి జనిస్తుంది.ఈ శక్తి వ్యవస్థకు అదనంగా, జనిత విద్యుతును నిల్వ ఉంచుటకు ఒక 70 AH Ni-H2 బ్యాటరిని అనుసంధానం చేసారు.[5] [2]

రీశాట్-1 లేదా రాడార్ శాటిలైట్ -1 ఉపగ్రహాన్నిఅంతరిక్షములో భూమినుండి 536 కి.మీ దూరంలో వర్తులాకాకార సుర్యానువర్తన ధ్రువక్షక్యలో పరిభ్రమించేలా ప్రయోగించారు.ఉపగ్రహ కక్ష్య ఏటవాలు తలం 97.552o.ఉపగ్రహం ఒకసారి భూమిని చుట్టి వచ్చుటకు పట్టు కాలం 95.49 నిమిషాలు.ఒకరోజులో ఉపగ్రహం కావించు ప్రదక్షిణల సంఖ్య 14.భూమధ్య రేఖను ఉపగ్రహం దాటు నప్పటి స్థానిక సమయం (భారతదేశ కాలం) 6:00 am / 6:00 pm.ఈ ఉపగ్రహం యొక్క జీవితకాలం 5 సంవత్సరాలు[5][2].

ఉపగ్రహ ప్రయోగం

[మార్చు]

రీశాట్-1 ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా) లోని బంగాళాఖాతం నకు సమీపంలోని పులికాట్ సరస్సు పరిసర ప్రాంతంలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి 2012 ఏప్రిల్ 26 సంవత్సరంలో పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములోకి పంపారు.పిఎస్ఎల్‌వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక ఇస్రో వారి 21వ ఉపగ్రహ వాహకనౌక. ఈ వాహకనౌక పిఎస్ఎల్‌వి వాహకనౌక శ్రేణి లో, PSLV-XLరకానికి చెందిన మూడవ వాహక నౌక[5].[6]

ఉపగ్రహ ప్రయోగ ప్రధాన లక్ష్యం

[మార్చు]

రీశాట్-1 ఉపగ్రహం ప్రధాన లక్ష్యం భారతదేశ వ్యవసాయసంబంధిన సమాచారాన్ని సేకరించం, విష్లేషించడం.ముఖ్యంగా వరిపంట ఖరిఫ్ కాలంలో పర్యవేక్షణ, నిర్వహణ.అలాగే వరద, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం[5][2].

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. Varma, M. Dinesh (26 April 2012). "RISAT-1 satellite launch a "grand success": ISRO". Chennai, India: The Hindu.
  2. 2.0 2.1 2.2 2.3 "RISAT-1" (PDF). www.isro.gov.in. Archived from the original (PDF) on 2016-01-17. Retrieved 2015-10-22.
  3. Raj, N. Gopal (25 April 2012). "RISAT-1's radar can see through clouds and work in darkness". Chennai, India: The Hindu.
  4. "RISAT-1". nrsc.gov.in. Archived from the original on 2015-10-19. Retrieved 2015-10-22.
  5. 5.0 5.1 5.2 5.3 "RISAT-1". isro.gov.in. Archived from the original on 2016-01-30. Retrieved 2015-10-22.
  6. "PSLV-C19". isro.gov.in. Archived from the original on 2016-02-05. Retrieved 2015-10-22.