Jump to content

పి ఎస్ ఎల్ వి - సీ - 56

వికీపీడియా నుండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) 2023 జూలై 30వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( షార్ ) నుంచి ' పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ( పి ఎస్ ఎల్ వి ) సీ - 56 ' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది[1]. షార్ లోని మొదట ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్ వి సీ - 56 ' వాహక నౌక ద్వారా మొత్తం 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని న్యూ ఆర్బిట్ ( భూ సమీప కక్ష ) లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు[2]. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఉన్న ఒప్పందం మేరకు ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పి ఎస్ ఎల్ వి - సీ - 56 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఏడు ఉపగ్రహాల్లో సింగపూర్ కు చెందిన డి ఎస్ - ఎస్ ఏ ఆర్ ప్రధానమైన ఉపగ్రహం[3]. ఇది సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపుతుంది. తాజా రాకెట్ ప్రయోగంతో ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 431 కి చేరింది. షార్ నుంచి చేసిన 90 ప్రయోగం ఇది[4]. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్ లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమనార్హం.

మూలాలు :

  1. "PSLV C-56 Rocket: ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఒకేసారి 7 ఉపగ్రహాలను నింగిలోకి." Samayam Telugu. Retrieved 2023-09-11.
  2. "ISRO: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-56". EENADU. Retrieved 2023-09-11.
  3. "30న పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం". Sakshi. 2023-07-22. Retrieved 2023-09-11.
  4. Telugu, TV9 (2023-07-30). "ISRO: PSLV C56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్." TV9 Telugu. Retrieved 2023-09-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)