పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌకను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (క్లుప్తంగాఇస్రో) రూపోంధించింది. ఇది ఇస్రో తయారుచేసిన పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన 33వ ఉపగ్రహ వాహకనౌక.పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక, పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌక. పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో ప్రయోగించిన XL రకానికి చెందిన వాహకనౌకలలో 11వ వాహకనౌక/రాకెట్.

పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా పలు ఉపగ్రహాలను అంతరిక్షంలో, కక్షలో ఇస్రో ప్రవేశపెట్టినది. ఐఎన్‌ఎస్‌ఎస్ శ్రేణికి చెందిన 1A,1B,1C,, 1Dఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు. అంతేకాదు చంద్రయాన్-1, జీశాట్-12, రీశాట్-1, మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాప్ట్ లను, డిఎమ్‌సి-3 ఉపగ్రహాలను కూడా పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు.[1]

XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా 1400-1700కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చును.సూర్యానువర్తిత ధ్రువీయ కక్ష్యలో 1700కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను,600కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టును.భూబదిలీ కక్ష్యలో అయినచో 1425 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని284X20650 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టు సామర్ద్యంXL రకానికి చెందిన రాకెట్ కలిగి ఉన్నది[2]. నౌకాయాన పర్యవేక్షణకై ఇస్రో తయారుచేసిన ఐఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహన్నిఈ పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో భూఅనువర్తిత (Geosynchronous) కక్ష్యలో ప్రవేశపెట్టుటకై ఇస్రో నిర్ణయించారు.ఈఈ ఉపగ్రహవాహక నిర్మాణానికి 170 కోట్ల రుపాయాలు ఖర్చు చేసారు.

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక-నిర్మాణ వివరాలు[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక 4అంచెలు/దశలు కలిగిన రాకెట్. ప్రయోగ సమయంలో, ఇంధనం బరువుతోసహా 320 టన్నుల బరువు కలిగి ఉంది. ఎత్తు 44.4 మీటర్లు[3].వాహకనౌక నాలుగు దశలలో మొదటి, మూడవ దశలో ఘన ఇందనాన్ని చోదకంగాను, రెండవ., నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు.

మొదటి దశ[మార్చు]

ఉపగ్రహ వాహనం మొదటి దశను కోర్ స్టేజి PS1 అంటారు. ఇందులో ఘన ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు. ఘన ఇంధనం పేరు HTBP అనగా హైడ్రాక్సీటేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్.కోర్ స్టేజి PS1లో138.2టన్నుల అనగా హైడ్రాక్సీటేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్ నింపబడి ఉండును.అంతేకాకుండగా కోర్ స్టేజి PS1కు అదనంగా ఆరు స్ట్రాపాన్ మోటరులు బిగింప బడి ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రాపాన్ మోటరులో 12.2టన్నుల ఘన హైడ్రాక్సీ టేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్ ఇంధనం నింపబడి ఉండును. మొదటి దశ కోర్ స్టేజి PS1 వ్యాసం 2.8 మీటర్లు., స్ట్రాపాన్ మోటరుల వ్యాసం ఒక మీటరు.మొదటి దశ కోర్ స్టేజి PS1 పొడవు20 మీటర్లు, స్ట్రాపాన్ మోటరు పొడవు 12 మీటర్లు.

రెండవ దశ[మార్చు]

రెండవ దశను PS2 దశ అంటారు. ఇందులో చోదకంగా ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. ద్రవ ఇంధనంగా UH25, నైటోజన్ టెట్రాక్సైడ్ ఉపయోగిస్తారు.UH25 అనగా అసౌష్టవ డై మిథైల్ హైడ్రాజీన్+25% హైడ్రాజీన్ హైడ్రేట్.ఈ దశలో 42 టన్నుల చోదక ఇంధనాన్నిదహన పరచెదరు. PS2 దశ వ్యాసం 2.8 మీటర్లు, పొడవు 12.8 మీటర్లు.

మూడవ దశ[మార్చు]

మూడవ దశను PS3 స్టేజి అంటారు. ఇందులో మొదటి దశలో వలె ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు.ఇందులో 7.6 టన్నుల చోదక ఇంధనాన్నిదహన పరచెదరు. PS3 స్టేజి వ్యాసం 2.0 మీటర్లు, పొడవు 3.6 మీటర్లు.

నాల్గవ దశ[మార్చు]

నాల్గవ దశను PS4 స్టేజి అంటారు.ఇందులో రెండవ దశలో వాడినట్లుగానే ద్రవ ఇంధనాన్ని నింపెదరు.PS4 స్టేజిలో వాడు ద్రవ ఇంధనం MMH+MON-3.MMH అనగా మొనోమిథైల్ హైడ్రాజీన్, MON-3 అనగా మిశ్రమ నైట్రోజన్ అక్సైడులు.ఇంధనం పరిమాణం 2.5 టన్నులు. స్టేజి వ్యాసం 1.3 మీటర్లు, పొడవు 3.0 మీటర్లు.

నాల్గవదశ పైభాగంలో ఉన్న పరికారల పెట్టెమీద ఉపగ్రహం ఉండి, దాని చుట్టు రక్షక కవచం అమర్చబడి ఉండును.

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక-ప్రయోగవివరాలు[మార్చు]

కౌంట్‌డౌన్[మార్చు]

2016 సంవత్సారానికి పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం మొదటి ప్రయోగం.ఇస్రో 2016 సంవత్సరం మార్చి చివరిలోపుగా మరో రెండు ఐఆర్ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలో ప్రవేశపెట్టెదరు[4] పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికై కౌంట్‌డౌన్ 18-1-2016, సోమవారం, ఉదయం 9.30 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలైనది[5].ఈ కౌంట్‌డౌన్ 48 గంటలు కొనసాగి,20-01.2016 ఉదయం 9.30 నిమిషాలకు ముగిసింది.

ప్రయోగం[మార్చు]

జనవరి 20,2016న సరిగా 9గంటల 31 నిమిషాలకు గగనం వైపు దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక 19 నిమిషాల 36సెకన్ల తరువాత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్%-1ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినది. పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో,11 వ XLరకానికి చెందిన అంతరిక్షనౌక/కృత్రిమ ఉపగ్రహ ప్రయోగ నౌక. ప్రయోగానంతరం ఇస్రో చైర్మెన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ ప్రయోగం విజయవంతమైనదని ప్రకటించాడు[6]. ఈ ప్రయోగానికి సోమవారం (18-01-2016) 48 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభించగా, బుధవారం (20-01-2016) ఉదయం 9:31 నిమిషాలకు శ్రీహరికోట లోని సతీష్‌ ధవన్ అంతరిక్షప్రయోగవేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక నింగివైపు దూసుకెళ్లింది. పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక మేఘాలను చీల్చుకొంటూ ఆకాశమార్గం వైపు ప్రయాణం సాగించగానే షార్ లో కరతాళధ్వనులు మిన్నంటేలా మార్మొగాయి. 44.5 మీటర్ల పొడవైన ఉపగ్రహ వాహకనౌక పెరిజీ (భూమికిదగ్గరగా)284.1కి.మీ, అపోజి (భూమికి దూరంగా)20,667 కి.మీదూరం ఉండే భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్) లో 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఐఅర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్నిప్రవేశపెట్టినది. మొత్తంమీద 19నిమిషాల 36 సెకన్లలలో ప్రయోగం పూర్తిఅయ్యింది.[7]

ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కోర్‌అలోన్‌ దశలో 138.2 టన్నులు, ఎక్స్‌ఎల్‌ ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను, 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేశారు. అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోవిూటర్లలో అపోజి (భూమికి దూరంగా) 284 పెరిజీ (భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోవిూటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోవిూటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు[8].

ప్రయోగానంతరం[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ అంతరిక్షనౌక/ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టీన వెంటనే, ఉపగ్రహానికి ఇరువైపులా ఉన్న సూర్యఫలకాలు (సోలార్ ఫ్యానల్స్) విచ్చుకుని పనిచెయ్యడంమొదలైనది. కర్ణాటకలోని హాసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి శాస్త్రవెత్తలు ఉపగ్రహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు.వారం తరువాత ఉపగ్రహంలో ఉన్న ద్రవ ఇంధనాన్ని మండించి ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యనుండి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రోనస్ ఆర్బిట్) లో ప్రవేశపెట్తెదరు.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ అంతరిక్షనౌక 12 సంవత్సరాలు తన సేవలను అందిస్తుంది[7].

ఇవికూడాచూడండి[మార్చు]

బయటిలింకులు[మార్చు]

మూలాలు-అధారాలు[మార్చు]