కర్ణాటక
కర్ణాటక | |
---|---|
![]() వొడెయార్ రాజవంశపు ముఖ్యపట్టణం. కర్ణాటకలో ప్రధాన యాత్రాస్థలం | |
![]() కర్ణాటక పటం | |
నిర్దేశాంకాలు (బెంగళూరు): 12°58′N 77°30′E / 12.97°N 77.50°ECoordinates: 12°58′N 77°30′E / 12.97°N 77.50°E | |
దేశం | ![]() |
రాజధాని , అతిపెద్ద నగరం | బెంగళూరు |
జిల్లాల పేర్లు | |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,91,791 కి.మీ2 (74,051 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 7th |
అత్యధిక ఎత్తు | 1,925 మీ (6,316 అ.) |
Lowest elevation | 0 మీ (0 అ.) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 61,130,704 |
• ర్యాంకు | 8th |
• సాంద్రత | 320/కి.మీ2 (830/చ. మై.) |
పిలువబడువిధం (ఏక) | కన్నడిగులు |
GDP (2018-19) | |
• Total | ₹14.08 లక్ష కోట్లు (US$200 billion) |
• Per capita | ₹1,46,416 (US$2,100) |
కాలమానం | UTC+05:30 (IST) |
ISO 3166 కోడ్ | IN-KA |
Official languages | కన్నడ[4] |
అక్షరాస్యత | 75.60% (2011 census)[5] |
HDI | ![]() |
HDI rank | 8th (2015)[6] |
కర్ణాటక రాష్ట్ర చిహ్నాలు | |
చిహ్నం | గండభేరుండ[7] |
పాట | జయభారత జననియ తనుజాతే[8] |
జంతువు | ఏనుగు[9] |
పక్షి | Indian Roller[9] |
పుష్పం | కలువ[9] |
వృక్షం | శ్రీగంధం[9] |
కర్ణాటక ( కన్నడలో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి , బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.
భౌగోళికము[మార్చు]
కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రము, వాయువ్యమున గోవా రాష్ట్రము, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున , ఆగ్నేయమున తమిళనాడు , నైౠతిన కేరళ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.
భౌగోళికముగా రాష్ట్రము మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది.
- సన్నని తీర ప్రాంతము, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతము లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
- పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతము ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతము.
- దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతములోనే ఉంది. ప్రాంతము పొడిగా వర్షాభావముతో సెం-అరిద్ స్థాయిలో ఉంది.
కర్ణాటక యొక్క పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చినదని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.
రాష్ట్రములో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది. [1]
భాష[మార్చు]
కర్ణాటక, భాష ఆధారితముగా యేర్పడిన రాష్ట్రము. అందుకే రాష్ట్రము యొక్క ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రములో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష అయిన కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళము, కొడవ, తులు , ఇతర భాషలు.
ఆర్ధిక రంగము[మార్చు]
కర్ణాటక భారతదేశములోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశములో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రము. భారతదేశములోని 90% బంగారము ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజము యొక్క వెలికితీత పనులు బళ్ళారి , హోస్పేట జిల్లాలలో ముమ్మరముగా సాగుతున్నాయి.
చరిత్ర[మార్చు]
కర్ణాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు , 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసము చేయుచున్న కాలములో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు అయిన హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతములో నివసించుచుండేవాడు. అశోకుని కాలమునాటి శిలాశాసనములు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.
క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామి చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలము (609 - 642) నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్ , పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానములో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు , వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథమును రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు , తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు , బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించారు , ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా , టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చింది.
భారత స్వాతంత్ర్యానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశములో విలీనము చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రముగా అవతరించడముతో, పూర్వపు మహారాజు కొత్తగా యేర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనము తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వము 1975 వరకు భత్యము ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యలెస్ లోనే నివసిస్తున్నారు.
రాజ్యోత్సవ దినము (నవంబర్ 1, 1956) న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు , బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్ణాటక అని మార్చబడింది.
పకృతి సిద్ధ ప్రదేశాలు[మార్చు]
కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలము. అందులో ముఖ్యమైనవి
- బందీపూర్ జాతీయ వనము - మైసూరు జిల్లా
- బన్నేరుఘట్ట జాతీయవనము - బెంగళూరు జిల్లా
- నాగర్హోల్ జాతీయవనము - మైసూరు, కొడగు జిల్లాలు
- కుద్రేముఖ్ జాతీయవనము - దక్షిణ కన్నడ, చిక్‌మగళూరు జిల్లాలు
- ఆన్షీ జాతీయవనము - ఉత్తర కన్నడ జిల్లా.
ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు అభయారణ్యాలు ఉన్నాయి.
- షిమోగా జిల్లాలోని జోగ్ జలపాతం ప్రపంచములోనే రెండవ ఎత్తైన జలపాతము
జిల్లాలు[మార్చు]
కర్ణాటక జిల్లాలు చూడండి
కర్ణాటక[మార్చు]
వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం
(కి.మీ.²) |
జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | BK | బాగల్‌కోట్ జిల్లా | బాగల్‌కోట్ | 18,90,826 | 6,583 | 288 |
2 | BL | బళ్ళారి | బళ్లారి | 25,32,383 | 8,439 | 300 |
3 | BG | బెల్గాం | బెల్గాం | 47,78,439 | 13,415 | 356 |
4 | BR | బెంగళూరు | బెంగళూరు | 9,87,257 | 2,239 | 441 |
5 | BN | బెంగుళూరు గ్రామీణ జిల్లా | బెంగళూరు | 95,88,910 | 2,190 | 4,378 |
6 | BD | బీదరు జిల్లా | బీదరు | 17,00,018 | 5,448 | 312 |
7 | CJ | చామరాజనగర్ | చామరాజనగర్ | 10,20,962 | 5,102 | 200 |
8 | CK | చిక్కబళ్ళాపూర్ జిల్లా | చిక్బళ్లాపూర్ | 12,54,377 | 4,208 | 298 |
9 | CK | చిక్‌మగళూరు | చిక్‌మగళూరు | 11,37,753 | 7,201 | 158 |
10 | CT | చిత్రదుర్గ | చిత్రదుర్గ | 16,60,378 | 8,437 | 197 |
11 | DK | దక్షిణ కన్నడ | మంగళూరు | 20,83,625 | 4,559 | 457 |
12 | DA | దావణగేరె | దావణగేరె | 19,46,905 | 5,926 | 329 |
13 | DH | ధార్వాడ్ | ధార్వాడ్ | 18,46,993 | 4,265 | 434 |
14 | GA | గదగ్ | గదగ్ | 10,65,235 | 4,651 | 229 |
15 | GU | గుల్బర్గా జిల్లా | గుల్బర్గా | 25,64,892 | 10,990 | 233 |
16 | HS | హసన్ | హసన్ | 17,76,221 | 6,814 | 261 |
17 | HV | హవేరి | హవేరి | 15,98,506 | 4,825 | 331 |
18 | KD | కొడగు | మడికేరి | 5,54,762 | 4,102 | 135 |
19 | KL | కోలారు జిల్లా | కోలారు | 15,40,231 | 4,012 | 384 |
20 | KP | కొప్పల్ | కొప్పల్ | 13,91,292 | 5,565 | 250 |
21 | MA | మండ్య | మండ్య | 18,08,680 | 4,961 | 365 |
22 | MY | మైసూరు జిల్లా | మైసూరు | 29,94,744 | 6,854 | 437 |
23 | RA | రాయచూరు | రాయచూరు | 19,24,773 | 6,839 | 228 |
24 | RM | రామనగర జిల్లా | రామనగరం | 10,82,739 | 3,573 | 303 |
25 | SH | షిమోగా | షిమోగా | 17,55,512 | 8,495 | 207 |
26 | TU | తుమకూరు | తుమకూరు | 26,81,449 | 10,598 | 253 |
27 | UD | ఉడుపి | ఉడుపి | 11,77,908 | 3,879 | 304 |
28 | UK | ఉత్తర కన్నడ | కార్వార్ | 13,53,299 | 10,291 | 132 |
29 | BJ | బిజాపూర్ | బిజాపూర్ | 21,75,102 | 10,517 | 207 |
30 | YG | యాద్గిరి జిల్లా | యాద్గిర్ | 11,72,985 | 5,225 | 224 |
విమానాశ్రయములు[మార్చు]
బెంగళూరు, మంగుళూరు, మైసూరు, బెల్గాం, హుబ్బళ్లి
ఆనకట్టలు[మార్చు]
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Protected Areas of India: State-wise break up of Wildlife Sanctuaries" (PDF). Wildlife Institute of India. Government of India. Archived from the original (PDF) on 24 అక్టోబర్ 2016. Retrieved 24 August 2016. Check date values in:
|archivedate=
(help) - ↑ "Figures at a glance" (PDF). 2011 Provisional census data. Ministry of Home Affairs, Government of India. Archived (PDF) from the original on 24 October 2011. Retrieved 17 September 2011.
- ↑ "Karnataka Budget 2018-19" (PDF). Karnataka Finance Dept. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 15 March 2018. Check date values in:
|archivedate=
(help) - ↑ 50th Report of the Commission for Linguistic Minorities in India (PDF). nclm.nic.in. p. 123. Archived from the original (PDF) on 8 July 2016.
- ↑ "Population and Literacy Rate of cities in Karnataka". Archived from the original on 25 June 2012. Retrieved 19 June 2012.
- ↑ "Inequality- Adjusted Human Development Index for India's States". Archived from the original on 10 May 2017.
- ↑ Shankar, Shiva (7 February 2018). "State flag may be a tricolour with Karnataka emblem on white". The Times of India. The Times Group.
- ↑ "Poem declared 'State song'". The Hindu. The Hindu Group. 11 January 2004.
- ↑ 9.0 9.1 9.2 9.3 Huq, Iteshamul, ed. (2015). "Introduction". A Handbook of Karnataka (PDF) (in ఇంగ్లీష్) (Fifth ed.). Karnataka Gazetteer Department. p. 48. Archived from the original (PDF) on 2018-05-23. Retrieved 2018-05-31.
బయటి లింకులు[మార్చు]
- Pages with non-numeric formatnum arguments
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- భారతదేశ జిల్లాల జాబితా
- జాబితాలు
- కర్ణాటక
- భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు