Jump to content

చామరాజనగర్ జిల్లా

వికీపీడియా నుండి
Chamarajanagar district
ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆ
district
CountryIndia
రాష్ట్రంకర్ణాటక
ప్రధాన కార్యాలయంChamarajanagar
BoroughsYelandur, Gundlupet, Chamarajanagar, Kollegal, Hanur
Area
  Total
5,101 కి.మీ2 (1,970 చ. మై)
Population
 (2001)
  Total
9,65,462
  Density189/కి.మీ2 (490/చ. మై.)
భాషలు
  అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
571 313
టెలిఫోన్ కోడ్08226
Vehicle registrationKA-10

చామరాజనగర్ (కన్నడం:ಚಾಮರಾಜನಗರ) కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లో చామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది.[1] కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో చామరాజనగర్ జిల్లా జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కొడుగు, బెంగుళూరు గ్రామీణ జిల్లా జిల్లాలు ఉన్నాయి. .[2]

చరిత్ర

[మార్చు]

చామరాజనగర్ ఒకప్పుడు అరికోత్తర అని పిఉవబడుతుండేది. మైసూరును పాలించిన రాజైన చామరాజ ఉడయార్ ఇక్కడ జన్మించిన తరువాత ఈ ప్రదేశానికి చామరాజనగర్ అని నామకరణం చేయబడింది. ఇక్కడ హొయశిల రాజైన గంగరాజా వద్ద రాజప్రతినిధి పునిసదండనాయక సా.శ. 1117 లో " ది విజయ అర్స్వనాథ్ బసాడి " అనే జైన ఆలయం నిర్మించాడు. .

భౌగోళికం

[మార్చు]

కర్నాటక రాష్ట్రం దక్షిణభాగంలో ఉన్న చామరాజనగర్ జిల్లా సరిహద్దులలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లాకు వాయవ్యసరిహద్దులో మైసూరు జిల్లా, ఉత్తరసరిహద్దులో మండ్య, ఈశాన్యసరిహద్దులో బెంగుళూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పుసరిహద్దులో తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా, సేలం జిల్లా, ఈరోడ్ జిల్లా, నీలిగిరి జిల్లాలు ఉన్నాయి. ఆగ్నేయంలో వేల్యాండు జిల్లాలు ఉన్నాయి.

కర్నాటక రాష్ట్రంలోని జాతీయరహదారి 209 బెంగుళూరు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద జాతీయరహదారి 7 తో అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 7 కర్నాటక సరిహద్దులో పడమర కనుమల వద్ద పంజూరు వద్ద ముగుస్తుంది.

జిల్లాలోని అత్యధిఅభాగం నీలగిరి పర్వతాల దిగువభూములు ఆక్రమించి ఉన్నాయి. ఇవి వర్షాధార మైదానాలుగా అరణ్యాలు, కొండలతో నిండి ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి చామరాజనగర్ జిల్లా జనసంఖ్య 1,020,962.[2] ఇది దాదాపు సైప్రస్ దేశానికి సమానంగా ఉంది.[3] అలాగే యు.ఎస్ రాష్ట్రాలలోని మాంటనా రాష్టానికి సమానం.[4] 640 భారతీయ జిల్లాలలో ఇది 441వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 200. 200 inhabitants per square kilometre (520/sq mi) .[2]2001-2011 కుటునబనియంత్రణ శాతం 5.75%.[2] చామరాజనగర్ స్త్రీపురుష నిష్పత్తి 989:1000.,[2] అలాగే అక్షరాస్యత శాతం 61.12%.[2] అటవీప్రాంతం అత్యధికంగా ఉన్న జిల్లా అయినందున జిల్లాలో అత్యధికస్థాయిలో గిరిజనులు నివసిస్తున్నారు. వారిలో " సోలిగా, యరావా, జెనుకుర్బా, బెట్ట కుర్బాలు జాతి వారు ప్రధానులుగా పరిగణిచబడుతున్నారు. ఈ జాతి ప్రజల సంఖ్య మొత్తం 82,000. ఈ ప్రజలకు వారి ప్రత్యేక భాష ఉంటుంది.

ఇతర సమాచారం

[మార్చు]

జిల్లాలోని దక్షిణప్రాంతం అధికంగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలు గంధపు చెట్ల అక్రమరవాణా, బందిపోటు వీరప్పన్‌కు ఆశ్రయం అయ్యాయి. వీరప్పన్ 100 కంటే అధికమైన పోలీసుల మరణానికి హేతువు కారణమయ్యాడు. వీరప్పన్ ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న " స్పెషల్ టస్క్ ఫోర్స్ " చేతిలో 2004 అక్టోబరు18 న తమిళనాడుకు చెందిన ధర్మపురి జిల్లాలో ఎంకౌంటర్‌లో హతుడయ్యాడు. విరప్పన్ దాదాపు 2 దశాబ్ధాల కాలం పరారి జీవితం గడిపాడు. వీరప్పన్ నల్లరాతి అక్రమరవాణా చేసి అటవీ శాఖను హడకెత్తించాడు.

దేవాలయాలు

[మార్చు]
  • అరకేశ్వర దేవాలయం, హొళె ఆలూరు : హిందూ దేవుడు శివుడు కు అంకితమైన ఆలయం. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం, చామరాజనగర జిల్లా లోని హోళె ఆలూరు గ్రామంలో ఉంది. చరిత్రకారుడు శర్మ ప్రకారం, ఈ ఆలయం పడమటి గంగ వంశం పాలన కాలమైన క్రీస్తుశకం 10వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదిగా భావించబడుతుంది, తరువాతి కాలాల్లో పునరుద్ధరణ చేయబడినట్లు తెలుస్తోంది. చరిత్రపరంగా ముఖ్యమైన టక్కోలం యుద్ధం లో తంజావూరు కు చెందిన చోళులు పై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, ఈ ఆలయాన్ని రాజు బుటుగ II క్రీస్తుశకం 949 ప్రాంతంలో నిర్మించాడు.

.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2011-10-09 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-27.
  2. 1 2 3 4 5 6 7 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". the original నుండి 2011-09-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original నుండి 2011-08-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30. Montana 989,415

వెలుపలి లింకులు

[మార్చు]

వర్గం:భారతదేశం లోని జిల్లాలు