రాయచూరు

వికీపీడియా నుండి
(రాయచూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Raichur district

ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆ
district
Raichur district montage Clockwise from top left:Ek Minar Masjid in Raichur,Sunflower fields near Buddinni, Raichur Thermal Power Station, Channamma Circle Sindhanur, Mudgal fort, Aam Talab Lake in Raichur, outer view of Rock edicts of Asokha at Maski.
Raichur district montage
Clockwise from top left:Ek Minar Masjid in Raichur,Sunflower fields near Buddinni, Raichur Thermal Power Station, Channamma Circle Sindhanur, Mudgal fort, Aam Talab Lake in Raichur, outer view of Rock edicts of Asokha at Maski.
Located in the northeast part of the state
Country India
StateKarnataka
DivisionGulbarga Division
HeadquartersRaichur
TalukasRaichur, Sindhanur, Lingsugur, Manvi, Devadurga
ప్రభుత్వం
 • District collectorSmt. M.V.Savithri, IAS
విస్తీర్ణం
 • మొత్తం8,386 కి.మీ2 (3,238 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
400.0 మీ (1,312.3 అ.)
జనాభా
(2001)
 • మొత్తం16,69,762
 • సాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
Languages
 • OfficialKannada
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
584101,584102,584103
Telephone code08532
ISO 3166 కోడ్IN-KA-RA
వాహనాల నమోదు కోడ్KA-36
Sex ratio0.983 /
Literacy48.8%
Lok Sabha constituencyRaichur Lok Sabha constituency
Precipitation680.6 millimetres (26.80 in)
జాలస్థలిraichur.nic.in
Raichur district at a glance

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో రాయచూర్ జిల్లా ఒకటి. రాయచూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కర్నాటక రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది.

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు యాద్గిర్
ఈశాన్య సరిహద్దు బీజ్‌పూర్, బాగల్‌కోట్
పశ్చిమ సరిహద్దు కొప్పల్
దక్షిణ సరిహద్దు బళ్ళారి
తూర్పు సరిహద్దు మహబూబ్‌నగర్ (తెలంగాణా), కర్నూల్ (ఆంధ్రప్రదేశ్)

భౌగోళికం[మార్చు]

రాయచూర్ నది కృష్ణా, తుంగభద్రా నదీ సంగమ మైదానంలో ఉంది. జిల్లాలు ఉత్తరంలో కృష్ణా నది దక్షిణంలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నాయి.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బీజాపూర్, గుల్బర్గ్ (కృష్ణా నదికి అటువైపు)
పశ్చిమ సరిహద్దు కొప్పల్, బాగల్‌కోట్
ఆగ్నేయ సరిహద్దు బళ్ళారి (తుంగభద్రా నదికి అటువైపు)
ఈశాన్య సరిహద్దు మహబూబ్‌నగర్ (తెలంగాణా)
తూర్పు సరిహద్దు కర్నూల్ (ఆంధ్రప్రదేశ్)

చరిత్ర[మార్చు]

జిల్లా చరిత్ర క్రీ.పూ 3 శతాబ్దం నుండి లభిస్తుంది. లింగసుగుర్ తాలూకాలోని మస్కి వద్ద అశోకుని ఒకటి, కొప్పల్ సమీపంలో రెండు శిలాశాసనాలు లభిస్తున్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతం కొంతకాలం (273-236) మయూర చక్రవర్తి అశోకుని స్వాధీనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. క్రిస్టియన్ శకం ఆరంభంలో ఈ ప్రాంతం శాతవాహనుల ఆధీనంలోకి మారింది. 3-4 శతాబ్ధాలలో ఈ ప్రాంతం ఒకతకాల ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతాన్ని కదంబ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఈ ప్రాంతాన్ని చాళుక్గ్యులు స్వాధీనం చేసుకున్నారు. అయిహోల్ శలాశాసనాల ఆధారంగా రెండవ పులకేశి పల్లవులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారని భావిస్తున్నాడు. పులకేశి కుమారుడు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు.8 శతాబ్దం తరువాత రాయచూర్ ప్రాంతం అంతా రాష్ట్రకూటులు స్వాధీనం చేసుకున్నారని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. మంవి తాలూకాలో లభిస్తున్న శిలాశాసనాలు ఆధారంగా రాష్ట్రకూటుల సామంతరాజు రెండవ కృష్ణా రాజు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. రాష్ట్రకూట రాజు నృపతుంగ కన్నడ రచనలలో ఈ ప్రాంతంలోని కొప్పల్ భూభాగాన్ని గ్రేట్ కొప్పల్ అని వర్ణించాడు.

రాజసంస్థానాల పాలన[మార్చు]

పశ్చిమ చాళుఖ్యులకు సంబంధించిన శిలాశాసనాలు జిల్లాలో పలు ప్రాంతాలలో లభిస్తున్నాయి. వీటి ఆధారంగా క్రీ.శ 10-12 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుఖ్యుల ఆధీనంలో ఉంది. లింగ్సుగుర్ తాలూకాలో లభించిన ఆధారలను అనుసరించి చాళుఖ్యుల పాలనాకాంలో రాయచూర్ ప్రాంతాన్ని ఐదవ విక్రమాదిత్యుని సోదరుడు మొదటి జగదేకమల్లుడు పాలించాడని భావిస్తున్నారు. మస్కి తాలూకాలో లభిస్తున్న ఆధారాలను అనుసరించి ఈ నగరం ఒకప్పుడు జయసింహునికి రాజధానిగా ఉందని భావిస్తున్నారు. రాయచూరు ప్రాంతంలో దక్షిణభారతీయ పాలకులైన చోళరాజులకు, కల్యాణి సామ్రాజ్య పాలకులైన చాళుఖ్యులు (అక పశ్చిమ చాళుఖ్యులు) మద్య ఆధిక్యత కొరకు పలు యుద్ధాలు సంభవించాయి. ఈ ప్రాంతం కొంతకాలం చోళుల ఆధిక్యతలో ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను హయహయులు, సిందాలు పాలించారు. చాళుఖ్యల పతనం తరువాత రాయచూరు ప్రాంతం కలచూరి, తరువాత సెవ్న యాదవ రాజుల పాలనలో ఉంది. తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలోకి మారింది. రాయచూరు కోట గోడలమీద లభించిన శిలాశాసనాల ఆధారంగా క్రీ.శ 1294 రాణి రుద్రమదేవి సైనికాధికారి గోర్ గంగయ్యరెడ్డి రాయచూర్ కోటను నిర్మించాడని తెలుస్తుంది. .[1] తరువాత క్రీ.శ 1312లో రాయచూర్ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫిర్ స్వాధీనం చేసుకున్నాడు.

విజయనగర పాలకులు[మార్చు]

ఢిల్లి సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన తరువాత రాయచూరు జిల్లా క్రీ.శ 1323లో విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి మారింది. 1363లో రాయచూర్ ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నారు. బీజపూర్ సుల్తానేట్ విచ్ఛిన్నం అయిన తరువాత 1489లో బీజపూర్ సుల్తానేట్‌కు చెందిన ఆదిల్‌షా స్వాధీనం చేసుకున్నాడు. 1520లో రాయచూర్ యుద్ధం తరువాత విజయనగర పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేదుకున్నారు. 1565లో దక్కన్ సుల్తానేట్ సాగించిన తాలికోట యుద్ధంలో విజయనగర రాజు ఓడిపోయిన తతువాత బీజపూర్ రాజులు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1853 - 1860 వరకు ఔరంగజేబు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. నిజాముల కాలంలో ఈ ప్రాంతం గుల్బర్గా డివిషన్‌లో భాగంగా ఉంది. పోలో ఆపరేషన్ తరువాత 1948 సెప్టెంబరు 17 న నిజాం రాజ్యం తప్పనిసరిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. భాధాప్రయుక్త రాష్ట్రాల విభజన తరువాత ఈ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో (తరువాత ఇది కర్నాటక రాష్ట్రం)!భాగం అయింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Raichur district has a population of 1,924,773,[2] roughly equal to the nation of Lesotho[3] or the US state of West Virginia.[4] This gives it a ranking of 246th in India (out of a total of 640).[2] The district has a population density of 228 inhabitants per square kilometre (590/sq mi) .[2] Its population growth rate over the decade 2001-2011 was 15.27%.[2] Raichur has a sex ratio of 992 females for every 1000 males,[2] and a literacy rate of 60.46%.[2]

Raichur District has five taluks: Raichur, Devadurga, Sindhanur, Manvi and Lingsugur. The capital of the district is the city of Raichur, which is 409 km from the state capital, Bangalore.

పర్యాటకం[మార్చు]

జిల్లాలో ఉన్న చారిత్రక ఆకర్షణలలో 1294లో నిర్మించబడిన రాయచూర్ కోట ఒకటి. సమీపంలో ఉన్న అనెగుండి పట్టణంలో విజయనగరానికి చెందిన రంగనాథ ఆలయం, పంపానది, కమల్ మహల్ మొదలైన పలు స్మారకచిహ్నాలు ఉన్నాయి.

 • రాయచూర్ పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉన్న కల్లూరు ప్రాంతంలోమహాలక్ష్మీ ఆలయం ఉంది. రాయచూర్ పట్టణానికి 18 కి.మీ దూరంలో కృష్ణానదీ తీరంలో దియోసుగుర్ గ్రామంలో శ్రీసుగురేశ్వర ఆలయం (వీరభద్రుడు) ఉంది. రహదారి మార్గం ద్వారా రెండు ఆలయాలకు సులువుగా చేరుకోవచ్చు.
 • ముద్గల్ వద్ద ముద్గల్ కోట, పురాతన కాథలిక్ చర్చి (1557 లో నిర్మించబడింది) ఉన్నాయి.
 • హట్టి బంగారు గనులు ప్రపంచంలోని అతిపురాతన గనిగా గుర్తించబడుతుంది. ఇది ఆశోకచక్రవర్తి కంటే పూర్వం నాటిదని భావిస్తున్నారు. భారతదేశంలో పనిచేస్తున్న ఒకే ఒక గని ఇదే.
 • నారదగడ్డె ఇది నారద ముని సంబంధిత పవిత్ర ప్రదేశం. ఇక్కడ నారదమహర్షి తపమాచరించాడని విశ్వసిస్తున్నారు. కృష్ణానదిలోని నారదగడ్డె, కూర్మగడ్డె ద్వీపలో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.
 • జలదుర్గా ఒక కోట గ్రామం. ఆది షాహి రాజులు దీనిని నిర్మించారని భావిస్తున్నారు.
 • నియోలిథిక్ కాలంనాటి పిక్లిహ చరిత్రకాలానికి ముందు నాటిదని భావిస్తున్నారు. ముద్గల్ పట్టణానికి ఇది 5కి.మీ దూరంలో ఉంది.
 • రాయచూరుకు 30 కి.మీ దూరంలో మంవి తాలాకాలో ఉన్న కల్లుర్ పురాతత్వ ప్రదేశం ఒక రాగి బధ్రపరచిన ప్రదేశం అని భావిస్తున్నారు.

ఆర్ధికం[మార్చు]

Raichur Thermal Power Station

జిల్లాలో శక్తి నగర్ వద్ద " రాయచూర్ ధర్మల్ పవర్ స్టేషను " నుండి కర్ణాటక రాష్ట్రం విద్యుత్తు అవసరాలకు అధికభాగం విద్యుత్తు లభిస్తుంది. భారతదేశంలో బంగారం లభిస్తున్న ప్రదేశాలలో రాయచూర్ జిల్లా ఒకటి. రాయచూర్ నగరానికి 90 కి.మీ దూరంలో హట్టి బంగారు గనులు ఉన్నాయి. జిల్లాలోని 5 తాలూకాలకు చక్కటి నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. కృష్ణానది మీద నారాయణపూర ఆనకట్ట నిర్మించబడింది. రాయచూర్ వరి పంటలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అత్యుత్తమ నాణ్యమైన వరిధాన్యం లభిస్తుంది. రాయచూరులో అనేక రైసు మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతరదేశాలకు బియ్యం ఎగుమతి చేయబడుతున్నాయి. రాయచూరులో పత్తికి మంచి మార్కెట్ వసతి లభిస్తుంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయచూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర 5 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[5]

విద్యా సంస్థలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-17. Retrieved 2015-02-05.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Lesotho 1,924,886 line feed character in |quote= at position 8 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 line feed character in |quote= at position 14 (help)
 5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.

వెలుపలు లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాయచూరు&oldid=3056821" నుండి వెలికితీశారు