బి.శ్రీరాములు
బి.శ్రీరాములు | |||
| |||
మంత్రి
| |||
పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 13 మే 2023 | |||
ముందు | తిప్పస్వామి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మొలకాల్మూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బళ్లారి, కర్ణాటక, భారత దేశం | 1971 ఆగస్టు 8||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్ (2011–2014) | ||
జీవిత భాగస్వామి | బీ.లక్ష్మి | ||
బంధువులు | జె. శాంత (సోదరి) | ||
సంతానం | 2 |
బీ.రాములు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో రవాణా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]
జననం
[మార్చు]బీ.రాములు 1971, ఆగస్టు 8వ తేదీన, బళ్ళారి జిల్లాలోని జోళదరాశి గ్రామంలో జన్మించాడు. బీ.తిమ్మప్ప, హొన్నూరమ్మల ఎనిమిది మంది సంతానంలో శ్రీ రాములు ఏడో కుమారుడు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]శ్రీరాములు తొలిసారి బళ్లారి నగరసభ ఎన్నికల్లో పోటీ చేసి 34వ వార్డులో విజయం సాధించాడు. ఆయన 1999లో బళ్లారి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీరాములు 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సామాన్య నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా, 2008లో ముఖ్యమంత్రి బిఎస్.యడిఐరోపాప మంత్రిమండలిలో ఆరోగ్య మంత్రిగా విధులు నిర్వహించాడు. ఆయన పై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి & బిజెపికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 46,760 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[2]
ఆయన 2011లో బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్ స్థాపించి 2013లో ఎన్నికల్లో పోటీ చేశాడు. శ్రీరాములు 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ నుంచి బళ్లారి నియోజకవర్గం ఎంపీగా గెలిచాడు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొళకాల్మూరు, బాదామిల నియోజకవర్గాల నుండి పోటీ చేసి మోళకాల్మూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై యడిఐరోపాప మంత్రిమండలిలో ఆరోగ్య & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.ఆయన 2021లో బసవరాజు బొమ్మై మంత్రిమండలిలో రవాణా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, జాతీయం (23 August 2019). "హ్యాట్రిక్ కొట్టిన శ్రీరాములు". www.andhrajyothy.com. Archived from the original on 23 August 2019. Retrieved 23 August 2019.
- ↑ "Bellary bypoll: Ruling BJP loses deposit, rebel Sriramulu wins | Bengaluru News - Times of India". The Times of India.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Eenadu (15 May 2023). "ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
బయటి లింకులు
[మార్చు]- B. Sriramulu - Health and Family Welfare Department excluding Medical Education at the Karnataka Legislative Assembly