జె. శాంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె. శాంత

పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ
పదవీ కాలం
15వ లోక్ సభ
ముందు గాలి కరుణాకర రెడ్డి
తరువాత బి.శ్రీరాములు
నియోజకవర్గం బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం, కర్ణాటక

వ్యక్తిగత వివరాలు

జననం (1973-06-01) 1973 జూన్ 1 (వయసు 50)
బళ్లారి, కర్ణాటక
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు బి. తిమ్మప్ప (తండ్రి),
బి. హొన్నూరమ్మ (తల్లి)
సంతానం ఒక కుమార్తె
నివాసం బళ్లారి,
న్యూఢిల్లీ
వృత్తి సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.

జె. శాంత (జననం 1973 జూన్ 1) భారతీయ రాజకీయవేత్త. ఆమె భారతదేశ 15వ లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఆమె కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఆమె 2009 నుండి 2014 వరకు నీటి వనరుల కమిటీ సభ్యురాలుగా కూడా వ్యవహరించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె కర్ణాటకలోని బళ్లారిలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు కొనసాగింది. ఆమె కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి.[1]

రాజకీయ జీవితం[మార్చు]

2009 సాధారణ ఎన్నికలలో ఆమె షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. ఆమె బళ్లారి నుండి 2018 ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసింది కానీ 240,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది.

వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆమె 2023 జనవరి 2న ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరింది.[2]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (3 January 2024). "ఏపీ రాజకీయాల్లోకి శ్రీరాములు కుటుంబం." Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. "సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ శాంత | EX MP J Shantha Joined YSRCP In The Presence Of CM Jagan - Sakshi". web.archive.org. 2024-01-02. Archived from the original on 2024-01-02. Retrieved 2024-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జె._శాంత&oldid=4078283" నుండి వెలికితీశారు