యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | |
|---|---|
| పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ | వై.వి.సుబ్బారెడ్డి |
| లోక్‌సభ నాయకుడు | పి.వి.మిధున్ రెడ్డి |
| రాజ్యసభ నాయకుడు | పిల్లి సుభాష్ చంద్రబోస్ |
| స్థాపకులు | కే. శివకుమార్ |
| స్థాపన తేదీ | 2009 జనవరి 1 |
| ప్రధాన కార్యాలయం | ప్లాట్ నెం. 13, సూర్యదేవర టౌన్షిప్, తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| విద్యార్థి విభాగం | వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ |
| యువత విభాగం | [1] |
| మహిళా విభాగం | వరుదు కళ్యాణి |
| కార్మిక విభాగం | పి. గౌతమ్ రెడ్డి |
| రైతు విభాగం | ఎం. వి. ఎస్. నాగిరెడ్డి |
| రాజకీయ విధానం | తెలుగు ప్రాంతీయత[2] ప్రాంతీయత[2] సామాజిక ఉదారవాదం[3] లౌకికవాదం[4][5] ప్రజాకర్షకవాదం[5] |
| రాజకీయ వర్ణపటం | మధ్యస్థం[3] నుండి మధ్యస్థ-వామపక్షం[6] |
| రంగు(లు) | నీలం (ప్రధానంగా) తెలుపు ఆకుపచ్చ |
| ఎన్నికల కమిషను స్థితి | రాష్ట్ర పార్టీ |
| లోక్‌సభ స్థానాలు | 4 / 543 |
| రాజ్యసభ స్థానాలు | 4 / 245 |
| శాసన సభలో స్థానాలు |
|
| ఎన్నికల చిహ్నం | |
సీలింగ్ ఫ్యాన్ | |
| Party flag | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలువబడే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన కేంద్రంగా కలిగిన ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ.[7][8] ఈ పార్టీ ప్రారంభంలో కొలిశెట్టి శివకుమార్ ద్వారా భారత ఎన్నికల సంఘంలో నమోదైంది. ఆ తర్వాత దీని బాధ్యతలను ప్రస్తుత అధ్యక్షుడు వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వీకరించారు.[9][10][11][12][13] ఈ పార్టీ నాయకత్వంలో జగన్ మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం ఈ పార్టీకి లోక్‌సభలో 4 స్థానాలు ఉన్నాయి.
ఆవిర్భావం
[మార్చు]2009 సెప్టెంబరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) హెలికాప్టర్ ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించిన అనంతరం,[14][15] ఆయన కుమారుడు, కడప నియోజకవర్గ అప్పటి ఎంపీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనను ముఖ్యమంత్రిగా చేయాలని సోనియా గాంధీని కోరినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.[16] వైఎస్సార్ మరణవార్త విని దిగ్భ్రాంతితో మరణించిన కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర ప్రారంభించారు.[17][18] ఈ యాత్రకు కాంగ్రెస్ నాయకత్వం నుండి మద్దతు లభించలేదు.[19] యాత్రను నిలిపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తూ, జగన్ 2010 ఏప్రిల్‌లో పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలలో ఓదార్పు యాత్ర మొదటి విడతను కొనసాగించారు.
అదే సమయంలో, వైఎస్సార్, జగన్‌లకు అత్యంత సన్నిహితంగా ఉండే సాక్షి టీవీ, సాక్షి దినపత్రికలు కొత్త ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానంపై నిరంతరం విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాక్షి టీవీలో ప్రసారమైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలపై విమర్శలు వచ్చాయి. ఇది కాంగ్రెస్ శ్రేణులలో తీవ్ర ఆగ్రహానికి కారణమై, అధిష్ఠానానికి జగన్‌కు మధ్య దూరాన్ని పెంచింది.[20] ఆ తర్వాత ప్రసారాల్లో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.[21]
కాంగ్రెస్ పార్టీ తన పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 2009లో జగన్, ఆయన తల్లి వై. ఎస్. విజయమ్మలు తమ లోక్‌సభ (కడప), శాసనసభ (పులివెందుల) సభ్యత్వాలకు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.[22][9][23] జగన్‌కు మద్దతుగా పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రారంభంలో ఈ పార్టీని వైఎస్సార్ అభిమాని అయిన కే. శివకుమార్ స్థాపించారు. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం వై. ఎస్. జగన్ ఈ పార్టీ బాధ్యతలను స్వీకరించారు.[9] ఆ తర్వాత కాలంలో వ్యవస్థాపకుడిని పార్టీ నుండి తొలగించి, జగన్ పూర్తి నియంత్రణ సాధించారు.[24]
ఎన్నికల ప్రదర్శన
[మార్చు]పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా మెజారిటీ స్థానాలను ఈ పార్టీ గెలుచుకుంది.[25] 2012 మార్చిలో నెల్లూరు జిల్లాలోని కోవురు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది.[26][27]
2012 ఉపఎన్నికల్లో 18 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అవి: పరకాల, నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, నరసాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, రాజంపేట, కోడూరు, రాయచోటి, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, రాయదుర్గం, అనంతపురం అర్బన్, తిరుపతి.[28]
2012 జూన్ 15న వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని, 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 స్థానాలను కైవసం చేసుకుంది.[29]
2014 సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో ఓటమి పాలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన శాసనసభ్యులలో మూడో వంతు మంది 2017 నాటికి తెలుగుదేశం పార్టీలో చేరారు.[30] 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయలేదు.[31]
2019 శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ 294 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి సంచలన విజయం సాధించింది.[32][33][34] విజయనగరం జిల్లా, కడప, కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లాలలో పూర్తి స్థానాలను కైవసం చేసుకుంది. 2019 మే 30 నుండి 2024 వరకు అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది.
2024 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చేతిలో వైఎస్సార్సీపీ ఓటమి పాలైంది. 294 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలు మాత్రమే సాధించి, ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10% స్థానాలను కూడా పొందలేకపోయింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
[మార్చు]| ఎన్నికల సంవత్సరం | శాసనసభ | పార్టీ నాయకుడు | పోటీ చేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు | పోలైన ఓట్లు | ఓట్ల శాతం (%) | స్థానాల్లో మార్పు | ఓట్ల శాతంలో మార్పు | ఫలితం |
|---|---|---|---|---|---|---|---|---|---|
| ఆంధ్రప్రదేశ్ శాసనసభ[35] | |||||||||
| 2014 | 14వ | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి | 266 | 70 / 294 |
13,494,076 | 27.88% | ప్రతిపక్షం | ||
| 2019 | 15వ | 175 | 151 / 294 |
15,688,569 | 49.95% | ప్రభుత్వం | |||
| 2024 | 16వ | 175 | 11 / 294 |
13,284,134 | 39.37% | ఇతరులు | |||
| వైఎస్సార్సీపీ అసెంబ్లీ సీట్ల వివరాలు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) |
![]() |
లోక్‌సభ ఎన్నికల ప్రదర్శన
[మార్చు]| ఎన్నికల సంవత్సరం | లోక్‌సభ | పార్టీ నాయకుడు | పోటీ చేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు | పోలైన ఓట్లు | ఓట్ల శాతం (%) | స్థానాల్లో మార్పు | ఓట్ల శాతంలో మార్పు | ఫలితం |
|---|---|---|---|---|---|---|---|---|---|
| లోక్‌సభ | |||||||||
| 2009 | 15వ | పీ.వీ మిథున్ రెడ్డి | 42 | 2 / 543 |
13,995,103 | 19,47% | |||
| 2014 | 16వ | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి | 42 | 9 / 543 |
13,995,435 | 29.14% | ఇతరులు | ||
| 2019 | 17వ | 42 | 22 / 543 |
15,537,006 | 49.89% | ఇతరులు | |||
| 2024 | 18వ | 42 | 4 / 543 |
13,174,874 | 39.61% | ఇతరులు | |||
| వైఎస్సార్సీపీ లోక్‌సభ సీట్ల వివరాలు |
![]() |
పార్టీ నాయకుల జాబితా
[మార్చు]2022లో వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటిస్తూ వచ్చిన నివేదికలపై భారత ఎన్నికల సంఘం (ECI) వివరణ కోరింది. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునే నిర్ణయంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది.[36][37][38]
అధ్యక్షుడు
[మార్చు]| సంఖ్య | చిత్రపటం | పేరు (జననం–మరణం) |
పదవీ కాలం | ||
|---|---|---|---|---|---|
| బాధ్యతల స్వీకరణ | పదవీ విరమణ | మొత్తం కాలం | |||
| 1 | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి (జననం 1972) |
1 జనవరి 2009 | ప్రస్తుతం | 15 సంవత్సరాలు, 251 రోజులు | |
గౌరవాధ్యక్షురాలు
[మార్చు]| సంఖ్య | చిత్రపటం | పేరు (జననం–మరణం) |
పదవీ కాలం | ||
|---|---|---|---|---|---|
| బాధ్యతల స్వీకరణ | పదవీ విరమణ | మొత్తం కాలం | |||
| 1 | వై. ఎస్. విజయమ్మ (జననం 1956) |
12 మార్చి 2011 | 5 మే 2022 | 11 సంవత్సరాలు, 71 రోజులు | |
శాసనసభ నాయకులు
[మార్చు]ముఖ్యమంత్రుల జాబితా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
[మార్చు]| సంఖ్య | చిత్రపటం | పేరు (జననం–మరణం) |
పదవీ కాలం | శాసనసభ (ఎన్నికలు) |
నియోజకవర్గం | మంత్రివర్గం | ||
|---|---|---|---|---|---|---|---|---|
| బాధ్యతల స్వీకరణ | పదవీ విరమణ | మొత్తం కాలం | ||||||
| 1 | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి (జననం 1972) |
30 మే 2019 | 11 జూన్ 2024[39] | 5 సంవత్సరాలు, 13 రోజులు | 15వ (2019) |
పులివెందుల | జగన్ | |
ఉప ముఖ్యమంత్రుల జాబితా
[మార్చు]| చిత్రపటం | పేరు (ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ) [నియోజకవర్గం] |
పదవీ కాలం | మొత్తం కాలం | శాఖలు | |
|---|---|---|---|---|---|
| బాధ్యతల స్వీకరణ | పదవీ విరమణ | ||||
| అంజాద్ బాషా షేక్ బెపారి (కడప ఎమ్మెల్యే) |
8 జూన్ 2019 |
11 జూన్ 2024 |
5 సంవత్సరాలు, 3 రోజులు |
| |
| కె. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే) |
| ||||
| ఆళ్ల నాని[40] (జననం 1969) (ఏలూరు ఎమ్మెల్యే) |
8 జూన్ 2019 |
7 ఏప్రిల్ 2022 |
2 సంవత్సరాలు, 303 రోజులు |
| |
| పాముల పుష్పశ్రీవాణి (జననం 1986) (కురుపాం ఎమ్మెల్యే) |
| ||||
| పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ) |
8 జూన్ 2019 |
18 జూన్ 2020 |
1 సంవత్సరం, 10 రోజులు |
| |
| ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట ఎమ్మెల్యే) |
22 జూలై 2020 |
7 ఏప్రిల్ 2022 |
1 సంవత్సరం, 259 రోజులు |
| |
| బూడి ముత్యాలనాయుడు (మాడుగుల ఎమ్మెల్యే) |
11 ఏప్రిల్ 2022 |
11 జూన్ 2024 |
2 సంవత్సరాలు, 61 రోజులు |
| |
| కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే) |
| ||||
| రాజన్న దొర పీడిక (సాలూరు ఎమ్మెల్యే) |
| ||||
లోక్‌సభ సభ్యులు
[మార్చు]రాజ్యసభ సభ్యుల జాబితా
[మార్చు]| సంఖ్య | పేరు[41] | నియామక తేదీ[42] | పదవీ విరమణ తేదీ[42] |
|---|---|---|---|
| 1 | వై. వి. సుబ్బా రెడ్డి | 02-ఏప్రిల్-2024 | 01-ఏప్రిల్-2030 |
| 2 | గొల్లా బాబూరావు | 02-ఏప్రిల్-2024 | 01-ఏప్రిల్-2030 |
| 3 | మేడా రఘునాథరెడ్డి | 02-ఏప్రిల్-2024 | 01-ఏప్రిల్-2030 |
| 4 | ఎస్. నిరంజన్ రెడ్డి | 22-జూన్-2022 | 21-జూన్-2028 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రాజకీయ పార్టీల జాబితా
- తెలుగుదేశం పార్టీ
- జనసేన పార్టీ
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh: Byreddy Siddharth Reddy named YSRCP youth wing chief". Times of India. 2022-06-29.
- 1 2 "About us". YSRC Party. 2019-01-01.
- 1 2 "Ongole: Jagan implementing Ambedkar's ideology". 13 February 2020.
- ↑ "Jagan 'appreciates' Modi, but committed to secularism". 30 September 2013.
- 1 2 Price, Pamela; Srinivas, Dusi (August 2014). Piliavsky, Anastasia (ed.). "Patronage and autonomy in India's deepening democracy". Cambridge University Press: 217–236. doi:10.1017/CBO9781107296930.011. ISBN 978-1-107-29693-0.
{{cite journal}}: CS1 maint: periodical has ISBN (link) - ↑ "This is how Jagan Reddy has turned into a political juggernaut in Andhra". 25 September 2021.
- ↑ "About the Party". YSR Congress Party. 16 October 2018. Retrieved 13 November 2021.
- ↑ "Why YSR Congress?". 2011. Archived from the original on 16 April 2014. Retrieved 19 May 2014.
- 1 2 3 "'YSR Congress' is now Jagan's party - The Times of India". The Times Of India. Archived from the original on 18 January 2020.
- ↑ "'Road roller' to 'baby stroller': Symbol war, but not symbolic, for Telangana contestant". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-21. Retrieved 2024-12-15.
- ↑ "Jaganmohan Reddy acquires YSR Congress Party from worker". India Today (in ఇంగ్లీష్). 2011-02-17. Retrieved 2024-12-15.
- ↑ "Jaganmohan Reddy split from congress, for own party". The Economic Times. 2010-11-29. Archived from the original on 31 January 2021. Retrieved 2010-11-30.
- ↑ "Jaganmohan Reddy walks out of jail after 16 months". IndiaToday. 2013-09-24. Archived from the original on 21 January 2021. Retrieved 2020-12-07.
- ↑ "Andhra Pradesh CM YSR Reddy dead in chopper crash". The Times of India. 2009-09-03. ISSN 0971-8257. Retrieved 2024-05-15.
- ↑ "Andhra Pradesh CM dead in chopper crash: PMO sources". The Economic Times. 2009-09-03. ISSN 0013-0389. Retrieved 2024-05-15.
- ↑ "Jagan is the most corrupt Chief Minister". The Hindu. 2022-12-22. Retrieved 2024-07-14.
- ↑ "national - News - msn". www.msn.com.
- ↑ "Odarpu Yatra | The Caravan". caravanmagazine.in. Retrieved 2024-05-15.
- ↑ "Defiant Jagan to go ahead with 'Odarpu' yatra - The Times of India". The Times Of India. Archived from the original on 22 October 2010.
- ↑ With TV attack on Sonia & PM, Jagan signals it’s time to go. Indian Express (2010-11-21). Retrieved on 2011-10-20.
- ↑ "Sakshi re-telecasts story on Cong deleting anti-Sonia remarks". The Hindu (in Indian English). 2010-11-21. ISSN 0971-751X. Retrieved 2024-05-31.
- ↑ "Jagan quits Congress, to float 'YSR Congress'". Zee News. 30 November 2010. Archived from the original on 6 March 2019.
- ↑ Andhra Pradesh / Hyderabad News : Jagan is national president of YSR Congress Party. The Hindu (2011-02-22). Retrieved on 2011-10-20.
- ↑ "Jagan expels YCP founder from party – EC issues notice". www.telugu360.com.
- ↑ "News /National: Jagan quits Congress, Kadapa Lok Sabha seat" Archived 2011-09-08 at the Wayback Machine. The Hindu (2010-11-29). Retrieved on 2011-10-20.
- ↑ "IndiaVotes AC Bye Election: Kovur 2012". IndiaVotes. Retrieved 2024-05-15.
- ↑ "List of Candidates in KOVUR: BYE ELECTION ON 18-03-2012: NELLORE Andhra Pradesh Bye Election". myneta.info. Retrieved 2024-05-15.
- ↑ NDTV (15 June 2012). "Andhra Pradesh By-polls 2012". Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
- ↑ Pilla, Yogendra Kalavalapalli & Viswanath (2012-06-15). "YSR Cong wins 15 of 18 assembly seats, lone Lok Sabha seat in AP". mint (in ఇంగ్లీష్). Retrieved 2024-05-15.
- ↑ "Anti-defection Law Ignored as MLAs Jump Ship to TDP, TRS in Andhra Pradesh and Telangana". News18. Archived from the original on 19 January 2021.
- ↑ "YSRCP not to contest in Telangana elections, Pawan Kalyan still undecided". 11 November 2018.
- ↑ "List of Winners:Andhra Pradesh 2019 Election". www.myneta.info. Retrieved 2024-05-15.
- ↑ "AP Election Results: Election Results of Andhra Pradesh Assembly Election | Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2024-05-15.
- ↑ "Assembly Election Results 2019 of Andhra Pradesh, Vidhan Sabha Election Results 2019 AP State". www.indiastatelections.com. Retrieved 2024-05-15.
- ↑ "Andhra Pradesh Assembly Election Results". Election Commission of India. Retrieved 5 April 2021.
- ↑ "EC orders YSRCP to clarify reports that Jagan Reddy made its life-time permanent president". The Times of India. 2022-09-21. ISSN 0971-8257. Retrieved 2023-06-14.
- ↑ "Election Commission Asks YSRCP To Clear Air On Jagan Reddy Being Made Its 'Permanent President'". news.abplive.com (in ఇంగ్లీష్). 2022-09-21. Retrieved 2023-06-14.
- ↑ Now |, Mirror (2022-09-22). "ECI slams YSRCP, rejects attempt to make Jagan Mohan Reddy as party's permanent president". The Economic Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-14.
- ↑ "Jagan Mohan Reddy Resigns As Andhra Pradesh Chief Minister, Sends Resignation To Governor". NDTV.com. Retrieved 2024-06-04.
- ↑ Service, Express News (10 August 2024). "Andhra former Deputy CM Alla Nani resigns from YSRC". The New Indian Express.
- ↑ "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
- 1 2 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.

