వై. ఎస్. విజయమ్మ
వై.ఎస్.విజయలక్ష్మి రెడ్డి మనకు బాగా వై.ఎస్.విజయమ్మ గా పరిచయస్తులు, వీరు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు. 2022 వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.[1]
వై. ఎస్. విజయలక్ష్మి | |||
| |||
పదవీ కాలం 2011 – 2021 | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు
| |||
పదవీ కాలం 2011 – 2014 | |||
ముందు | వై.యస్. రాజశేఖరరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||
నియోజకవర్గం | పులివెందుల, ఆంధ్రప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బలపనూరు, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా | 1956 ఏప్రిల్ 19||
రాజకీయ పార్టీ | వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ | ||
సంతానం | కుమారుడు, కుమార్తె (వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి) | ||
నివాసం | హైదరాబాదు |
రాజకీయ జీవితం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పిభ్రవరి 2010, ఉపఎన్నికలలో ఏకగ్రీవంగా పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రేస్ పార్టీ తరపున ఏన్నికైయ్యారు. 2011, మార్చిలో పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు, తరువాత వచ్చిన ఎన్నికలలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్.వివేకానందరెడ్డి పై 81,373 తేడాతో గెలుపొందారు. ఈమె రాజకీయ జీవితంలో ప్రథమ సారిగా ఎన్నికైన తరువాత నుంచి ప్రథమ సారి రాజీనామా చేసే వరకూ, శాసన సభకు హాజరు అవ్వకపోవడం చరిత్రలో ఓ మైలు రాయి. 2011 మార్చిలో రెండవ సారి ఎన్నికైన తరువాత మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానంపై తమ ఓటు హక్కుని వినియోగించుకునే నిమిత్తం మొదటి సారిగా శాసనసభకు హాజరైయ్యారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వై.ఎస్.రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయమ్మగా లోకానికి సుపరిచితం, వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటి సంతానమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచారు ఆంధ్ర ప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కుమార్తె షర్మిల
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
[మార్చు]తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షులు ఈమె. ఈ పార్టీ తరపున ఎన్నికైన మొదటి శాసనసభ్యులు ఈమె. పార్టీ ఏర్పాటు చేసిన రోజు నుండి అనేక కార్యక్రమాలకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండి 2014,2019 ఎన్నికలలో ప్రచారానికి వెళ్ళడం జరిగింది
వార్తలలో విజయమ్మ
[మార్చు]2013 సమైక్యాంధ్ర ఉద్యమము
[మార్చు]2013 సమైక్యాంధ్ర ఉద్యమములో భాగంగా ఈవిడ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా విభజనను నిరసిస్తూ గుంటూరులో అమరణ నిరాహారదీక్షను చేశారు. దీనిని పోలీసులు భగ్నం చేసి ఈవిడను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబరు 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ ఎలా చెప్పగలదు? అని ప్రశ్నించారు.
రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు[2][3].[4]
ఇవీ చూడండి
[మార్చు]వంశవృక్షం
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "YSRCP Plenary Meeting 2022: YS Vijayamma Resigns From Party Honorary President Post - Sakshi". web.archive.org. 2022-07-09. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-09. Retrieved 2013-09-11.
- ↑ http://www.telugism.com/video/y-s-vijayalakshmi-writes-letter-shinde-abn[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-14. Retrieved 2013-09-11.
బయటి లంకెలు
[మార్చు]- All articles with dead external links
- వై.యస్.రాజశేఖరరెడ్డి వంశవృక్షం
- Commons category link is on Wikidata
- వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
- 1956 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు
- కడప జిల్లా మహిళా రాజకీయ నాయకులు
- భర్త నుండి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారు
- కడప జిల్లా నుండి ఎన్నికైన మహిళా శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)