వై.యస్.రాజారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియు ప్రముఖ రాజకీయ కుటుంబానికి మూలకర్త. ఇతను స్థానిక వివాదాలను పరిష్కరించడంలో నాయకత్వ బాధ్యతలు వహించటం ద్వారా పేరుగాంచాడు. కొన్ని వివాదాలను పరిష్కరించిన తీరును బట్టి ఈయన కఠినంగా వ్యవహరిస్తారనే ఊహతో వివాదకులలో భయముండేది. వై.యస్.రాజారెడ్డి తల్లిదండ్రులు వై.యస్.వెంకటరెడ్డి, మంగమ్మ. రాజారెడ్డి భార్య పేరు జయమ్మ, వీరికి కలిగిన సంతానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్. రాజశేఖరరెడ్డి ఒకరు.

మే 23, 1998న తన ఫార్మ్ హౌస్ నుండి పులివెందులకు తిరిగి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థి ముఠా జరిపిన బాంబు దాడిలో రాజారెడ్డి మరణించారు.

వంశవృక్షం[మార్చు]