వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి .
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాసన సభ ప్రతిపక్ష నేత


పదవీ కాలము
2014 – ప్రస్తుతం
నియోజకవర్గము పులివెందుల , ఆంధ్రప్రదేశ్

పదవీ కాలము
2009 – 2014
నియోజకవర్గం కడప, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-12-21) 1972 డిసెంబరు 21 (వయస్సు: 46  సంవత్సరాలు)
జమ్మలమడుగు గ్రామము, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
జీవిత భాగస్వామి భారతీ రెడ్డి
సంతానము ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష)
నివాసము హైదరాబాదు బెంగలూరు మరియు అమరావతి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) - పులివెందుల నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమెల్యేగా ఎన్నుకోబడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఏకైక పుత్రుడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం , సండూరూ జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.

రాజకీయ జీవితము[మార్చు]

తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. ఈ పార్టీకి వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. అవినీతికి సంబంధించిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొని 16 నెలల జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకొచ్చారు.

2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష్యుడుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతం (1.25)తో పరాజయం పొంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు.

రాష్ట్రవిభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 4 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడుతూ, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కి.మీ దూరం పాదయాత్ర చేస్తున్నారు.

ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీలచేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా తన పూర్తి మద్ధతును తెలియచేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అభియోగాలు[మార్చు]

2012 మే 27న అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. సెప్టెంబరు 23-2013 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వంశవృక్షం[మార్చు]