Jump to content

యార్లగడ్డ సుమంత్ కుమార్

వికీపీడియా నుండి
సుమంత్ కుమార్ యార్లగడ్డ
జననం
సుమంత్ కుమార్

(1975-02-09) 1975 ఫిబ్రవరి 9 (age 50)
వృత్తిసినిమా నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1999-ప్రస్తుతం
తల్లిదండ్రులుసత్యవతి, యార్లగడ్డ సురేంద్ర

సుమంత్ గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు/నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు; అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సుమంత్ 1975 ఫిబ్రవరి 9 న హైదరాబాదులో జన్మించాడు. సుమంత్ తల్లి నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె. తండ్రి యార్లగడ్డ సురేంద్ర. సుమంత్ ఈ దంపతులకు ఒకడే సంతానం. అక్కినేని మనవలు, మనవరాళ్ళలో సుమంతే అందరికన్నా పెద్దవాడు. ఇతను పుట్టిన కొన్ని నెలల తర్వాత అతని తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది. సుమంత్ మాత్రం తాత కోరిక మేరకు, అక్కినేని దంపతుల దగ్గర ఉండిపోయాడు. అప్పుడు ఆయన గుండె సంబంధించిన శస్త్రచికిత్స చేసుకుని సినిమాలకు కొన్నాళ్ళు దూరంగా ఉంటున్నాడు. తాను సినిమాల్లో ఊపిరిసలపకుండా ఉన్నందున తన పిల్లల బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని అందుకే సుమంత్ ని తానే పెంచాలనుకుంటున్నట్లు అక్కినేని చెప్పాడు. తర్వాత అతన్ని దత్తత కూడా తీసుకున్నారు అక్కినేని దంపతులు.[1]

సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్ళి మిషిగన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. అయితే అది నచ్చక చికాగో లో కొలంబియా కాలేజీ లో ఫిల్మ్ కోర్సులో చేరి డిగ్రీ సంపాదించాడు. సుమంత్ 2004 సంవత్సరంలో కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని, 2006 లో విడాకులు తీసుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]

సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇదీ, అతని రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత, 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్ లో బాగానే ఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి.

2009 లో వచ్చిన బోణి ప్లాప్ అయ్యింది. 2011 లో గోల్కొండ హైస్కూల్ హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత 2017 లో మళ్ళీ రావా అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఎన్.టీ.ఆర్:కథానాయకుడు లో అతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
1999 ప్రేమ కథ సూరి తొలి చిత్రం
2000 సంవత్సరం యువకుడు శివ
పెళ్లి సంబంధం మనవడు
2001 రామ్మా! చిలకమ్మా కాశీ
స్నేహమంటే ఇదేరా చంద్రు
2003 సత్యం సత్యం
2004 గౌరి గౌరీ శంకర్
2005 ధన 51 ధనా
మహానంది శంకర్
2006 గోదావరి శ్రీరామ్ "రామ్"
చిన్నోడు చిన్నా
2007 క్లాస్ మేట్స్ రవి కిరణ్
2008 మధుమాసం సంజయ్
2009 పౌరుడు అజయ్
బోణి డిడి
2011 గోల్కొండ హై స్కూల్ సంపత్
రాజ్ రాజ్
దగ్గరగా దూరంగా గౌతమ్
2014 ఏమో గుర్రం ఎగరావచ్చు బుల్లెబ్బాయి
2016 నరుడా డోనరుడా విక్కీ
2017 మళ్ళీరావా కార్తీక్
2018 సుబ్రహ్మణ్యపురం కార్తీక్
ఇదం జగత్ నిషిత్
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు
ఎన్.టి.ఆర్. మహానాయకుడు
2021 కపటధారి గౌతమ్
2021 అనగనగా ఒక రౌడీ
2022 మళ్ళీ మొదలైంది విక్రమ్
సీతా రామం బ్రిగేడియర్ విష్ణు శర్మ నామినేట్ - ఉత్తమ సహాయ నటుడిగా SIIMA అవార్డు - తెలుగు
2023 వాతి AM కుమార్ హాస్య పాత్ర; ద్విభాషా చిత్రం
సార్ ఎ.ఎస్. మూర్తి
2024 అహం రీబూట్ నిలయ్
2025 అనగనగా వ్యాస్ కుమార్ [2]
టిబిఎ మహేంద్రగిరి వారాహి పోస్ట్-ప్రొడక్షన్
టిబిఎ అనంగన ఒక రౌడీ వాల్తేరు శీను ప్రీ-ప్రొడక్షన్

అక్కినేని వంశ వృక్షం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sumanth Said Yes For Second Marriage". Greatandhra.com. 2011-09-18. Archived from the original on 10 February 2015. Retrieved 2013-03-18.
  2. "OTT ట్రెండింగ్‌లో అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్..!". NTV Telugu. 20 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.