ఏమో గుర్రం ఎగరావచ్చు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏమో గుర్రం ఎగరావచ్చు
Emo Gurram Egaravachu poster.jpg
దర్శకత్వంచంద్ర సిద్దార్థ
రచనఎస్. ఎస్. కాంచి
నిర్మాతపూదోట సుధీర్ కుమార్
తారాగణంసుమంత్, పింకీ సావిక
ఛాయాగ్రహణంచంద్రమౌళి
సంగీతంఎం.ఎం.కీరవాణి
విడుదల తేదీ
జనవరి 25, 2014
దేశంభారతదేశం
భాషతెలుగు

ఏమో గుర్రం ఎగరావచ్చు 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం.

కథ[మార్చు]

టెన్త్‌ క్లాస్‌ పాస్‌ కావడానికి గజిని మొహమ్మద్‌లా దండయాత్రలు చేసే పల్లెటూరి బుల్లెబ్బాయికి (సుమంత్‌) తన మరదలు నీలవేణి (పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో స్థిరపడిన నీలవేణికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటే, తన చాదస్తపు తండ్రికి నచ్చజెప్పలేక బుల్లెబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంతుంది నీలవేణి. అతడిని చేసుకుని అమెరికా తీసుకెళ్లి... ఆ తర్వాత విడాకులు ఇచ్చి నచ్చిన పెళ్ళి చేసుకోవాలనేది నీలవేణి ఆలోచన. ఇదంతా తెలిసినా కానీ పెళ్ళికి సరేనంటాడు బుల్లెబ్బాయి. జీవితం క్రమ పద్ధతిలో జరిగిపోవాలనేది నీలవేణి సిద్దాంతం.దీనికి పూర్తి విరుద్దంగా జీవితం ఒక పద్ధతి ప్రకారం కాకుండా, ఎలాంటి ప్రణాళికలు లేకుండా సరదాగా సాగిపోవాలనేది బుల్లబ్బాయి నైజం. వీరిద్దరికీ పెళ్ళి చేస్తారు పెద్దలు. తదనంతరం వీరి జీవితం ఎలా సాగిపోతుంది? భిన్న మనస్తత్వాలు కలిగిన వీరు కలిసి జీవనయానం సాగించగలుగుతారా? ఎవరు ఎవరితో సర్దుకుపోతారు అన్నది కథా గమనం.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు - ఎస్. ఎస్. కాంచి
  • దర్శకుడు - చంద్ర సిద్దార్థ
  • సంగీతం - ఎం.ఎం.కీరవాణి
  • ఛాయాగ్రహణం - చంద్రమౌళి
  • నిర్మాత - పూదోట సుధీర్ కుమార్
  • బ్యానర్‌: చెర్రీ ఫిలింస్‌ ప్రై.లి.

బయటి లంకెలు[మార్చు]