జెనీలియా
Jump to navigation
Jump to search
జెనీలియా | |
జన్మ నామం | జెనీలియా డి`సూజా |
జననం | [1] ముంబై, భారత్ | 1987 ఆగస్టు 5
ఇతర పేర్లు | జీనూ, హరిణి, జీన్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2003—ప్రస్తుతం |
భార్య/భర్త | రితేష్ దేశ్‌ముఖ్ |
ప్రముఖ పాత్రలు | బాయ్స్ సినిమాలో హరిణి పాత్ర (తమిళ్, తెలుగు భాషల్లో) బొమ్మరిల్లులో హాసిని |
Filmfare Awards | |
---|---|
తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డు 2006 బొమ్మరిల్లు |
జెనీలియా (పుట్టిన తేది: 1987 ఆగస్టు 5) ఒక భారతీయ సినీ నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట.
ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని (ఉత్తమ నటి: బొమ్మరిల్లు) వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె తుజే మేరి కసం అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది.
2020, ఆగస్టు నెల ప్రారంభంలో తాను కరోనా వ్యాధి బారిన పడినట్లు జెనీలియా ప్రకటించారు. అయితే పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చిందని ఆమె వెల్లడించారు. కరోనా వ్యాధి బారిన పడినవాడు దృఢంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.