ఆమని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమని హజరత్
జన్మ నామంమంజుల
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)
Indiaనెల్లూరు
ఆంధ్రప్రదేశ్
భార్య/భర్త ఖాజా మొహియుద్దీన్
ప్రముఖ పాత్రలు మిష్టర్ పెళ్ళాం
శుభలగ్నం
TeluguFilmWallpaper AaNaluguru 2004
ఆ నలుగురు.. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఆమని (జ. నవంబరు 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.[2]

బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[3] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.

ఆమని నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

వెబ్ సిరీస్[మార్చు]

టెలివిజన్[మార్చు]

  • కొత్తగా రెక్కలొచ్చెనా[4]

మూలాలు[మార్చు]

  1. Y. Sunita Chowdhary (2012-04-14). "Arts / Cinema : Sensitive and soulful". The Hindu. Archived from the original on 2012-04-24. Retrieved 2012-07-31.
  2. నవతెలంగాణ, మానవి (25 February 2018). "నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌". నవతెలంగాణ. వి. యశోద. Retrieved 6 March 2018.[permanent dead link]
  3. "TeluguCinema.Com - Aamani's hubby attempts suicide". Archived from the original on 2007-06-04. Retrieved 2006-11-24.
  4. Andhrajyothy (8 January 2024). "ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని జంట‌గా.. ఈ రోజు నుంచే జెమినీ టీవీలో కొత్త సీరియ‌ల్". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమని&oldid=4090857" నుండి వెలికితీశారు