మావిచిగురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మావిచిగురు
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు
స్క్రీన్ ప్లేఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతపి. ఉషారాణి
తారాగణంజగపతి బాబు ,
ఆమని,
రంజిత
ఛాయాగ్రహణంశరత్
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థలు
చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ ఫిలింస్
విడుదల తేదీ
1996 మే 30 (1996-05-30)
సినిమా నిడివి
141 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

మావిచిగురు 1996లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలయిన కుటుంబ కథాచిత్రం.[1] పి. ఉషారాణి ఈ సినిమా నిర్మాత. జగపతి బాబు, ఆమని, రంజిత ఈ సినిమాలో ప్రధాన నటీనటులు. స్రవంతి ఆర్ట్ ఫిలింస్, చంద్రకిరణ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో నటనకు గాను జగపతిబాబుకు మొదటి సారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించింది.[2]

కథ[మార్చు]

సీత, మధుల పెళ్ళితో కథ ప్రారంభం అవుతుంది. సీతకు తన భర్తంటే ప్రాణం. అతన్ని వేరెవరైనా ఆడపిల్ల కన్నెత్తి చూసినా సహించలేదు. మధు పనిచేసే ఆఫీసులోనే సుధ అనే అమ్మాయి సీత చూస్తుండగానే భర్తను కౌగలించుకుంటుంది. దాంతో సీత భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో ఆమెకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. తన చనిపోతే భర్త ఒంటరి కాకూడదని తన పరిస్థితి భర్తకు చెప్పకుండానే అతనికి సుధకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె భర్తను సాధిస్తూ అతన్నుంచి వేరు పడాలని చూస్తుంది. కానీ మధు ఒప్పుకోడు. చివరికి అతనితో విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. కానీ చివరకు సీతకున్న జబ్బు గురించి తెలుసుకుని తనమీద భార్యకున్న ప్రేమ కోసం సుధను పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత పుట్టిన కూతురికి సీత అని పేరు పెట్టుకుంటారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతాన్నందించగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

  • కోదండ రాముడంట కొమ్మలాల , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , జగపతి బాబు, వందేమాతరం శ్రీనివాస్, ప్రస్సన్న, అల్లురామలింగయ్య, ఎం ఎం శ్రీలేఖ, రేణుక
  • మానస సంచరారే, రచన: సదాశివ బ్రహ్మేంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కొండమల్లి కొండమల్లి , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కొమ్మన కులికే కోయిలా , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మావిచిగురు తిని నీకు శుభమని , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • రంజుభలే రాంచిలకా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనుపమ
  • మాట ఇవ్వమ్మా చెల్లీ , రచన, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర

మూలాలు[మార్చు]

  1. "Maavichiguru (1996) | Maavichiguru Movie | Maavichiguru Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-03-27.
  2. Southscope July 2010 - Side A (in ఇంగ్లీష్). Southscope.