బాబు మోహన్
బాబు మోహన్ | |
![]() | |
జన్మ నామం | పల్లె బాబు మోహన్ |
జననం | [1]![]() తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ | 1952 మార్చి 19
ప్రముఖ పాత్రలు | మామగారు మాయలోడు జంబలకిడిపంబ |
బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు, మంత్రి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు...
నేపధ్యము[మార్చు]
ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
మాయలోడు, సినిమాతో స్టార్ కామిడియన్ అయ్యాడు.
రాజకీయ జీవితం[మార్చు]
బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందడు. 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు.
కుటుంబం[మార్చు]
ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబరు 13 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2]
నటించిన చిత్రాల పాక్షిక జాబితా[మార్చు]
- డాన్స్ మాస్టర్ (1986)
- 20వ శతాబ్దం (సినిమా) (1990)
- ఉద్యమం (1990)
- చిరునవ్వుల వరమిస్తావా
- ముగ్గురు మొనగాళ్ళు
- చిట్టెమ్మ మొగుడు (1992)
- సాహసవీరుడు - సాగరకన్య (1996)[3]
- ఆరో ప్రాణం (1997)
- చిన్నరాయుడు
- హిట్లర్
- దేవి
- శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర (2014)
- పండుగాడి ఫొటో స్టూడియో (2019)
- బిచ్చగాడా మజాకా (2019)
- పెళ్లిసందD (2022)
- దోషి
- రాజేంద్రుడు గజేంద్రుడు
- రెండిళ్ళ పూజారి
- మాయలోడు
- హలో బ్రదర్
- వారసుడు
- మామగారు
- పెదరాయుడు
- జంబలకిడిపంబ
- అప్పుల అప్పారావు
- ఇద్దరూ ఇద్దరే
- ఆయుధం (1990)
- ఆవారాగాడు (1998)
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-20. Retrieved 2013-12-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-13. Retrieved 2013-11-17.
- ↑ ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బాబు మోహన్ పేజీ
- All articles with dead external links
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- 1952 జననాలు
- ఖమ్మం జిల్లా సినిమా నటులు
- మెదక్ జిల్లా రాజకీయ నాయకులు
- మెదక్ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- మెదక్ జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)