పెదరాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదరాయుడు
Pedarayudu.jpg
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నిర్మాతమోహన్ బాబు
రచనకె. ఎస్. రవికుమార్ (కథ)
జి. సత్యమూర్తి (మాటలు)
రవిరాజా పినిశెట్టి (స్క్రీన్ ప్లే)
నటులుమోహన్ బాబు ,
సౌందర్య ,
రజనీకాంత్
సంగీతంకోటి
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాశరావు[1]
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
విడుదల
జూన్ 15, 1995 (1995-06-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నాట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో నటించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి.[2]

కథ[మార్చు]

పెదరాయుడు (మోహన్ బాబు) గ్రామ పెద్ద. క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతుంటాడు. తన వంశపారంపర్యంగా వచ్చిన ఆసనం మీద కూర్చుని గ్రామంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ధర్మాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వడంలో నేర్పరి. అతని భార్య లక్ష్మి (భానుప్రియ) తన భర్తను ఎంతో గౌరవిస్తుంటుంది. అతని తమ్ముళ్ళు రాజా (మోహన్ బాబు), రవీంద్ర (రాజా రవీంద్ర) లకు కూడా తమ అన్నయ్య అంటే భక్తి ప్రపత్తులతో ఉంటారు. వారిని తన స్వంత బిడ్డల్లా చూసుకుంటుంటాడు పెదరాయుడు. రాజా ఓ పారిశ్రామికవేత్త (సత్యనారాయణ) కూతురైన భారతి (సౌందర్య) ను వివాహం చేసుకుంటాడు. భారతికి తన భర్త అన్నకు అణిగి మణిగి ఉండటం నచ్చదు. అలాగే పెదరాయుడంటే లెక్కచేయకుండా ఉంటదు. కొన్ని సంఘటనల కారణంగా అతని గొప్పతనాన్ని తెలుసుకుని గౌరవించడం మొదలు పెడుతుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఢమ ఢమ గుండె ఢమరుకం"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
2. "కూ అన్నదోయి"  కె. ఎస్. చిత్ర  
3. "కదిలే కాలమా"  కె. జె. ఏసుదాసు  
4. "అబ్బ దీని సోకు"     
5. "బావవి నువ్వు"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర  

మూలాలు[మార్చు]

  1. "Peda Rayudu on Moviebuff.com". moviebuff.com. Retrieved 19 March 2018.
  2. Filmfare Awards. Web.archive.org (9 November 1999). Retrieved on 3 February 2013.