గొర్తి సత్యమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొర్తి సత్యమూర్తి
జననంమే 24
వెదురుపాక, (తూ.గో.జిల్లా రాయవరం మండలం)
మరణండిసెంబరు 14 2015
చెన్నైలోని తన స్వగృహం
మరణానికి కారణంగుండెపోటు
వృత్తిసంగీత దర్శకత్వం, గాయకుడు
ప్రసిద్ధులుకథ, కథనం, మాటలు, నవలా సాహిత్యం
మతంహిందూ
జీవిత భాగస్వామిశిరోమణి
పిల్లలుదేవీశ్రీప్రసాద్‌, పద్మిని, సాగర్‌
Notes
రచయితగా దాదాపు 30 సంవత్సరాల అనుభవం

గొర్తి సత్యమూర్తి ప్రముఖ సినిమా రచయిత. ఈయన సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు అయిన దేవి శ్రీ ప్రసాద్ యొక్క తండ్రి. ఆయన 90కిపైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు.[1] ఆయన నాలుగు వందల సినిమాలకు పైగా మాటలు అందించాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక. రామచంద్రపురంలో డిగ్రీ పూర్తి చేశారాయన. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ విద్యా కళాశాలలో బి.ఎడ్ చదువుకొని అధ్యాపక వృత్తిని చేపట్టారు.[3]

రచయితగా[మార్చు]

సాహిత్యం పట్ల సత్యమూర్తికి ఉన్న అభిలాష ఆయన్ని రచనా వ్యాసంగం వైపు నడిపించింది. చైతన్యం అనే నవలతో సాహిత్యప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన కలం నుంచి అనేక నవలలు, కథా సంకలనాలను వెలువడ్డాయి. ఆయన రచనల్లో పవిత్రులు, పునరంకితం, ఎదలోయల నిదురించే, దిగంబర అంబరం, అధర గరళం సాహిత్యాభినులను విశేషంగా అలరించాయి. మానవ సంబంధాల్లోని అంతఃసంఘర్షణ కథావస్తువుగా చేసుకొని తన రచనా ప్రక్రియను కొనసాగించారు. సత్యమూర్తి రచనల్లో భావుకతా ఎక్కువగా కనిపిస్తుంది. కథా, నవలా రచయితగా సత్యమూర్తికి లభించిన పేరు ప్రఖ్యాతులు ఆయన్ని సినీ రంగం వైపు మళ్లించాయి.[4]

సినిమా రంగంలో[మార్చు]

ఈయన సినీ జీవితాన్ని మేనమామ ఆదుర్తి సుబ్బారావు, మాయదారి మల్లిగాడు సినిమా చేస్తున్న సందర్భంలో సహాయ దర్శకుడిగా ప్రారంభమైంది. రచనలో ఉన్న ఆసక్తి కనిపెట్టి సుబ్బారావు ఒక చిన్న కథ ఇచ్చి దాన్ని సినిమా స్క్రిప్టుగా రూపుదిద్దమని పురమాయించాడు. సత్యానంద్ ఆ కథను ఒక నవలగా వ్రాశాడు. అది సుబ్బారావుకు నచ్చి, సినిమాలలో సంభాషణలు వ్రాసే అవకాశాన్నిచ్చాడు.[5]

రామానాయుడు నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన దేవత చిత్రంతో సత్యమూర్తి కథా రచయితగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ చిత్ర అద్భుత విజయంతో తెలుగు సినీ పరిశ్రమలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, అభిలాష, ఛాలెంజ్, జ్వాల, భలేదొంగ, మాతృదేవోభవ, కాంచన సీత, చంటి, పెదరాయుడు, శ్రీనివాస కళ్యాణం, నారీనారీనడుమ మురారి, బంగారు బుల్లోడు, పెళ్ళి, న్యాయం కోసం, ఖైదీ నెంబర్ 786, శత్రువు, రౌడీ అన్నయ్య, అమ్మదొంగా వంటి చిత్రాలు సత్యమూర్తికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి సినీ కెరీర్‌లో సత్యమూర్తి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్, జ్వాల చిత్రాలు చక్కటి ప్రజాదరణను చూరగొన్నాయి.[6]

సినిమాలు[మార్చు]

రచించిన సినిమాలు[మార్చు]

కుమారులు[మార్చు]

తన కుమారులు ఇద్దరూ సినీ రంగంలోనే స్థిరపడి మంచి పేరు సంపాదించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో, పాటలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. మరో కుమారుడు సాగర్ నేపథ్య గాయకుడిగా రాణిస్తున్నారు.[7]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]