రాజకుమారుడు
Jump to navigation
Jump to search
రాజకుమారుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
నిర్మాత | అశ్వనీ దత్ |
తారాగణం | మహేష్ బాబు , ప్రీతి జింటా ప్రకాశ్ రాజ్, సుమలత, జయలలిత (నటి) |
ఛాయాగ్రహణం | జయనన్ విన్సెంట్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1999 జూన్ 28 |
భాష | తెలుగు |
రాజకుమారుడు 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది.
కథ[మార్చు]
ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.
తారాగణం[మార్చు]
- మహేష్ బాబు - రాజకుమార్
- ప్రీతి జింటా - రాణి
- ప్రకాష్ రాజ్ - ధనంజయ
- జయప్రకాశ్ రెడ్డి - సర్వారాయుడు
- సుమలత - రాజ్యలక్ష్మీ, ధనంజయ భార్య
- కృష్ణ - కృష్ణమూర్తి
- మల్లిక
- అస్రాని - పోలిస్ ఇన్స్పెక్టర్
- శ్రీహరి - నర్సింగ్
- బ్రహ్మానందం - సబ్-ఇన్స్పెక్టర్ వగ్లే
- ఎం. ఎస్. నారాయణ - పోలీసు
పాటలు[మార్చు]
పాట | గాయకులు | రచన |
---|---|---|
రాంసక్కనోడమ్మ చందమామ | సుఖ్విందర్ సింగ్, చిత్ర | సుద్దాల అశోక్ తేజ |
ఎందుకీ ప్రాయము | ఎస్. పి. బాలు, చిత్ర | వేటూరి సుందరరామ్మూర్తి |
గోదారి గట్టు పైన | ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి | చంద్రబోస్ |
ఎప్పుడెప్పుడు | ఎస్. పి. బాలు, సుజాత | వేటూరి సుందర్రామ్మూర్తి |
బాలీవుడ్ బాలరాజుని | శంకర్ మహదేవన్ | వేటూరి సుందర్రామ్మూర్తి |
ఇందురుడూ చందురుడూ | ఎస్. పి. బాలు, చిత్ర | వేటూరి సుందర్రామ్మూర్తి |
బయటి లింకులు[మార్చు]
వర్గాలు:
- Articles with short description
- Short description is different from Wikidata
- 1999 తెలుగు సినిమాలు
- Pages using infobox film with unknown empty parameters
- ఘట్టమనేని మహేశ్ బాబు సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు