రజిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రజిత
Actress rajitha.jpg
జననంమల్లెల రజిత
(1972-10-18) 1972 అక్టోబరు 18 (వయస్సు: 46  సంవత్సరాలు)
కాకినాడ
నివాసంమాదాపూర్, హైదరాబాదు
చదువుఇంటర్మీడియట్
వృత్తిసినీ నటి
తల్లిదండ్రులు
  • మల్లెల రామారావు (తండ్రి)
  • మల్లెల విజయలక్ష్మి (తల్లి)

రజిత ఒక సినీ సహాయ నటి.[1] తెలుగులోనే కాక ఒరియా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 300 పైగా సినిమాల్లో నటించింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.

వ్యక్తిగత వివరాలు[మార్చు]

ఆమె తల్లిదండ్రులు మల్లెల రామారావు, విజయలక్ష్మి. వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, కొల్ల. తండ్రి రజిత చిన్నతనంలో ఉండగానే చనిపోయారు. తల్లే ఆమెను శ్రద్ధగా చదివించింది. ఆమె బాగా చదువుకుని డాక్టరు కావాలని అనుకునేది. రజితకు ఇద్దరు అక్కలు ఉన్నారు. పదో తరగతి దాకా కాకినాడలో చదివింది. ఇంటర్మీడియట్ చెన్నై లో చదివింది. రజిత పుస్తకాలు బాగా చదువుతుంది.[2] సహాయ నటీమణులు కృష్ణవేణి, రాగిణి ఆమెకు పినతల్లులు అవుతారు. వారు ఆ రంగంలోనే ఉన్నా ఆమెకు నటనపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. రజిత పెళ్ళి చేసుకోలేదు. తల్లితో కలిసి ఉంటున్నారు.

కెరీర్[మార్చు]

1987లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపుత్రుడు ఆమె మొదటి సినిమా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే చెన్నైలో ఉన్న పిన్నమ్మ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది. ఆమెతో కలిసి నాగార్జున హీరోగా అగ్నిపుత్రుడు సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమెను చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఆమెను చూసి ఆమెను రాఘవేంద్రరావుకు పరిచయం చేశాడు. ఆయన ఆమెను ఆ సినిమాలో నాగేశ్వరరావు కూతురుగా నటించమన్నారు. సినిమాల మీద ఆసక్తిలేక మొదట్లో వద్దని చెప్పినా వారు నచ్చచెప్పటంతో అందుకు అంగీకరించింది. తరువాత ఆమెకు వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాల్లో నటించిన తర్వాత మళ్లీ కాకినాడకు వచ్చి పదో తరగతి పూర్తి చేసింది. మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం చెన్నై వెళ్ళినపుడు చదువుకుంటూనే సినిమాల్లో నటించేది.

సాహసం చేయరా ఢింబకా, వివాహ భోజనంబు, చినరాయుడు లాంటి సినిమాల్లో నటించింది. తమిళం, కన్నడ భాషల్లో కథానాయికగా కూడా నటించింది. 1995 నుంచి నటన వైపు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది. తమిళం, కన్నడ సినిమాల్లో కథానాయికగా నటించింది.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "మా వెబ్ సైటులో రజిత ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 10 November 2016.
  2. "సినిమా కంటే పుస్తకమే మిన్న-సినీ నటి రజిత". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 10 November 2016.
  3. "143 review". idlebrain. Retrieved 16 May 2019. Cite web requires |website= (help)
  4. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=రజిత&oldid=2657985" నుండి వెలికితీశారు