భమ్ బోలేనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భమ్ బోలేనాథ్
భమ్ బోలేనాథ్ సినిమా పోస్టర్
దర్శకత్వంకార్తీక్ వర్మ
కథకార్తీక్ వర్మ దండు
నిర్మాతసిరివూరి రాజేష్ వర్మ, శ్రీకాంత్‌ దంతలూరి (సమర్పణ)
తారాగణంనవదీప్
పూజ ఝవేరి
ప్రదీప్ మాచిరాజు
నవీన్ చంద్ర
ఛాయాగ్రహణంభరణి కె. ధరణ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
27 ఫిబ్రవరి 2015 (2015-02-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

భమ్ బోలేనాథ్ 2015, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర, పూజ ఝవేరి నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

కథా నేపథ్యం

[మార్చు]

నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మి (పూజ)ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు. వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకొని వస్తున్న వివేక్ దగ్గరనుండి ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలకు పాయింట్‌ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది మిగతా కథ.[2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • కథ, కథనం, దర్శకత్వం: కార్తీక్ వర్మ
 • నిర్మాత: సిరివూరి రాజేష్ వర్మ
 • సహ నిర్మాతలు: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ
 • సమర్పణ: శ్రీకాంత్‌ దంతలూరి
 • మాటలు: శరణ్‌ కొప్పిశెట్టి, కార్తిక్‌ వర్మ దండు
 • సంగీతం: సాయి కార్తీక్
 • కూర్పు: ప్రవీణ్‌ పూడి
 • ఛాయాగ్రహణం: భరణి కె. ధరణ్
 • డ్యాన్స్‌: విజయ్‌
 • ఆర్ట్‌: జె.కె.మూర్తి
 • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రఘు పెన్మత్స
 • నిర్మాణ సంస్థ: ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. తన్మయి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

భమ్ బోలేనాథ్
సాటలు by
Releasedడిసెంబరు 6, 2014
Recorded2014
Genreపాటలు
Length15:14
Labelతన్మయి మ్యూజిక్
Producerసాయి కార్తీక్
సాయి కార్తీక్ chronology
అసుర
(2015)
భమ్ బోలేనాథ్
(2014)
సూపర్ స్టార్ కిడ్నాప్
(2015)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "భమ్ బోలేనాథ్ (రచన: బి. సుబ్బరాయశర్మ)"  సిద్ధార్ధ్ వాట్కిన్స్ 3:05
2. "మనసే (రచన: బాలాజీ)"  హరిచరణ్, సైంధవి 4:05
3. "ఉన్నోడైనా (రచన: బి. సుబ్బరాయశర్మ)"  రంజిత్ 3:32
4. "వన్స్ అపాన్ ఏ టైమ్ (రచన: కృష్ణ చైతన్య)"  ఎన్. సి. కారుణ్య, సుచిత్ర 2:24
5. "సేటుగర్ (రచన: బాలాజీ)"  ఎన్. సి. కారుణ్య, సుచిత్ర 2:08
15:14

ఇతర వివరాలు

[మార్చు]
 1. ఈ చిత్రానికి సంబంధించిన జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియోను రానా నేడు ట్విట్టర్‌లో విడుదల చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
 1. newstel. "Bham Bholenath and Ram Leela First day Box office Collection". Telugu Cinema News India. Archived from the original on 11 మార్చి 2015. Retrieved 24 February 2020.
 2. తెలుగు వెబ్ దునియా, రివ్యూ. "'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్". telugu.webdunia.com. Retrieved 24 February 2020.
 3. ప్రజాశక్తి, మూవీ (8 November 2016). "పౌరాణికం ఇష్టం పూజా జవేరి". Archived from the original on 5 April 2017. Retrieved 24 February 2020.
 4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (2 November 2015). "పొరపాట్ల వల్లే ఫ్లాపులొచ్చాయన్న నవీన్ చంద్ర". Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
 5. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]