ఫిష్ వెంకట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిష్ వెంకట్
Fish venkat.jpg
జన్మ నామంమంగిలంపల్లి వెంకటేశ్‌
జననం
India హైదరాబాదు, భారతదేశం
ప్రముఖ పాత్రలు ఆది
బన్ని
కింగ్

ఫిష్ వెంకట్ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా హాస్య ప్రధాన మరియు సహాయ పాత్రలు వేస్తుంటాడు.

నేపధ్యము[మార్చు]

ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్‌. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు వి.వి.వినాయక్ ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఇతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్ళి చేసేశారు. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో ప్రతినాయక్ పాత్రలు చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. మూడవ కుమారుడు ప్రాథమిక విద్య చదువుతున్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2002 ఆది (సినిమా)
2005 భగీరథ
బన్ని
2006 సామాన్యుడు
2008 కింగ్
హీరో
శౌర్యం
రెడీ
కాళిదాసు (2008 సినిమా)
పౌరుడు
2009 శంఖం (సినిమా)
గణేశ్
2010 డాన్ శీను
పప్పు (సినిమా)
వరుడు
సీతారాముల కళ్యాణం లంకలో
అదుర్స్
2011 మిరపకాయ్
వీర
కందిరీగ (సినిమా) చింటు
వీడు తేడా
సోలో
2012 దరువు ఫిష్ ఫిష్ వెంకట్
సుడిగాడు వెంకట్
గబ్బర్ సింగ్
2013 నాయక్ (సినిమా)
2018 కన్నుల్లో నీ రూపమే

బయటి లింకులు[మార్చు]