ఇష్టంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇష్టంగా
దర్శకత్వంసంపత్ వీ రుద్ర‌
కథసంపత్ వీ రుద్ర‌
నిర్మాతఅడ్డూరి వెంకటేశ్వరరావు
తారాగణం
 • అర్జున్ మహి
 • తనిష్క్ రాజన్
 • దువ్వాసి మోహ‌న్
ఛాయాగ్రహణంఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్
కూర్పుబొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతంయేలేంద్ర మహావీర్
నిర్మాణ
సంస్థ
ఏవీఆర్ మూవీ వండర్స్
విడుదల తేదీ
2018 డిసెంబరు 8 (2018-12-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇష్టంగా 2018లో తెలుగులో విడుదలైన లవ్ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు సంపత్ వీ రుద్ర‌ దర్శకత్వం వహించాడు. అర్జున్ మహి, తనిష్క్ రాజన్, దువ్వాసి మోహ‌న్ ప్రధాన పాత్రల్లో నటించగా సినిమా డిసెంబర్ 28న విడుదలైంది.[1]

కథ[మార్చు]

డ్యాన్సర్ కృష్ణ (అర్జున్ మహి) అమ్మాయిలతో జల్సాగా తిరుగుతూ జీవితాన్ని పరిపూర్ణంగా బతికే యువకుడు. అలాంటి లక్షణాలు ఉన్న కృష్ణకు సత్య (తనిష్క్ రాజన్) జర్నలిస్టుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకొందామని అడిగిన సత్య ప్రపోజల్‌ను కృష్ణ తిరస్కరిస్తాడు. పెళ్లి మీద తనకు నమ్మకం లేదని, సహజీవనమే ఇష్టమని చెబుతాడు. ఆ క్రమంలో వారి మధ్య లవ్ బ్రేక్ అవుతుంది. కృష్ణ, సత్య మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి? కృష్ణ సహజీవనం ప్రపోజల్‌ను సత్య అంగీకరించిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
 • నిర్మాత: అడ్డూరి వెంకటేశ్వరరావు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ వీ రుద్ర‌
 • రచన సహకారం: చిట్టి శర్మ
 • సంగీతం: యేలేంద్ర మహావీర్
 • సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్
 • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
 • మాటలు: శ్రీనాధ్ బాదినేని
 • పాటలు: కందికొండ రాంబాబు గోశాల, అలరాజు
 • ఆర్ట్: విజయ్ కృష్ణ
 • ఫైట్స్: షావలిన్' మల్లేష్

మూలాలు[మార్చు]

 1. Zee Cinemalu (27 December 2018). "వీకెండ్ రిలీజెస్" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇష్టంగా&oldid=3519603" నుండి వెలికితీశారు