మధునందన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధునందన్
జననం
హైదరాబాదు
విద్యఎంబీయే
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
జీవిత భాగస్వాములుహసిత

మధునందన్ ఒక సినీ నటుడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[1] మధు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేసి కొన్నాళ్ళు అమెరికా లో ఉన్నాడు.[2] సినిమా రంగమీద మక్కువతో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి సినిమాల్లో కొనసాగుతున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, కొత్త జంట అతను నటించిన కొన్ని సినిమాలు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మధునందన్ హైదరాబాదులో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి. ఇంట్లో వాళ్ళెవరికీ ఆ రంగంతో సంబంధం లేకపోవడంతో మొదట్లో అతను సినీ రంగంలోకి వెళ్ళడానికి ప్రోత్సహించలేదు. మధు మాత్రం పట్టుదలగా తనకిష్టమైన రంగాన్నే ఎంచుకున్నాడు. చదువుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేశాడు. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఎంబీయే పూర్తయిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా మనసు నటన వైపే లాగుతుండటంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాడు.

మధు తన సహోద్యోగియైన హసితను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇష్క్ సినిమా తర్వాత వాళ్ళ పెళ్ళి జరిగింది. వారికి ఓ కూతురు ఉంది.

కెరీర్[మార్చు]

ఇంటర్ పరీక్షలు పూర్తి కాగానే తేజ చేస్తున్న నువ్వు నేను సినిమా కోసం కొత్త నటుల కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని అందులో ఎంపికయ్యాడు. దాని తర్వాత పది హేను దాకా సినిమాలు చేశాడు. అమెరికా నుంచి తిరిగొచ్చాక నితిన్ తో ముందున్న పరిచయంతో ఇష్క్ సినిమాలో అవకాశం వచ్చింది.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సమీర, నేలపూడి. "సాక్షి ఫన్ డే : తన నమ్మకమే నన్ను నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 15 November 2016.
  2. భండారం, విష్ణుప్రియ. "Better late than never". thehindu.com. ది హిందు. Retrieved 15 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=మధునందన్&oldid=3253505" నుండి వెలికితీశారు